iDreamPost
android-app
ios-app

RCBని ముంచేస్తున్న మ్యాక్స్ వెల్.. ఇంట్రెస్ట్ లేకుండా ఆడుతున్నాడా?

RCB vs RR- Maxwell Again Failed: ఐపీఎల్ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు అభిమానుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. జట్టుకు బలం అవుతాడు అనుకున్న మ్యాక్స్ వెల్ వరుసగా విఫలమవుతూ బెంబేలెత్తిస్తున్నాడు.

RCB vs RR- Maxwell Again Failed: ఐపీఎల్ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు అభిమానుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. జట్టుకు బలం అవుతాడు అనుకున్న మ్యాక్స్ వెల్ వరుసగా విఫలమవుతూ బెంబేలెత్తిస్తున్నాడు.

RCBని ముంచేస్తున్న మ్యాక్స్ వెల్.. ఇంట్రెస్ట్ లేకుండా ఆడుతున్నాడా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో అన్ని మ్యాచులు ఫైనల్ ఫీల్ ఇస్తున్నాయి. ప్రతి టీమ్ విజయం కోసం తెగ పోరాడుతున్నాయి. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కూడా అలాగే జరిగింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2024 సీజన్ లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఆడిన 72 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో విరాట్ కోహ్సీ మొత్తం 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ లో విరాట్ విజృంభించడంతో ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. మ్యాక్స్ వెల్ తీరు చూస్తే ఆర్సీబీ ఫ్యాన్స్ కి కంగారు పెరుగుతోంది. అసలు మ్యాక్స్ వెల్ కి ఐపీఎల్ మీద, ఆర్సీబీ జట్టు మీద ఇంట్రస్ట్ ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఐపీఎల్ అంటే కేవలం మన క్రికెటర్స్ మాత్రమే కాకుండా విదేశీ ఆటగాళ్లను కూడా జట్టులో చేర్చుకుని కలిపి ఆడే ఆట. మిగిలిన ఫార్నర్స్ సంగతి ఏమో గానీ.. మ్యాక్స్ వెల్ మాత్రం ఐపీఎల్ లో ఎంతో డిఫరెంట్ కనిపిస్తాడు. దేశం తరఫున ఆడేటప్పుడు ఒంటికాలు మీద బౌండరీలు, సిక్సర్లు బాదే మ్యాక్సీ.. ఐపీఎల్ కి రాగానే ఎందుకో గల్లీ క్రికెటర్లా మారిపోతాడు. అతని బ్యాటింగ్ లో ఎక్కడా ఐపీఎల్ మీద ఆసక్తి.. ఆర్సీబీకి తొలి కప్పు అందించాలనే కసి కనిపించదు. ఇన్నేళ్ల నుంచి ఆర్సీబీని భుజానవేసుకుని లాక్కొస్తున్న కింగ్ కోహ్లీ ఇవాళ కూడా అదే పని చేశాడు. మ్యాక్స్ వెల్ మాత్రం ఈ మ్యాచ్ లో కూడా తనదైన పేలవ ప్రదర్శనతో విఫలమయ్యాడు.

మ్యాక్సీ ఆట చూసిన తర్వాత ఆర్సీబీ అభిమానుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. టీమ్ అసెట్ అని భావిస్తున్న మ్యాక్స్ వెల్ జట్టుకి భారంగా అవుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీజన్ ని గోల్డెన్ డక్ తో మొదలు పెట్టిన మ్యాక్స్ వెల్ అదే పేస్ ని కొనసాగిస్తున్నాడు. ఎక్కడా కూడా పరుగులు చేయకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఆర్సీబీ జట్టు పదే పదే మ్యాక్స్ వెల్ కి అకాశాలు ఇస్తూ మోసోపోతోంది అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. రూ.20 లక్షల బేస్ ప్రైస్ తో తీసుకున్న ఆటగాళ్లు, అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఈ సీజన్లో విజృభిస్తుంటే మ్యాక్స్ వెల్ మాత్రం పదే పదే విఫలమవుతూ అందరినీ నిరాశకు గురి చేస్తున్నాడు.

ఇప్పటి వరకు మ్యాక్సీ ప్రదర్శన చూస్తే.. తొలి మ్యాచ్ లో చెన్నై జట్టు మీద గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరాడు. రెండో మ్యాచ్ లో పంజాబ్ మీద 5 బాల్స్ కి కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత మూడో మ్యాచ్ లో కేకేఆర్ మీద 19 బంతుల్లో 28 పరుగులు చేసి పర్వాలేదు అనిపించాడు. ఆర్సీబీ ఆడిన నాలుగో మ్యాచ్ లో లక్నో జట్టు మీద 2 బంతులు ఎదుర్కొని డక్ అవుట్ అయ్యాడు. ఇప్పుడు తాజాగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ 3 బంతులకు ఒక్క పరుగు చేశాడు. బర్గెర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ గా పెవిలియన్ చేరాడు. ఈ తరహా ప్రదర్శనతో మ్యాక్స్ వెల్ ఆర్సీబీని నట్టేట ముంచుతాడే గానీ.. కప్పు అందించలేడు అంటున్నారు. మరి.. మ్యాక్స్ వెల్ వరుసగా విఫలమవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.