ఎలిమినేటర్ అంటే RCBలో కనిపించని భయం.. కోహ్లీ టీమ్​ ధైర్యం అదే!

నాకౌట్ మ్యాచ్​లు అంటే ఎంతటి తోపు టీమ్ అయినా భయపడాల్సిందే. కానీ ఆర్సీబీలో మాత్రం అది ఏమాత్రం కనిపించడం లేదు. ఎలిమినేటర్​కు ముందు కోహ్లీ టీమ్ ఫుల్ కాన్ఫిడెన్స్​తో కనిపిస్తోంది.

నాకౌట్ మ్యాచ్​లు అంటే ఎంతటి తోపు టీమ్ అయినా భయపడాల్సిందే. కానీ ఆర్సీబీలో మాత్రం అది ఏమాత్రం కనిపించడం లేదు. ఎలిమినేటర్​కు ముందు కోహ్లీ టీమ్ ఫుల్ కాన్ఫిడెన్స్​తో కనిపిస్తోంది.

ఐపీఎల్-2024లో ఇంకో ఇంట్రెస్టింగ్​ మ్యాచ్​కు సర్వం సిద్ధమైంది. ప్లేఆఫ్స్​కు చేరుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య మరికొన్ని గంటల్లో ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్​లో నెగ్గిన జట్టు క్వాలిఫయర్-2లో సన్​రైజర్స్​ హైదరాబాద్​తో తలపడుతుంది. అక్కడ కూడా గెలిస్తే ఫైనల్ చేరుతుంది. అందుకే ఇది నాకౌట్ మ్యాచ్​గా మారింది. ఇక మీదట గెలిచిన జట్టు నెక్స్ట్ స్టేజ్​కు, ఓడిన జట్టు ఇంటికి వెళ్లిపోవాల్సిందే. అందుకే ఎలాగైనా నెగ్గి తీరాల్సిందేనని ఆర్సీబీ, రాజస్థాన్ పట్టుదలతో ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్​ అంటే.. సంజూ సేన వణికిపోతోంది. ఎలా గెలవడమా అని తలలు పట్టుకుంటోంది. అటు బెంగళూరు మాత్రం ఏ టెన్షన్ లేకుండా కూల్​గా ఉంది. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఆర్సీబీ-ఆర్ఆర్ నడుమ మరికొన్ని గంటల్లో ఎలిమినేటర్ పోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్​ అంటే బెంగళూరు చాలా ఉత్సాహంగా కనిపిస్తోంది. కానీ రాజస్థాన్ మాత్రం భయపడుతోంది. దీనికి కారణం ఇరు జట్ల దృక్పథమే. గత ఏడెనిమిది మ్యాచులన్నీ డూ ఆర్ డైగా ఆడుతూ వచ్చింది ఆర్సీబీ. దీంతో వాళ్లకు భయం పోయింది. అలాగని కోహ్లీ టీమ్ ఎలిమినేటర్​ను లైట్ తీసుకోవడం లేదు. అపోజిషన్ టీమ్​కు ఇచ్చి పడేయాలని చూస్తోంది. ప్లేఆఫ్స్​ చేరుకునే క్రమంలో వరుసగా ఆరు మ్యాచుల్లో విజయం సాధించిన ఆర్సీబీ.. ఈ మ్యాచ్​లోనూ గెలుస్తామనే విశ్వాసంతో కనిపిస్తోంది. సీఎస్​కే, ఎస్​ఆర్​హెచ్​ సహా టాప్ టీమ్స్​ను చిత్తు చేసి ఇక్కడి వరకు రావడంతో ఆ టీమ్​లో ఈ మ్యాచ్​ అంటే భయం బదులు ఎగ్జయిట్​మెంట్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇందులో సత్తా చాటి ఎస్​ఆర్​హెచ్​తో పోరుకు రెడీ అవ్వాలనే కసి కనిపిస్తోంది.

ఎలిమినేటర్​ను ఓ ఛాలెంజర్​గా చూస్తోంది డుప్లెసిస్ సేన. ఇప్పటికే ఓటములు అంటే ఎలా ఉంటుందో చవిచూసింది ఆర్సీబీ. అక్కడి నుంచి తేరుకొని గెలుపు బాట పట్టడమూ నేర్చుకుంది. ఎక్కడ టెంపో తగ్గించాలి, ఎక్కడ మూమెంటమ్​ను అందుకోవాలి అనే ఆనుపాళ్లను పట్టేసింది. అందుకే ఇప్పుడు ఫియర్​కు బదులు కాన్ఫిడెన్స్ ఆర్సీబీ క్యాంప్​లో కనిపిస్తోంది. అదే రాజస్థాన్​ మాత్రం ఈ మ్యాచ్​ అంటేనే వణుకుతోంది. దానికి వరుణ ఓటములు ఒక కారణమైతే.. చావోరేవో తేల్చుకోవాల్సిన స్థితి ఈ సీజన్​లో ఆ టీమ్​కు ఇదే ఫస్ట్ టైమ్ కావడం మరో రీజన్. ఫస్టాఫ్​లో అదరగొట్టిన సంజూ సేన.. ఇప్పుడు వరుస మ్యాచుల్లో ఓడి బలహీనపడింది. ఈ మ్యాచ్​లో ఆర్సీబీని ఓడించాలంటే ముందు ఒత్తిడిని అధిగమించాలి, అలాగే పాజిటివ్​గా ఆడాలి. ఇవి చేయగలిగితేనే ఆర్ఆర్ ముందుకు వెళ్లగలదు.. లేదంటే ఆర్సీబీ సునామీలో కొట్టుకుపోక తప్పదు.

Show comments