Mohammed Siraj: నా డ్రీమ్ అదే.. పొద్దున లేస్తే దాని గురించే ఆలోచిస్తుంటా: సిరాజ్

హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ తన డ్రీమ్ ఏంటో రివీల్ చేశాడు. పొద్దున లేస్తే దాని గురించే ఆలోచనలు వస్తుంటాయని అన్నాడు.

హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ తన డ్రీమ్ ఏంటో రివీల్ చేశాడు. పొద్దున లేస్తే దాని గురించే ఆలోచనలు వస్తుంటాయని అన్నాడు.

ఐపీఎల్​లో హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న జట్లలో ఒకటి ఆర్సీబీ. క్యాష్ రిచ్ లీగ్ మొదలై ఇన్నేళ్లు అవుతున్నా ఒక్కసారి కూడా కప్ అందుకోలేదు బెంగళూరు. అయినా ఆ టీమ్​ను అభిమానులు ఆదరిస్తూనే ఉన్నారు. ఈసారి కూడా ఐపీఎల్​లో చెత్త ప్రదర్శనతో దారుణంగా నిరాశపర్చింది డుప్లెసిస్ సేన. ఫస్టాఫ్​లో వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడిపోయి ప్లేఆఫ్స్ రేసు నుంచి టెక్నికల్​గా తప్పుకుంది. అయితే సెకండాఫ్​లో హ్యాట్రిక్ విక్టరీస్​తో ఫ్యాన్స్​కు ఊరటను కలిగించింది ఆ టీమ్. ఈ విజయాల్లో ఆ జట్టు ఏస్ పేసర్ మహ్మద్ సిరాజ్ పాత్ర ఎంతో ఉంది. ఫస్టాఫ్​లో ఫెయిలైన సిరాజ్.. సెకండాఫ్​లో దుమ్మురేపుతున్నాడు. అలాంటోడు తన డ్రీమ్ గురించి తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

సీజన్ మొదట్లో వికెట్లు తీయకపోగా భారీగా పరుగులు లీక్ చేస్తూ విమర్శలకు గురయ్యాడు సిరాజ్. దీంతో కొన్ని మ్యాచుల్లో అతడ్ని బెంచ్​కే పరిమితం చేసింది బెంగళూరు మేనేజ్​మెంట్. అయితే గత కొన్ని మ్యాచుల్లో అతడి పెర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్ అయింది. పవర్​ప్లేలో రన్స్ కట్టడి చేస్తూ వికెట్లు తీస్తూ అదరగొడుతున్నాడు సిరాజ్. టీ20 వరల్డ్ కప్​కు ముందు ఇది భారత జట్టుకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ తరుణంలో కెరీర్​లో తన కల ఏంటో షేర్ చేశాడు సిరాజ్. ప్రపంచ కప్ నెగ్గాలనేది తన చిరకాల కోరిక అని అన్నాడు. పొద్దున లేస్తే ఈ విషయం గురించే ఆలోచిస్తూ ఉంటానని.. ఎప్పటికైనా ఈ డ్రీమ్​ నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

టీ20 వరల్డ్ కప్​కు వెళ్లే భారత జట్టులో చోటు దక్కడం చాలా ఆనందంగా ఉంది. నేషనల్ టీమ్​కు ఆడాలనేది ప్రతి ఆటగాడి కల. అందులోనూ ప్రపంచ కప్ జట్టులో సభ్యుడిగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ప్రతి రోజూ దీని గురించే ఆలోచిస్తుంటా. పొద్దున నిద్ర లేవగానే నేను వరల్డ్ కప్ ట్రోఫీని నా చేతిలో పట్టుకున్నట్లు ఊహించుకుంటాను’ అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. వరల్డ్ కప్ డ్రీమ్​ను నిజం చేసుకునేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తానని ఆర్సీబీ జట్టు నిర్వహించిన పాడ్​కాస్ట్​లో సిరాజ్ మియా స్పష్టం చేశాడు. ఇక, ఐపీఎల్-2024లో ఈ హైదరాబాద్ ఎక్స్​ప్రెస్ 8 వికెట్లు తీశాడు. మరి.. ప్రపంచ కప్ నెగ్గి సిరాజ్ తన డ్రీమ్​ను నిజం చేసుకుంటాడని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.

Show comments