Nidhan
ఐపీఎల్-2024లో కీలక పోరుకు సిద్ధమవుతున్నాడు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ. ఈ సీజన్ మొత్తం బ్యాట్‌తో రఫ్ఫాడించిన కింగ్.. ఇవాళ సీఎస్కేతో డూ ఆర్ డై మ్యాచ్‌లో ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
ఐపీఎల్-2024లో కీలక పోరుకు సిద్ధమవుతున్నాడు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ. ఈ సీజన్ మొత్తం బ్యాట్‌తో రఫ్ఫాడించిన కింగ్.. ఇవాళ సీఎస్కేతో డూ ఆర్ డై మ్యాచ్‌లో ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
Nidhan
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్లో మోస్ట్ ఫ్యాన్‌బేస్ కలిగిన జట్లలో ఒకటి. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌కు ఎంతటి ఆదరణ ఉందో.. అంతే ఆదరణ ఈ టీమ్‌కు ఉంది. చెన్నై, ముంబై చెరో 5 సార్లు కప్పులు గెలిచాయి. కాబట్టి ఆ జట్లకు ఈ రేంజ్లో పాపులారిటీ ఉండటంలో తప్పు లేదు. కానీ ఒక్కసారి కూడా టైటిల్ అందుకోని ఆర్సీబీకి ఇంతటి ఆదరణ దక్కడం మాత్రం అనూహ్యమనే చెప్పాలి. ఆ టీమ్‌కు లాయల్ ఫ్యాన్స్ ఉన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా బెంగళూరుకు మద్దతుగా నిలిచేవాళ్లు కోట్లలో ఉన్నారు. ఈసారి ఐపీఎల్ ఫస్టాఫ్‌లో ఆ టీమ్ దారుణ ఓటములతో వెనుకంజలో ఉన్నా ఫ్యాన్స్ అండగా నిలిచారు. వాళ్ల మద్దతు ఊరికే పోలేదు. ఓటముల నుంచి కోలుకొని వరుస విజయాలతో ప్లేఆఫ్స్ క్వాలిఫికేషన్‌కు ఒక్క అడుగు దూరంలో నిలబడింది ఆర్సీబీ.
ఈ సీజన్లో ఒక దశలో వరుస పరాజయాలతో డీలా పడిపోయింది ఆర్సీబీ. గెలవడమే మర్చిపోయినట్లుగా గ్రౌండ్లోకి అడుగుపెట్టడం ఓటమితో మ్యాచ్‌ను ముగించడం అలవాటుగా చేసుకుంది. ఆ టైమ్‌లో తమ పనైపోయిందని అనుకున్నాడట స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఇక సాధించడానికి ఏమీ లేదనుకొని వెళ్లిపోదామని ఫిక్స్ అయ్యాడట. బ్యాగులు కూడా సర్దుకున్నాడట. కానీ ఆ సమయంలోనే అద్భుతం జరిగిందన్నాడు కింగ్. ఓటముల తర్వాత లేచి నిలబడ్డామని.. పట్టుదలతో ఆడుతూ నెల రోజు గ్యాప్‌లో ఈ స్థాయికి చేరుకున్నామని తెలిపాడు. ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరూ ఊహించలేరని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇది అలాంటి ఇలాంటి కమ్‌బ్యాక్ కాదన్నాడు.
‘ఏప్రిల్ నెలలో వరుస ఓటములు పలకరించడంతో నా బ్యాగులు సర్దుకొని సిద్ధమైపోయా. అంతా అయిపోయింది, ఇంక ఏమీ జరగదని ఫిక్స్ అయ్యా. కానీ ఇప్పుడు మేం మంచి పొజిషన్లో ఉన్నాం. గేమ్ ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. మేం ఇక్కడి దాకా వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ ఆటలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు’ అని కోహ్లీ స్పష్టం చేశాడు. ఇక, ఈ సీజన్లో విరాట్ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటిదాకా ఆడిన 13 మ్యాచుల్లో 155 స్ట్రైక్ రేట్‌తో 661 పరుగులు చేశాడు. ఐదు ఫిఫ్టీలు బాదిన కింగ్.. ఓ సెంచరీ కూడా కొట్టాడు. ప్లేఆఫ్స్ చేరాలంటే కీలకంగా మారిన సీఎస్కేతో పోరులో అతడు ఎలా ఆడతాడనే దాని మీదే బెంగళూరు ఆశలు ఆధారపడి ఉన్నాయి. మరి.. ఆర్సీబీ కమ్‌బ్యాక్ ఇచ్చిన తీరు మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Virat Kohli said, “in April I almost packed my bags and thought what will happen now? and now look where we standing, it’s amazing how this game can turn. That’s the thing one should never assume something else going to happen”. (JioCinema). pic.twitter.com/TyMWxOeJ3l
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024