Somesekhar
ఐపీఎల్ 2024లో తొలి మ్యాచ్ ఆడేశాడు ధోని. అయినప్పటికీ.. ఐపీఎల్ నుంచి అతడు తప్పుకుంటాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఐపీఎల్ 2024లో తొలి మ్యాచ్ ఆడేశాడు ధోని. అయినప్పటికీ.. ఐపీఎల్ నుంచి అతడు తప్పుకుంటాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Somesekhar
IPL 2024 సీజన్ ప్రారంభానికి కొన్ని నెలల ముందు నుంచే ఓ ప్రశ్న క్రికెట్ అభిమానులను కలవరపెట్టింది. అదేంటంటే? టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ మహేంద్రసింగ్ ధోని ఈ ఐపీఎల్ సీజన్ ఆడతాడా? లేడా? ఈ ప్రశ్న తలెత్తడానికి పెద్ద కారణాలే ఉన్నాయి. ఒకటి ధోని మోకాలికి సర్జరీ కావడం, రెండు వయసు పైబడటం. ఈ రెండు రీజన్స్ వల్ల ధోనికి ఈ సీజన్ ఆడటం కష్టమని, ఒకవేళ ఆడినా.. ఇదే లాస్ట్ సీజన్ అని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ వారి అంచనాలను బద్దలుకొడుతూ.. ఐపీఎల్ 2024లో తొలి మ్యాచ్ ఆడేశాడు ధోని. అయినప్పటికీ.. ఐపీఎల్ నుంచి అతడు తప్పుకుంటాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్. ప్రస్తుతం గేల్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్ ఈ ఐపీఎల్ సీజన్ ను ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ను 6 వికెట్లతో కంగుతినిపించింది. ధోని తన కెప్టెన్సీని యంగ్ ప్లేయర్ రుతురాజ్ కు అప్పగించి.. కేవలం వికెట్ కీపింగ్ మాత్రమే చేస్తున్నాడు. అయితే ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభానికి ముందు ధోనికి ఇదే చివరి సీజన్ అని, అసలు ఆడతాడో?లేడో? అని చాలా మంది సందేహాలు వ్యక్తం చేశారు. కానీ అవన్నీ నిజం కావని తొలి మ్యాచ్ తో తేలిపోయింది. అయినప్పటికీ.. వెస్టిండీస్ దిగ్గజం, మాజీ ప్లేయర్ క్రిస్ గేల్ చేసిన వ్యాఖ్యలు ధోని ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ధోని ఐపీఎల్ 2024 సీజన్ ఆడటంపై క్రిస్ గేల్ మాట్లాడుతూ..”ధోని ఈ సీజన్ లో మెుత్తం మ్యాచ్ లు ఆడడు. మధ్యలో స్వల్ప విరామం తీసుకుంటాడు. అందుకే స్టార్టింగ్ లోనే కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించాడు. అయితే అతడు తీసుకున్న ఈ నిర్ణయంతో బాగా రాణిస్తాడు. దీని గురించి అభిమానులకు ఎలాంటి భయాలు, బాధలు వద్దు” అని చెప్పుకొచ్చాడు యూనివర్సల్ బాస్. అయితే కెప్టెన్సీని గైక్వాడ్ కు అప్పగించడంతో నిజంగానే క్రిస్ గేల్ చెప్పిన థియరీ ప్రకారం ధోని ఈ సీజన్ లో కొన్ని మ్యాచ్ లకు అందుబాటులో ఉండకపోవచ్చనే అనిపిస్తోంది. దీంతో ఇటు సీఎస్కే ఫ్యాన్స్, అటు ధోని ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. మోకాలికి సర్జరీ తర్వాత ధోని మునుపటిలా ఉంటాడా? అన్న వారి ప్రశ్నలకు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తూ.. చిరుతలా కీపింగ్ చేశాడు ధోని. మరి గేల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
IPL 2024 – “MS Dhoni May Not Play All Games”: Chris Gayle Drops Bombshell#IPL2024 #MSDhoni #CSK https://t.co/WbO0fNL1iM pic.twitter.com/FtGrC9VUZM
— CricketNDTV (@CricketNDTV) March 23, 2024
ఇదికూడా చదవండి: SRH vs KKR మ్యాచ్ మధ్యలో గంట బ్రేక్? కారణం?