iDreamPost

ఎన్ని సాధించినా ధోనీలా మాత్రం చేయలేను.. అందులో అతడు తోపు: కోహ్లీ

  • Published May 18, 2024 | 7:11 PMUpdated May 18, 2024 | 7:11 PM

లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని మీద కింగ్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లులు కురిపించాడు. ఎన్ని సాధించినా ధోనీలా మాత్రం చేయలేనన్నాడు. ఆ విషయంలో అతడు తోపు అని మెచ్చుకున్నాడు.

లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని మీద కింగ్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లులు కురిపించాడు. ఎన్ని సాధించినా ధోనీలా మాత్రం చేయలేనన్నాడు. ఆ విషయంలో అతడు తోపు అని మెచ్చుకున్నాడు.

  • Published May 18, 2024 | 7:11 PMUpdated May 18, 2024 | 7:11 PM
ఎన్ని సాధించినా ధోనీలా మాత్రం చేయలేను.. అందులో అతడు తోపు: కోహ్లీ

విరాట్ కోహ్లీ.. క్రికెట్ ఫీల్డ్​లో అతడు సాధించని ఘనత లేదు, అందుకోని రికార్డు లేదు. దశాబ్దంన్నర కాలంగా అద్బుతమైన బ్యాటింగ్​తో అలరిస్తున్నాడు కింగ్. సెంచరీల మీద సెంచరీలు కొడుతూ లెక్కకు మించిన రికార్డులు సృష్టించాడు. పరుగుల వరద పారిస్తూ ప్రస్తుత క్రికెట్​లో బెస్ట్ బ్యాటర్​గా అవతరించాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న చాలా రికార్డులను అతడు తుడిపేశాడు. అసాధ్యం అనుకున్న ప్రతి దాన్ని సుసాధ్యం చేయాలనే పట్టుదలతో అతడు ఆడుతున్నాడు. కన్​సిస్టెంట్​గా రన్స్ చేసే విరాట్.. దైపాక్షిక సిరీస్​లతో పాటు వరల్డ్ కప్ లాంటి మేజర్ ఐసీసీ టోర్నమెంట్స్​లోనూ బ్యాట్​తో హవా నడిపిస్తున్నాడు. అయితే ఇంత సాధించినా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీలా మాత్రం చేయలేనని అతడు అంటున్నాడు.

కోహ్లీ అనగానే బ్యాటింగ్ ఎలా గుర్తుకొస్తుందో.. అలాగే ధోని పేరు చెప్పగానే ఠక్కున కెప్టెన్సీ గుర్తుకొస్తుంది. అతడి కెప్టెన్సీలో భారత్ టీ20, వన్డే ప్రపంచ కప్​లను ఒడిసి పట్టుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ టీమిండియాను విజేతగా నిలిపాడు మాహీ. ఐపీఎల్​లో చెన్నై సూపర్ కింగ్స్​ను లీడ్ చేస్తూ 5 కప్పులు అందించాడు. బ్యాటర్​గా కంటే సారథ్యంతోనే హ్యూజ్ ఫ్యాన్ బేస్​ను క్రియేట్ చేసుకున్నాడు ధోని. కెప్టెన్సీలో అతడి ఎత్తుగడలు, వ్యూహాలను ఛేదించడం మహామహుల వల్లే కాలేదు. ఎంతటి బ్యాటర్​కైనా పర్ఫెక్ట్ ఫీల్డ్ ప్లేస్​మెంట్ సెట్ చేసి ఔట్ చేయడం మాహీ స్పెషాలిటీ. అందుకే ఎన్ని సాధించినా ధోనీలా మాత్రం చేయలేమని అంటున్నాడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. మాహీలా కెప్టెన్సీ చేయడం అంత ఈజీ కాదన్నాడు కింగ్.

ఒక ఇంటర్వ్యూలో భాగంగా ధోని గురించి అడిగిన ప్రశ్నకు కోహ్లీ సమాధానం ఇచ్చాడు. మాహీ నుంచి ఏ స్కిల్​ను తీసుకోవాలని మీరు అనుకుంటున్నారనే క్వశ్చన్​కు.. వెంటనే అతడి ఫీల్డ్ ప్లేస్​మెంట్ అని విరాట్ ఆన్సర్ ఇచ్చాడు. ఫీల్డ్ ప్లేస్​మెంట్​లో ధోని గ్రేట్ అని.. ఈ విషయంలో అతడ్ని మించినోడు ఎవరూ లేరన్నాడు. అతడిలా ఫీల్డ్ సెట్ చేయడం ఎవరి వల్లా కాదంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి ఏ స్కిల్​ను తీసుకోవాలని అనుకుంటున్నావనే ప్రశ్నకు.. అతడి పుల్ షాట్స్ అన్నాడు కింగ్. పుల్ షాట్​తో బంతిని స్టేడియంలోకి తరలించడంలో రోహిత్​ తోపు అని మెచ్చుకున్నాడు కోహ్లీ. మరి.. రోహిత్, కోహ్లీ, ధోనిల్లో మీకు ఏ స్కిల్ అంటే బాగా ఇష్టమో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి