RCB ప్లేఆఫ్స్​ చేరాలంటే ఇలా జరగాలి.. ఆ ఒక్కటే అడ్డంకి!

వరుసగా ఐదు మ్యాచుల్లో ఐదు విజయాలతో ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది ఆర్సీబీ. అయితే ఆ టీమ్ క్వాలిఫికేషన్​కు ఒక్క అడ్డంకే ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

వరుసగా ఐదు మ్యాచుల్లో ఐదు విజయాలతో ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది ఆర్సీబీ. అయితే ఆ టీమ్ క్వాలిఫికేషన్​కు ఒక్క అడ్డంకే ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఎన్నో ఆశలతో ఐపీఎల్-2024ను మొదలుపెట్టిన ఆర్సీబీకి మొదటి మ్యాచ్​లోనే ఓటమి ఎదురైంది. అయినా సరే తేరుకొని రెండో మ్యాచ్​లో గెలిచి ఆశలు రేకెత్తించింది. దీంతో ‘ఈ సాలా కప్ నమ్దే’ అంటూ ఆ టీమ్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. కానీ ఏం లాభం.. తర్వాత వరుసగా 6 మ్యాచుల్లో ఓడిపోయింది డుప్లెసిస్ సేన. గెలవడమే మర్చిపోయినట్లు ప్రత్యర్థికి సరెండర్ అయిపోయింది. అయితే లీగ్ సెకండాఫ్​లో కోలుకున్న బెంగళూరు వరుసగా 5 విక్టరీస్​తో ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ఆ జట్టు పనైపోయిందని అనుకుంటున్న తరుణంలో బ్రేకుల్లేని బుల్డోజర్​గా ఒక్కో టీమ్​ను పడగొడుతూ ప్లేఆఫ్స్ రేసులో తొడ గొడుతోంది ఆర్సీబీ. అయితే ఆ టీమ్ క్వాలిఫికేషన్​కు ఒక ప్రధాన అడ్డంకి ఉంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్లేఆఫ్స్​కు చేరాలంటే నెగ్గి తీరాల్సిన మ్యాచుల్లో చెన్నై, బెంగళూరు విజయం సాధించాయి. టేబుల్ టాపర్ రాజస్థాన్​ను సీఎస్​కే చిత్తు చేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్​ను డుప్లెసిస్ సేన ఓడించింది. పాయింట్స్ టేబుల్​లో టాప్​లో ఉన్న కోల్​కతా అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్త్​ను ఖాయం చేసుకుంది. రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్​ కూడా క్వాలిఫై అవడం పక్కా. ఇక, మిగిలిన రెండు స్థానాల కోసం సీఎస్​కే, ఎస్​ఆర్​హెచ్, ఆర్సీబీ, డీసీ, ఎల్​ఎస్​జీ పోటీలో ఉన్నాయి. నిన్న మ్యాచులో గెలుపుతో బెంగళూరు తన అవకాశాలను కాపాడుకుంది. ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరాలంటే చెన్నై రూపంలో ఉన్న పెద్ద అడ్డంకిని దాటాలి. ఆర్సీబీ-సీఎస్​కే మధ్య జరిగే పోరు డిసైడర్​గా మారనుంది.

ఆర్సీబీ మీద గెలిస్తే చాలు.. చెన్నై ప్లేఆఫ్స్​కు క్వాలిఫై అవుతుంది. ఎందుకంటే ఆ టీమ్ నెట్​ రన్​రేట్ మెరుగ్గా ఉంది. కానీ బెంగళూరు అలా కాదు.. నెట్ రన్​రేట్ తక్కువగా ఉంది కాబట్టి సీఎస్​కేతో మ్యాచ్​లో భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ ఛేజింగ్​కు దిగితే 18.1 ఓవర్లలోనే మ్యాచ్​ను ఫినిష్​ చేయాలి. అదే తొలుత బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో రుతురాజ్ సేనను ఓడించాలి. చెన్నైను ఓడించడమే కాదు.. ఆ జట్టు నెట్ రన్​రేట్​ను కూడా దాటడం బెంగళూరు ముందు ఉన్న పెద్ద ఛాలెంజ్. ఈ నేపథ్యంలో ఈ ఐపీఎల్​లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్​గా ఆర్సీబీ-సీఎస్​కే నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి.. బెంగళూరు ప్లేఆఫ్స్ చేరుతుందని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments