Nidhan
రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటిదాకా ఐపీఎల్ హిస్టరీలో ఏ బౌలర్‌కూ సాధ్యం కాని రికార్డును అతడు క్రియేట్ చేశాడు.
రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటిదాకా ఐపీఎల్ హిస్టరీలో ఏ బౌలర్‌కూ సాధ్యం కాని రికార్డును అతడు క్రియేట్ చేశాడు.
Nidhan
ఐపీఎల్-2024 ఆసాంతం అద్భుతమైన బౌలింగ్‌తో అదరగొట్టాడు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్. మణికట్టు మాయాజాలంతో రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. రవిచంద్రన్ అశ్విన్‌తో కలసి ప్రత్యర్థి జట్ల పనిపట్టాడు. ఆర్సీబీతో జరుగుతున్న ఎలిమినేటర్లోనూ అతడు తన మ్యాజిక్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ (33)ను వెనక్కి పంపాడు చాహల్. ఈ వికెట్‌తో అతడు చరిత్ర సృష్టించాడు.
యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటిదాకా ఐపీఎల్ హిస్టరీలో ఏ బౌలర్‌కూ సాధ్యం కాని రికార్డును అతడు క్రియేట్ చేశాడు. కోహ్లీని ఔట్ చేయడం ద్వారా ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ తరఫున లీడింగ్ వికెట్ టేకర్ (66 వికెట్లు)గా అవతరించాడు చాహల్. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన ఆర్సీబీకి కూడా ఇంకా అతడే హయ్యెస్ట్ వికెట్ టేకర్ (139 వికెట్లు)గా ఉన్నాడు. ఇలా ఐపీఎల్లో రెండు జట్ల తరఫున టాప్ వికెట్ టేకర్‌గా నిలిచిన ఒకే ఒక బౌలర్‌గా చాహల్ రేర్ ఫీట్ నమోదు చేశాడు.
Yuzi Chahal is now the leading wicket taker for both RCB and RR in IPL history. 👏💥 pic.twitter.com/LXEjbptmYq
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 22, 2024