iDreamPost

అందరూ ఫెయిల్ అవుతున్నా.. త్రిపాఠి ఒక్కడే ఎందుకు సక్సెస్ అయ్యాడంటే?

SRH vs KKR- Rahul Tripathi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో మొదటి క్వాలిఫయర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తేలిపోయింది. పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశ పరిచింది. కానీ, ఒక్క త్రిపాఠి మాత్రమే సక్సెస్ అయ్యాడు. అందుకు కారణం లేకపోలేదు.

SRH vs KKR- Rahul Tripathi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో మొదటి క్వాలిఫయర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తేలిపోయింది. పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశ పరిచింది. కానీ, ఒక్క త్రిపాఠి మాత్రమే సక్సెస్ అయ్యాడు. అందుకు కారణం లేకపోలేదు.

అందరూ ఫెయిల్ అవుతున్నా.. త్రిపాఠి ఒక్కడే ఎందుకు సక్సెస్ అయ్యాడంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో తొలి క్వాలిఫయర్ ఆసక్తిగా సాగుతోంది. అయితే ఒకింత సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రతికూలంగానే ఫలితం కనిపిస్తోంది. అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ గెలిచి ఫైనల్ చేరేందుకు కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. కానీ, విజయం మాత్రం ఒక్కరినే వరిస్తుంది. ఆ ఒక్కరు ఎవరు అనేది తెలుసుకోవడం కోసం అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టుకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ట్రావిస్ హెడ్ రెండో బంతికే డకౌట్ అయ్యి పెవిలియన్ చేరాడు. అప్పటి నుంచి వికెట్లు పడుతూనే ఉన్నాయి. కానీ, ఒక్క త్రిపాఠి మాత్రం నిలదొక్కుకున్నాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి పరుగులు వస్తూనే ఉన్నాయి.. మరోవైపు వికెట్లు పడుతూనే ఉన్నాయి. క్రీజులోకి వచ్చిన వాళ్లు వచ్చినట్లు పెవిలియన్ చేరుతూనే ఉన్నారు. ట్రావిస్ హెడ్(డకౌట్), అభిషేక్ శర్మ(3), నితీశ్ రెడ్డి(9), షబాజ్ అహ్మద్(డకౌట్), క్లాసెన్(32) ఇలా మ్యాచ్ సగం కూడా పూర్తి కాకముందే 5 వికెట్లు కోల్పోయారు. అయితే క్రీజులోకి వచ్చినవాళ్లు వచ్చినట్లు అవుటవుతున్నా.. ఒక్క రాహుల్ త్రిపాఠి మాత్రం క్రీజులో పాతుకుపోయాడు.

పదునైన బంతులు వేస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ టాపార్డర్ ని కూల్చేసిన స్టార్క్ ని కూడా ఎదిరించి నిలబడ్డాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి కాస్త గ్యాప్ ఇచ్చి వచ్చినా కూడా త్రిపాఠి అనుభవం ఇప్పుడు కీలక మ్యాచ్ లో ఎంతగానో ఉపయోగపడుతోంది. టాపార్డర్ ఫెయిలైన సందర్భంలో అద్భుతమైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ జట్టు ఫ్యాన్స్ లో జోష్ తగ్గకుండా ఆటను ముందుకు తీసుకెళ్లాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా త్రిపాఠి వల్ల స్కోర్ కార్డ్ మాత్రం పరుగులు పెట్టింది.

త్రిపాఠి సక్సెస్ ఫార్ములా:

రాహుల్ త్రిపాఠి ఈ మ్యాచ్ లో సక్సెస్ కావడానికి మొదటి కారణం అతని అనుభవం. సీనియర్స్, ఫస్ట్ క్లాస్ బౌలర్లను ఎదుర్కొన్న అనుభవంతో ఎంతో బాగా పర్ఫార్మ్ చేశాడు. అలాగే త్రిపాఠి బ్యాటింగ్ గమనిస్తే.. బంతిని ఆఖరి వరకు చూస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత కరెక్ట్ షాట్ అడుతూ వచ్చాడు. ఎంతో కూల్ గా సంయమనం పాటించాడు. లూజ్ బాల్ ని మాత్రమే హిట్టింగ్ చేశాడు. అంతేకాకుండా బౌలర్ ను అర్థం చేసుకుని ఆడుతూ వచ్చాడు. ఎక్కడా కంగారు పడకుండా పార్టనర్ షిప్ బిల్డ్ చేసేందుకు ప్రయత్నించాడు. అదే సక్సెస్ అయ్యింది. మొత్తానికి ఈ మ్యాచ్ లో కేవలం35 బంతుల్లోనే 7 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో ఏకంగా 55 పరుగులు చేశాడు. కానీ, త్రిపాఠి అవుటైన తీరు మాత్రం అందరినీ అసహనానికి గురి చేసింది. ఎందుకంటే అసలు ప్రయత్నం చేయకుండా రనౌట్ గా వెనుదిరిగాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి