RCBపై రాయుడు అసూయ.. అంత కడుపు మంట దేనికో?

ఆర్సీబీ ప్లేఆఫ్స్​కు చేరడంతో ఆ టీమ్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. బెంగళూరు పోరాటపటిమ చూసి క్రికెట్ లవర్స్ కూడా ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అయితే మాజీ బ్యాటర్ అంబటి రాయుడు మాత్రం ఆ జట్టు మీద అసూయను వెళ్లగక్కాడు.

ఆర్సీబీ ప్లేఆఫ్స్​కు చేరడంతో ఆ టీమ్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. బెంగళూరు పోరాటపటిమ చూసి క్రికెట్ లవర్స్ కూడా ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అయితే మాజీ బ్యాటర్ అంబటి రాయుడు మాత్రం ఆ జట్టు మీద అసూయను వెళ్లగక్కాడు.

ఆర్సీబీ జట్టు అద్భుతం చేసి చూపించింది. వరుస ఓటములతో పాయింట్స్ టేబుల్​లో ఆఖర్లో ఉన్న జట్లు కాస్తా ఇప్పుడు ప్లేఆఫ్స్​కు క్వాలిఫై అయింది. నమ్మశక్యం కాని రీతిలో వరుసగా ఆరు మ్యాచుల్లో విజయాలు సాధించింది. 5 సార్లు కప్పు కొట్టిన చెన్నై సూపర్​కింగ్స్​ను నిన్న చిత్తుగా ఓడించింది. నాకౌట్​ మ్యాచ్​లో 27 పరుగుల తేడాతో రుతురాజ్ సేనను మట్టికరిపించింది. ఒక దశలో సీఎస్​కేదే విజయమని అంతా అనుకున్నారు. అయితే లాస్ట్ బాల్ వరకు పోరాటం ఆపని డుప్లెసిస్ సేన.. విజయం సాధించి ప్లేఆఫ్స్ గడప తొక్కింది. దీంతో ఆ టీమ్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. ‘ఈ సాలా కప్ నమ్దే’ అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ తరుణంలో మాజీ బ్యాటర్ అంబటి రాయుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

చెన్నైపై నెగ్గిన ఆర్సీబీని మెచ్చుకుంటూనే అసూయను కూడా వెళ్లగక్కాడు రాయుడు. ఆ టీమ్ ఈసారి ఐపీఎల్​ కప్పును నెగ్గాలని అన్నాడు. బెంగళూరు వీధుల్లో అభిమానులు ఎంతగా సెలబ్రేట్ చేసుకున్నారో చూశామన్నాడు. ఒకవేళ ఆర్సీబీ ఓడిపోతే సీఎస్​కే తన దగ్గర ఉన్న ట్రోఫీల్లో నుంచి ఒకదాన్ని ఇచ్చేయాలన్నాడు. చెన్నై ఇచ్చే కప్పుతో బెంగళూరు ఫ్యాన్స్ పరేడ్ చేస్తారంటూ సీరియస్ కామెంట్స్ చేశాడు రాయుడు. ‘ఈసారి ఆర్సీబీ కప్పు నెగ్గాలి. ఆ టీమ్ గెలుపుతో బెంగళూరు వీధుల్లో అభిమానులు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూశాం. సీఎస్​కే తన దగ్గర ఉన్న ట్రోఫీల్లో నుంచి ఒకటి వాళ్లకు ఇచ్చేయాలి. అప్పుడు దాన్ని పట్టుకొని పరేడ్ చేస్తారు’ అని రాయుడు చెప్పుకొచ్చాడు.

ఓ టీవీ​ ఛానెల్​లో మాట్లాడుతూ రాయుడు ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీపై అతడు అసూయను వెళ్లగక్కడం, వాళ్ల గెలుపును తట్టుకోలేకపోవడంతో పక్కనే ఉన్న మరో మాజీ క్రికెటర్ వరుణ్ అరోన్ సీరియస్ అయ్యాడు. సీఎస్​కేను ఆర్సీబీ చిత్తు చేయడాన్ని రాయుడు తట్టుకోలేకపోతున్నాడంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. రాయుడి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. ఆర్సీబీపై ఇంత కడుపు మంట దాచుకున్నావా? ఇంత అసూయ ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. బాగా ఆడిన టీమ్ గెలుస్తుందని, ప్రశంసించకపోయినా ఫర్వాలేదని.. కానీ సీఎస్​కే ట్రోఫీ తీసుకొని పరేడ్​కు వెళ్లమని ఎలా అంటారంటూ ఫైర్ అవుతున్నారు. మరి.. ఆర్సీబీ విక్టరీపై రాయుడు చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments