Nidhan
ఆశల్లేని స్థితి నుంచి ఓ యుద్ధం చేసి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది ఆర్సీబీ. కానీ కీలకమైన ఎలిమినేటర్‌లో మాత్రం ప్రత్యర్థికి సరెండర్ అయిపోయింది. దీంతో ఆ టీమ్ ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు.
ఆశల్లేని స్థితి నుంచి ఓ యుద్ధం చేసి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది ఆర్సీబీ. కానీ కీలకమైన ఎలిమినేటర్‌లో మాత్రం ప్రత్యర్థికి సరెండర్ అయిపోయింది. దీంతో ఆ టీమ్ ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు.
Nidhan
ఆశల్లేని స్థితి నుంచి ఓ యుద్ధం చేసి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది ఆర్సీబీ. ఒక్కో మ్యాచ్‌ను డూ ఆర్ డైగా ఆడుతూ గెలుస్తూ పోయింది. ప్లేఆఫ్స్ చేరాలంటే ఉన్న ఒక్క శాతం అవకాశాలను మెరుగుపర్చుకుంటూ పోయింది. 1 పర్సెంట్‌ను కొన్ని వారాల్లోనే 100 పర్సెంట్‌కు పెంచుకుంది. వరుసగా ఆరు మ్యాచుల్లో గెలిచి దర్జాగా ప్లేఆఫ్స్ గడప తొక్కింది. అయితే తుది దశకు చేరాలంటే కీలకమైన ఎలిమినేటర్‌లో మాత్రం ప్రత్యర్థికి సరెండర్ అయిపోయింది. రాజస్థాన్ రాయల్స్‌తో అహ్మదాబాద్ వేదికగా నిన్న జరిగిన ఎలిమినేటర్ ఫైట్‌లో బెంగళూరు 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఇంటిదారి పట్టింది డుప్లెసిస్ సేన. ఈసారి కప్పు కొట్టడం ఖాయం అనుకుంటున్న తరుణంలో ఆ టీమ్ ఇంటిదారి పట్టడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
రాజస్థాన్‌పై ఓటమిని కింగ్ కోహ్లీ కూడా తట్టుకోలేకపోయాడు. మ్యాచ్ ముగిశాక అతడి ముఖంలో ఆ బాధ స్పష్టంగా కనిపించింది. విరాట్ కళ్లలో బాధ, నిరాశ, నిస్పృహ కనిపించాయి. అయితే నిన్నటి మ్యాచ్‌లో కోహ్లీకి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. రాజస్థాన్ ఇన్నింగ్స్ టైమ్‌లో పేసర్ యష్ దయాల్ మీద విరాట్ సీరియస్ అవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 17వ ఓవర్లో యష్ రెండు బౌండరీలు ఇవ్వడంతో కోహ్లీ ఆగ్రహానికి గురయ్యాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అతడు.. పట్టరాని కోపంతో కూల్ డ్రింక్ బాటిల్‌ను విసిరికొట్టాడు. ఇదేం బౌలింగ్ అంటూ దయాల్ మీద సీరియస్ అయ్యాడు. ఇలాగేనా ఆడేది అంటూ చేతితో సంజ్ఞలు చేస్తూ కనిపించాడు.
కోహ్లీ బాటిల్ విసిరికొట్టిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. కొందరు అతడికి మద్దతు తెలుపుతుంటే, మరికొందరు ఇది కరెక్ట్ కాదని అంటున్నారు. కోహ్లీ టీమ్ గెలుపు కోసం ఎంతో చేశాడని.. ఓడిపోతుంటే ఆ బాధను తట్టుకోలేకే సీరియస్ అయ్యాడని సమర్థిస్తున్నారు. యష్ దయాల్ లాంటి యంగ్ క్రికెటర్లకు ఇలా ఆడమంటూ సపోర్ట్ చేయాల్సింది పోయి, ఇలా అరిస్తే ఎలా అని.. విరాట్ చేసింది ముమ్మాటికీ తప్పు అంటూ మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. సీనియర్ ప్లేయర్ కాబట్టి సంయమనంతో ఉండాలని, అగ్రెషన్‌ను గేమ్‌లో చూపించాలని, ఇలా సహచరుల మీద చూపించడం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. కోహ్లీ బాటిల్ విసిరిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Abusing Dhayal, Throwing the water bottle. This guy is actually Ret@rded. Please take him to a good psychiatrist @AnushkaSharma pic.twitter.com/2t2P8aW6qF
— 𝐒𝐞𝐫𝐠𝐢𝐨 (@SergioCSKK) May 23, 2024