ఢిల్లీపై పంజాబ్ అద్భుత విజయం.. ఇది సామ్ కరణ్ మ్యాజిక్..

Punjab Super Victory: ఢిల్లీ మీద పంజాబ్ సూపర్ విక్టరీ సాధించింది. సామ్ కరణ్ విజృంభించడంతో పంజాబ్ కింగ్స్ కి ఈ విజయం సునాయాసం అయిపోయింది.

Punjab Super Victory: ఢిల్లీ మీద పంజాబ్ సూపర్ విక్టరీ సాధించింది. సామ్ కరణ్ విజృంభించడంతో పంజాబ్ కింగ్స్ కి ఈ విజయం సునాయాసం అయిపోయింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో సూపర్ విక్టరీ నమోదైంది. నిజానికి ధనా ధన్ లీగ్ అంటేనే నరాలు తెగే ఉత్కంఠ, బంతి బంతికి ట్విస్టులు ఉంటాయి. రెండో మ్యాచ్ కూడా దాదాపుగా అదే తరహాలో సాగింది. ఢిల్లీ క్యాపిటల్స్ పై పంజాబ్ కింగ్స్ సూపర్ విక్టరీ నమోదు చేసింది. ఇది కంప్లీట్ గా సామ్ కరణ్ మ్యాజిక్ అని చెప్పాలి. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ మ్యాచ్ ప్రారంభం నుంచి ఢిల్లీపై పట్టు సాధించింది. ముఖ్యంగా బౌలర్లు ఢిల్లీ బ్యాటర్స్ బాగా కట్టడి చేశారు. అయితే ఢిల్లీ ఆ పట్టు నుంచి విడిపించుకుని గౌరవప్రదమైన స్కోర్ చేసింది. పంజాబ్ కి కాస్త ఛాలెంజింగ్ టార్గెట్ అయితే ఇచ్చింది. కానీ, పంజాబ్ కింగ్స్ మాత్రం సునాయాసంగా ఆ టార్గెట్ ని రీచ్ అయిపోయింది. 4 వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది.

ఇందులో మేజర్ క్రెడిట్ మాత్రం సామ్ కరణ్ కు దక్కుతుంది. ఢిల్లీ బౌలర్స్ అందరినీ ఉతికి ఆరేశాడు. మ్యాచ్ కాస్త ఢిల్లీకి అనుకూలంగా తిరుగుతున్న సమయంలో క్రీజులోకి వచ్చిన సామ్ కరణ్ అస్సలు వెనక్కి తిరిగి చూసుకోకుండా ఢిల్లీ బౌలర్లపై విజృంభిచాడు. ఏకంగా 47 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 67 పరుగులు చేశాడు. మరోవైపు లివింగ్ స్టోన్ కూడా సామ్ కరణ్ తో కలిసి మెరుపులు మెరిపించాడు. సామ్ కరణ్ అవుట్ అయ్యాక మళ్లీ టెన్షన్ మొదలైంది. కానీ, పంజాబ్ మాత్రం తమ తొలి విజయాన్ని నమోదు చేసింది.

మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. షాయ్ హోప్(33), అభిషేక్ పోరెల్(32), వార్నర్(29) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. పంజాబ్ బౌలింగ్ చూస్తే.. అర్షదీప్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. రబాడా, బ్రార్, రాహుల్ చాహర్ లకు తలో వికెట్ దక్కింది. పంజాబ్ బ్యాటింగ్ చూస్తే.. సామ్ కరణ్(63), లివింగ్ స్టోన్(38), ప్రభ్ సిమ్రాన్ సింగ్(26) మెప్పించారు. ఢిల్లీ బౌలింగ్ చూస్తే.. ఖలీల్ అహ్మద్, కుల్దీప్ లకు చెరో 2 వికెట్స్, ఇషాంత్ శర్మకు 1 వికెట్ దక్కింది. మరి.. పంజాబ్ ని విజయతీరానికి చేర్చిన సామ్ కరణ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments