iDreamPost

వీడియో: CSKపై RCB విజయానికి ఈ అమ్మాయి కూడా కారణం అయిందా?

  • Published May 20, 2024 | 1:42 PMUpdated May 20, 2024 | 1:42 PM

చెన్నైని చిత్తు చేసి దర్జాగా ప్లేఆఫ్స్​ గడప తొక్కింది ఆర్సీబీ. అయితే బెంగళూరు విజయానికి టీమ్ ప్లేయర్ల ఆటతీరుతో పాటు ఓ అమ్మాయి కూడా కారణమైందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

చెన్నైని చిత్తు చేసి దర్జాగా ప్లేఆఫ్స్​ గడప తొక్కింది ఆర్సీబీ. అయితే బెంగళూరు విజయానికి టీమ్ ప్లేయర్ల ఆటతీరుతో పాటు ఓ అమ్మాయి కూడా కారణమైందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

  • Published May 20, 2024 | 1:42 PMUpdated May 20, 2024 | 1:42 PM
వీడియో: CSKపై RCB విజయానికి ఈ అమ్మాయి కూడా కారణం అయిందా?

ఆ జట్టు పనైపోయిందని విమర్శించారు. ఆటడం ఇక దండగ ఇంటికి వెళ్లిపోతే బెటర్ అన్నారు. ప్రతిసారి ఇలాగే రావడం.. ఖాళీ చేతులతో వెళ్లిపోవడం అలవాటుగా మారిందని ట్రోల్ చేశారు. కప్పు సంగతి తర్వాత కనీసం ప్లేఆఫ్స్​కు వెళ్లమనండి చూద్దాం అంటూ రెచ్చగొట్టారు. ఈసారి ఐపీఎల్​లో ఆర్సీబీ టీమ్​ ఎదుర్కొన్నన్ని విమర్శలు ఇంకెవరూ ఫేస్ చేయలేదు. కానీ ఆ టీమ్ వాటిని తట్టుకొని నిలబడింది. వరుస ఓటముల నుంచి గుణపాఠాలు నేర్చుకొని జోరు పెంచింది. దూకుడు మంత్రాన్ని పఠిస్తూ విజయాల బాట పట్టింది. గత 6 మ్యాచుల్లోనూ విజయాలతో దర్జాగా ప్లేఆఫ్స్ గడప తొక్కింది. అయితే ఆ జట్టు సక్సెస్​కు ఓ అమ్మాయి కూడా కారణమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

సీఎస్​కేతో చావోరేవో మ్యాచ్​లో ఆఖరి వరకు పోరాడి విజయం సాధించింది ఆర్సీబీ. 27 పరుగుల తేడాతో రుతురాజ్ సేనను మట్టికరిపించింది. ఒకదశలో చెన్నైదే గెలుపని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ చివరి వరకు పట్టువదలకుండా పోరాడి గెలిచింది బెంగళూరు. అయితే ఈ మ్యాచ్​లో ఆర్సీబీ గెలుపులో ఓ అమ్మాయికి కూడా క్రెడిట్ ఇవ్వాలనే కామెంట్స్ వస్తున్నాయి. సీఎస్​కే-ఆర్సీబీ మ్యాచ్​లో స్టేడియంలో ఒక అమ్మాయి తెగ సందడి చేసింది. చెన్నై ఇన్నింగ్స్ టైమ్​లో అద్భుతమైన డాన్స్​తో అలరించింది. క్యూట్ లుక్స్, స్టైలిష్ డ్యాన్స్​తో అందరి మనసులు దోచుకుంది. ఆమె డ్యాన్సే సీఎస్​కే కొంప ముంచిందని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ అంటున్నారు.

సీఎస్​కే ఇన్నింగ్స్​లో మిచెల్ శాంట్నర్ (3) బ్యాటింగ్ చేస్తున్న టైమ్​లో ఆ అమ్మాయి డ్యాన్స్ వీడియో స్టేడియంలోని స్క్రీన్ మీద ప్లే అయిందని, దీంతో అతడు డిస్ట్రాక్ట్ అయ్యాడని నెటిజన్స్ చెబుతున్నారు. స్టైలిష్​ మూవ్స్​తో అదరగొట్టిన అమ్మాయి వైపు శాంట్నర్ దృష్టి మరలిందని, దీంతో అతడు బ్యాటింగ్ మీద ఫోకస్ చేయలేకపోయాడని కామెంట్స్ చేస్తున్నారు. అమ్మాయి వైపు చూస్తూ చెత్త షాట్ కొట్టి డుప్లెసిస్​కు దొరికిపోయాడని చెబుతున్నారు. అక్కడి నుంచి సీఎస్​కే కోలుకోలేదని, ఆ తర్వాత ధోని-జడ్డూ ఆకట్టుకున్నా టీమ్​ను గెలుపుతీరాలకు చేర్చలేకపోయారని అంటున్నారు. ఆర్సీబీ విజయానికి ఈ అమ్మాయి కూడా ఒక కారణమని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ మొత్తం వ్యవహారంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి