Nidhan
రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర మరోమారు అంపైర్లతో గొడవపడ్డాడు. ఈసారి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. సంగక్కర ఎందుకు ఇంత సీరియస్ అయ్యాడో ఇప్పుడు తెలుసుకుందాం..
రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర మరోమారు అంపైర్లతో గొడవపడ్డాడు. ఈసారి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. సంగక్కర ఎందుకు ఇంత సీరియస్ అయ్యాడో ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర ఎప్పుడూ కామ్‌గా, కూల్‌గా ఉంటాడు. డగౌట్లో కూర్చొని టీమ్ గెలుపు కోసం అవసరమైన ప్లాన్స్ వేస్తుంటాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే సంగక్కర.. ఈ ఐపీఎల్లో మాత్రం కాస్త సీరియస్‌గా కనిపిస్తున్నాడు. ఈ సీజన్లో మరోమారు అంపైర్లతో గొడవపడ్డాడు. ఈసారి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. సంగక్కర ఎందుకు ఇంత సీరియస్ అయ్యాడో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆర్సీబీ ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ పేసర్ ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో గుడ్ లెంగ్త్ డెలివరీకి షాట్ ఆడదామని అనుకున్నాడు దినేష్ కార్తీక్. కానీ బంతి బ్యాట్‌ను మిస్సై ప్యాడ్స్‌ను తాకింది. దీంతో అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. అయితే డీకే రివ్యూ తీసుకోగా.. థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ఇచ్చాడు. బాల్ మొదట బ్యాట్‌కు తగిలి ఆ తర్వాత ప్యాడ్స్‌కు తగిలిందని.. అందుకే నాటౌట్ అని ప్రకటించాడు. ఈ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన సంగక్కర.. అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. డీకేను అలా ఎలా నాటౌట్ ఇస్తారంటూ ఏకంగా థర్డ్ అంపైర్‌ను కలిసేందుకు ప్రయత్నించాడు. ఆ ఫొటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Dinesh Karthik survives! What a review 🥶
Kumar Sangakkara wants to have a meeting with the umpires 🤯🤯🤯#IPL2024 #RRvRCB #tapmad #HojaoADFree pic.twitter.com/XUx8ucuu72
— Farid Khan (@_FaridKhan) May 22, 2024
Kumar Sangakkara wanted to meet the 3rd umpire straightaway. pic.twitter.com/iCwZin4Lj0
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 22, 2024