iDreamPost

RCB vs CSK మ్యాచ్ అన్ని కోట్ల మంది చూశారా.. IPL చరిత్రలోనే ఇలా మళ్లీ జరగదేమో?

RCB vs CSK- Jiocinema Viewership: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లోనే అద్భుతమైన మ్యాచ్ గా చెన్నై- ఆర్సీబీ నిలిచింది. జియో సినిమాలో రికార్డు స్థాయిలో వ్యూవర్ షిప్ దక్కింది.

RCB vs CSK- Jiocinema Viewership: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లోనే అద్భుతమైన మ్యాచ్ గా చెన్నై- ఆర్సీబీ నిలిచింది. జియో సినిమాలో రికార్డు స్థాయిలో వ్యూవర్ షిప్ దక్కింది.

RCB vs CSK మ్యాచ్ అన్ని కోట్ల మంది చూశారా.. IPL చరిత్రలోనే ఇలా మళ్లీ జరగదేమో?

చిన్నస్వామి స్టేడియం వేదికగా ఐపీఎల్ చరిత్రలోనే ఒక కీలక పోరును ప్రేక్షకులు వీక్షించారు. ఎవ్వరూ ఊహించని విధంగా ఆ మ్యాచ్ కు వ్యూవర్ షిప్ వచ్చింది. నిజానికి మళ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇలాంటి ఒక మ్యాచ్ మళ్లీ చూడలేము అనేలా ఆ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ని అటు మైదానంలోనే కాకుండా.. జియో సినిమాలో కూడా కోట్ల మంది చూశారు. అటు మ్యాచ్ తోనే కాకుండా.. వ్యూవర్ షిప్ తో కూడా ఆర్సీబీ- చెన్నై మ్యాచ్ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది. ఈ మ్యాచ్ లో ప్రతి ఓవర్ డెత్ ఓవర్ లాగానే సాగింది. ఉత్కంఠ పోరులో ఆర్సీబీ గెలిచి ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టింది.

చెన్నై- ఆర్సీబీ మధ్య జరిగిన పోరులో ఇరు జట్లు అద్భుతంగా పోరాడారు. చెన్నై కూడా దాదాపుగా ఈ మ్యాచ్ లో విజయం సాధించినట్లే కనిపించింది. కానీ, ఆర్సీబీ మాత్రం పట్టు వదలకుండా అద్భుతంగా రాణించి విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు ఆర్సీబీని కంట్రోల్ చేయడంలో మొదట సఫలీకృతమైంది. కానీ, మిడిల్ ఓవర్స్ లో మాత్రం కంట్రోల్ చేయలేకపోయింది. ఇంక డెత్ ఓవర్స్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ, చెన్నై జట్టు కూడా ఛేజింగ్ లో అంతే దూకుడు చూపించింది. అయితే ఆర్సీబీ కట్టుదిట్టమైన ఫీల్డింగ్, ప్రణాళికలతో చెన్నై ఆట కట్టించింది. ఎట్టకేలకు ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ స్టార్ట్ కాక ముందు నుంచే పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. అయితే స్టార్టింగ్ లో వాన వచ్చి కాసేపు కంగారు పెట్టింది.

కానీ, తర్వాత మ్యాచ్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత ఆర్సీబీ అద్భుతం చేసేసింది. ముందు నుంచి ఉన్న ఉహాగానాలు, అంచనాలు చూసి ఈ మ్యాచ్ వ్యూవర్ షిప్ కూడా అలాగే పెరిగింది. ఐపీఎల్ చరిత్రలో మళ్లీ ఇలాంటి ఒక అద్భుతం జరగదేమే అనేలా ఈ మ్యాచ్ ని జియో సినిమాలో ఏకంగా 50 కోట్ల మంది చూశారు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ కు 50 కోట్ల వ్యూవర్ షిప్ దక్కింది. ఎంతైనా చెన్నై- ఆర్సీబీ మ్యాచ్ క్రేజ్ అంటే ఆ మాత్రం ఉండాలి అంటున్నారు. అంతేకాకుండా.. ఈ క్రేజ్ ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ కు కూడా రాదేమో? ఇంక మ్యాచ్ సమురీ చూస్తే.. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఛేజింగ్ లో చెన్నై జట్టు 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేసింది. 27 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి