వీడియో: రింకూను ఏడిపించిన కోహ్లీ.. ఈ రేంజ్ ర్యాగింగ్ అస్సలు చూసుండరు!

విరాట్ కోహ్లీ సహచర ప్లేయర్లతో ఎలా ఉంటాడో తెలిసిందే. నవ్వుతూ, తోటి ఆటగాళ్లను నవ్విస్తూ ఫుల్ జోవియల్​గా ఉంటాడు. అలాంటోడు పించ్ హిట్టర్ రింకూ సింగ్​ను ఏడిపించాడు.

విరాట్ కోహ్లీ సహచర ప్లేయర్లతో ఎలా ఉంటాడో తెలిసిందే. నవ్వుతూ, తోటి ఆటగాళ్లను నవ్విస్తూ ఫుల్ జోవియల్​గా ఉంటాడు. అలాంటోడు పించ్ హిట్టర్ రింకూ సింగ్​ను ఏడిపించాడు.

విరాట్ కోహ్లీ.. ఈ పేరు చెబితే పరుగుల వరద, సెంచరీలు, రికార్డులు ఇవే అందరికీ గుర్తుకొస్తాయి. అయితే వీటితో పాటు అతడి కల్మషం లేని నవ్వు, యాటిట్యూడ్ కూడా అందరికీ ఇష్టం. గ్రౌండ్​తో పాటు బయట కూడా చిల్​గా, ఫన్నీగా ఉంటాడు కింగ్. తనతో ఉన్నవారిని నవ్విస్తూ ఉంటాడు. విరాట్ ఒక దగ్గర ఉన్నాడంటే అక్కడ ఫుల్ ఎంటర్​టైన్​మెంట్ ఉంటుంది. జోకులు వేస్తూ అందర్నీ కడుపుబ్బా నవ్విస్తుంటాడు. అలాంటోడు తన తోటి ప్లేయర్​ను ఏడిపించాడు. కుర్రాడు అని కూడా చూడకుండా ర్యాగింగ్ చేశాడు. అవును, కోల్​కతా నైట్ రైడర్స్​తో శుక్రవారం జరిగిన మ్యాచ్​లో ఆ టీమ్ యంగ్ బ్యాటర్ రింకూ సింగ్​ను ఓ ఆటాడుకున్నాడు విరాట్. టీమిండియాలో కలసి ఆడే వీళ్లిద్దరూ.. నిన్నటి మ్యాచ్​లో ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు.

ప్రత్యర్థులకు సవాల్ విసరడంలో ముందుండే కోహ్లీ.. కేకేఆర్​తో మ్యాచ్​లో రింకూ సింగ్​కు ఛాలెంజ్ చేశాడు. అందులో విరాటే గెలిచాడు. క్రికెట్​లో వికెట్ల మధ్య అత్యంత వేగంగా పరిగెత్తే వారిలో కోహ్లీ ఒకడనేది తెలిసిందే. సింగిల్స్​ను డబుల్స్​గా మలచడంలో అతడు దిట్ట. ఇక, ఈ జనరేషన్​లో బెస్ట్ ఫీల్డర్స్​లో ఒకడిగా రింకూ పేరు తెచ్చుకున్నాడు. గ్రౌండ్ ఫీల్డింగ్​లో విలువైన రన్స్ కాపాడుతూ, బౌండరీల దగ్గర సూపర్బ్​గా క్యాచులు పడుతూ మంచి ఫీల్డర్​గా గుర్తింపు సంపాదించాడతను. అలాంటోడికి షాకిచ్చాడు కోహ్లీ. కేకేఆర్​తో మ్యాచ్​లో సునీల్ నరైన్ బౌలింగ్​లో ఆఫ్ సైడ్ షాట్ కొట్టాడు విరాట్. బాల్ వెళ్లిన ఏరియాను బట్టి సింగిల్ తీస్తే ఓకే. కానీ అక్కడ కోహ్లీ మెరుపు వేగంతో పరిగెత్తి రెండు రన్స్ తీశాడు.

డబుల్ తీసేందుకు ప్రయత్నించిన కోహ్లీని ఔట్ చేసేందుకు ప్రయత్నించాడు రింకూ. రాకెట్ స్పీడ్​తో కీపర్ సాల్ట్ వైపు త్రో వేశాడు. కానీ రన్ తీసే క్రమంలో రింకూను గమనించిన విరాట్ బాల్ వచ్చే లోపే డైవ్ చేసి మరీ క్రీజులోకి చేరుకున్నాడు. రనౌట్ మిస్సవడంతో రింకూ నిరాశలో కూరుకపోయాడు. అయితే సింగిల్ రావాల్సిన చోట డబుల్ తీసిన జోష్​లో ఉన్న కోహ్లీ అతడ్ని ర్యాగింగ్ చేశాడు. రింకూ వైపు చూస్తూ.. తాను సాధించానంటూ గాల్లో పంచ్​లు విసిరాడు. చిన్నగా ఓ డాన్స్ స్టెప్ కూడా వేసి అతడ్ని ఏడిపించాడు. రనౌట్ మిస్సైన బాధలో ఉన్న రింకూ.. కోహ్లీ రియాక్షన్ చూసి నవ్వుకున్నాడు. మరి.. రింకూ త్రోకు విరాట్ ఇచ్చిన రియాక్షన్ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments