iDreamPost
android-app
ios-app

IPL 2024.. లక్నోకు భారీ గుడ్ న్యూస్! రాహుల్ కు NCA గ్రీన్ సిగ్నల్.. కానీ ఓ కండీషన్

  • Published Mar 19, 2024 | 12:53 PM Updated Updated Mar 19, 2024 | 12:53 PM

కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2024 సీజన్ లో ఆడటానికి నేషనల్ క్రికెట్ అకాడమీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ చివర్లో ఓ మెలికపెట్టింది. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ ఫ్యాన్స్ సంతోషపడాలా? బాధపడలా? తెలీక అయోమయంలో ఉన్నారు. మరి ఇంతకీ ఎన్సీఏ పెట్టిన ఆ కండీషన్ ఏంటి?

కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2024 సీజన్ లో ఆడటానికి నేషనల్ క్రికెట్ అకాడమీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ చివర్లో ఓ మెలికపెట్టింది. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ ఫ్యాన్స్ సంతోషపడాలా? బాధపడలా? తెలీక అయోమయంలో ఉన్నారు. మరి ఇంతకీ ఎన్సీఏ పెట్టిన ఆ కండీషన్ ఏంటి?

IPL 2024.. లక్నోకు భారీ గుడ్ న్యూస్! రాహుల్ కు NCA గ్రీన్ సిగ్నల్.. కానీ ఓ కండీషన్

ఐపీఎల్ 17వ సీజన్ స్టార్టింగ్ కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ కు భారీ ఊరట లభించింది. గాయంతో ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కు కొన్ని మ్యాచ్ లు దూరంగా ఉన్నాడు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్. చికిత్స కోసం నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరాడు. ఇక ప్రస్తుతం గాయం నుంచి రాహుల్ పూర్తిగా కోలుకోవడంతో.. ఐపీఎల్ లో ఆడేందుకు ఎన్సీఏ కూడా అనుమతి ఇచ్చింది. ఇది లక్నోకు భారీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. రాహుల్ రాకతో టీమ్ మరింత స్ట్రాంగ్ గా తయ్యారుకానుంది. అయితే ఎన్సీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. ఓ కండీషన్ పెట్టింది. మరి కండీషన్ ఏంటి?

కేఎల్ రాహుల్.. గాయం కారణంగా ఇంగ్లండ్ తో జరిగిన కొన్ని టెస్ట్ మ్యాచ్ లకు దూరమైయ్యాడు. ఇన్ని రోజులు నేషనల్ క్రికెట్ అకాడమీ బెంగళూరులో చికిత్స తీసుకున్నాడు. ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో.. ఎన్సీఏ రాహుల్ శుభ్రంగా ఐపీఎల్ ఆడొచ్చని సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో లక్నో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. కానీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే ఇచ్చి.. చివర్లో ఓ కండీషన్ పెట్టి పెద్ద షాక్ ఇచ్చింది. రాహుల్ టీమ్ లోకి వచ్చినందుకు సంతోషపడాలా? లేక ఎన్సీఏ ఈ కండీషన్ పెట్టినందుకు బాధపడాలా? వారికి అర్ధం కావడం లేదు. అయితే అకాడమీ పెట్టిన రూల్ పెద్దదేమీ కాదు. ఇంతకీ ఆ కండీషన్ ఏంటంటే?

కేఎల్ రాహుల్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ ల్లో బ్యాటింగ్ చేయెుచ్చు. కానీ కీపింగ్ మాత్రం చేయకూడదని నిబంధన పెట్టింది. స్టార్టింగ్ లో ఎక్కువ ఒత్తిడికి గురికాకూడదనే ఉద్దేశంతోనే ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు కెప్టెన్, మరోవైపు కీపింగ్ అంటే పనిభారం విపరీతంగా పెరుగుతుంది. దీంతో అతడు మళ్లీ గాయాలబారిన పడటమే కాకుండా.. ఆ ప్రభావం బ్యాటింగ్ పై పడుతుంది. ఇది జూన్ లో ప్రారంభం అయ్యే టీ20 వరల్డ్ కప్ పై ప్రభావం చూపెడుతుందని మేనేజ్ మెంట్ భావిస్తోంది. అయితే ఇది లక్నోపై పెద్దగా ప్రభావం చూపదని క్రీడా పండితులు భావిస్తున్నారు. ఎందుకంటే? ఆ టీమ్ లో ఇప్పటికే ఇద్దరు కీపర్లు ఉన్నారు. విండీస్ కు చెందిన నికోలస్ పూరన్, సౌతాఫ్రికాకు చెందిన క్వింటన్ డికాక్ రూపంలో లక్నోకు కీపర్లు అందుబాటులో ఉన్నారు. మార్చి 20 గురువారం నాడు రాహుల్ లక్నో టీమ్ లో చేరనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇక తమ తొలి మ్యాచ్ లో రాజస్తాన్ ను మార్చి 24న ఢీకొనబోతోంది లక్నో.

ఇదికూడా చదవండి: IPL 2024.. SRHకి బిగ్ షాక్! ఆ ప్లేయర్ నిర్ణయంతో కొంపమునిగింది!