iDreamPost
android-app
ios-app

వీడియో: కోహ్లీ క్లాసికల్ సిక్స్ చూసి బిత్తరపోయిన అనుష్క.. రియాక్షన్ వైరల్!

  • Published May 05, 2024 | 4:44 PM Updated Updated May 05, 2024 | 4:44 PM

ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విధ్వంసక ఇన్నింగ్స్​తో మెరిశాడు. స్ట్రైక్ రేట్​పై వస్తున్న విమర్శలకు తన బ్యాట్​తోనే సమాధానం ఇచ్చాడు.

ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విధ్వంసక ఇన్నింగ్స్​తో మెరిశాడు. స్ట్రైక్ రేట్​పై వస్తున్న విమర్శలకు తన బ్యాట్​తోనే సమాధానం ఇచ్చాడు.

  • Published May 05, 2024 | 4:44 PMUpdated May 05, 2024 | 4:44 PM
వీడియో: కోహ్లీ క్లాసికల్ సిక్స్ చూసి బిత్తరపోయిన అనుష్క.. రియాక్షన్ వైరల్!

విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్టైల్ గురించి తెలిసిందే. ఏ ఫార్మాట్ అయినా అతడు ఆడేతీరు దాదాపుగా ఒకేలా ఉంటుంది. మొదట్లో సింగిల్స్, డబుల్స్​తో స్ట్రైక్ రొటేట్ చేయడం, క్రీజులో కుదురుకున్నాక జోరు పెంచడం, ఆఖర్లో బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడటం. ఇదే ఆటతీరుతో టన్నుల కొద్దీ పరుగులు చేశాడు. యాంకర్ ఇన్నింగ్స్​తో టీమ్​ను నిలబెట్టడం, భారీ స్కోరుకు బాటలు వేయడం కింగ్​కు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఈసారి ఐపీఎల్​లో కాస్త స్లోగా ఆడుతుండటంతో విరాట్ మీద విమర్శలు పెరిగాయి. ఇలా ఆడితే వరల్డ్ కప్ కొట్టినట్లేనని ట్రోల్స్ నడుస్తున్నాయి. ఈ మాటలు అక్కడా ఇక్కడా తిరిగి ఆఖరికి కోహ్లీ చెవిన పడ్డాయి. స్ట్రైక్ రేట్ దృష్టిలో పెట్టుకున్న కింగ్.. గత కొన్ని మ్యాచులుగా వేగంగా పరుగులు చేస్తున్నాడు. ఎలాంటి భయం లేకుండా భారీ షాట్లు బాదుతున్నాడు.

స్ట్రైక్ రేట్ మీద వస్తున్న విమర్శలకు తన బ్యాట్​తోనే సమాధానం ఇస్తున్నాడు కోహ్లీ. నిన్న గుజరాత్ టైటాన్స్​తో జరిగిన మ్యాచ్​లోనూ అతడి బ్యాట్ గర్జించింది. ఓపెనర్​గా వచ్చిన కింగ్ 27 బంతుల్లో 2 బౌండరీలు, 4 భారీ సిక్సుల సాయంతో 42 పరుగులు చేశాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్​లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్​గా మలిచాడు విరాట్. ఈ షాట్​ను చూసి అతడి భార్య అనుష్క శర్మ బిత్తరపోయింది. నిన్న మ్యాచ్ చూసేందుకు చిన్నస్వామి స్టేడియానికి వచ్చిన కోహ్లీ సతీమణి.. అక్కడ తెగ సందడి చేసింది. కింగ్​ను ఎంకరేజ్ చేస్తూ కనిపించింది. ఈ క్రమంలో మోహిత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్​లో కోహ్లీ బాదిన సిక్స్​ను చూసి ఆమె షాక్ అయింది. ఇదేం షాట్ అంటూ నోరెళ్లబెట్టింది.

ఆఫ్ స్టంప్​కు బయట మోహిత్ వేసిన బాల్​ను కవర్స్ దిశగా అద్భుతమైన రీతిలో సిక్స్​గా మలిచాడు కోహ్లీ. నిల్చున్న చోటు నుంచే సచిన్ టెండూల్కర్ మాదిరిగా అతడు కొట్టిన ఆ క్లాసికల్ షాట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పర్ఫెక్ట్ టైమింగ్, బాడీ బ్యాలెన్స్, బాల్​ను అంచనా వేసిన తీరుకు అంతా ఫిదా అయ్యారు. గ్యాలరీలో కూర్చున్న అనుష్క కూడా ఇదేం షాట్ అంటూ బిత్తరపోయింది. ఆమె రియాక్షన్​కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మోహిత్ బౌలింగ్​లో కోహ్లీ కొట్టిన షాట్​ను గత టీ20 వరల్డ్ కప్​లో పాక్ పేసర్ హారిస్ రౌఫ్​ బౌలింగ్​లో విరాట్ కొట్టిన షాట్​తో పోలుస్తున్నారు. రెండూ ఒకేలా లేకపోయినా కింగ్ ఆడినవే కావడంతో.. ఆ షాట్​నూ గుర్తుచేసుకుంటున్నారు. కోహ్లీ ఉన్న ఫామ్​కు ఈ వరల్డ్ కప్​లో అపోజిషన్ బౌలర్లకు మూడినట్లేనని అంటున్నారు.