iDreamPost
android-app
ios-app

పరాగ్- శాంసన్ విధ్వంసం.. గిల్ చేసిన పొరపాటే ఇది..

GT vs RR- Gill Failed As A Captain: గుజరాత్ టైటాన్స్- రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ కెప్టెన్ గా దారుణంగా విఫలమైనట్లు కనిపించాడు. ముఖ్యంగా రియాన్ పరాగ్- సంజూ శాంసన్ లను కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమయ్యాడు.

GT vs RR- Gill Failed As A Captain: గుజరాత్ టైటాన్స్- రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ కెప్టెన్ గా దారుణంగా విఫలమైనట్లు కనిపించాడు. ముఖ్యంగా రియాన్ పరాగ్- సంజూ శాంసన్ లను కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమయ్యాడు.

పరాగ్- శాంసన్ విధ్వంసం.. గిల్ చేసిన పొరపాటే ఇది..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ప్రతి మ్యాచ్ ఆసక్తిగా సాగుతోంది. ఒక్క ఓవర్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తోంది. ఆఖరి వరకు ఉత్కంఠ కొనసాగుతోంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్- గుజరాత్ టైటాన్ మధ్య మ్యాచ్ కూడా అలాగే సాగింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ జట్టు కాసేపు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లను కట్టడి చేసినట్లు కనిపించింది. కానీ, రియాన్ పరాగ్, కెప్టెన్ సంజూ శాంసన్ విజృంభించడంతో గుజరాత్ జట్టు బౌలర్లు చేతులెత్తేశారు. 170 పరుగులకే రాజస్థాన్ జట్టు పరిమితవుతుంది అనుకున్నారు. కానీ, ఆ జట్టుతో ఏకంగా 196 పరుగులు చేయించారు. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో గుజరాత్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ వైఫల్యమై కనిపించింది.

జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో రియాన్ పరాగ్, సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. రియాన్ పరాగ్ కేవలం 48 బంతుల్లో 5 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో ఏకంగా 76 పరుగులు చేశాడు. మరోవైపు సంజూ శాంసన్ కేవలం 38 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశాడు. పైగా సంజూ శాంసన్ ని గుజరాత్ బౌలర్లు అవుట్ కూడా చేయలేకపోయారు. ఈ మ్యాచ్ లో పరాగ్, శాంసన్ ఎంతో క్లాస్ ఇన్నింగ్స్ ఆడారు అనడంలో సందేహం లేదు. అయితే ఇక్కడ శుభ్ మన్ గిల్ వైఫల్యం ఎక్కడ ఉంది అంటే? కెప్టెన్ గా గిల్ ఎన్నో పొరపాట్లు చేసినట్లు కనిపించింది. బౌలర్లు ఎక్స్ పెన్సివ్ గా మారుతున్న తరుణంలో గిల్ ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు.

ముఖ్యంగా రియాన్ పరాగ్- సంజూ శాంసన్లకు లైఫుల మీద లైఫులు ఇచ్చి తక్కువ స్కోర్ తో పోవాల్సిన మ్యాచ్ ని టఫ్ స్కోర్ వచ్చే వరకు లాక్కొచ్చారు. నిజానికి రియాన్ పరాగ్ కి గుజరాత్ జట్టు రెండు లైఫులు ఇచ్చింది. సున్నా పరుగల వద్ద పరాగ్ క్యాచ్ డ్రాప్ చేశారు. ఆ తర్వాత 6 పరుగుల వద్ద కూడా రియాన్ పరాగ్ ఇచ్చిన క్యాచ్ ని గుజరాత్ ఫీల్డర్స్ నేలపాలు చేశారు. ఇంకేముంది.. రెచ్చిపోయిన పరాగ్ ఏకంగా 76 పరుగులు చేశాడు. మరోవైపు సంజూ శాంసన్ కి కూడా 48 పరుగుల బౌండరీ మీద లైఫ్ ఇచ్చారు. ఆ తర్వాత అతను ఏకంగా స్కోర్ బోర్డుకి 20 పరుగులు జోడించాడు.

జట్టు ఫీల్డింగ్ లో కూడా విఫలమవుతున్న నేపథ్యంలో శుభ్ మన్ గిల్ కెప్టెన్ తీసుకు జాగ్రత్తలు, ప్లేయర్లతో మాట్లాడిన సందర్భాలు కనిపించలేదు. వైడ్ ఇస్తే రివ్యూకి వెళ్లి.. అంపైర్ తో వాగ్వాదానికి దిగుతున్నాడు. ధర్డ్ అంపైర్ వైడ్ ఇస్తే దానికి ఆన్ ఫీల్డ్ అంపైర్ దగ్గర అసహనం వ్యక్తం చేశాడు. సంజూ శాంసన్ గాల్లోకి ఎగిరినా అందని బాల్ ని అంపైర్ వైడ్ గా ప్రకటిస్తే.. దానికి కూడా రివ్యూకి వెళ్లాడు. ఇలా ఈ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ కెప్టెన్ ఎంతో దారుణమైన నిర్ణయాలు తీసుకున్నాడ. మాట్లాడాల్సిన చోట సైలెంట్ గా ఉండి.. సైలెంట్ గా ఉండాల్సిన చోట మాత్రం అసహనం వ్యక్తం చేస్తూ కనిపించాడు. మరి.. సంజూ శాంసన్, రియాన్ పరాగ్ విధ్వంసం వెనుక గిల్ వైఫల్యం ఉందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.