Nidhan
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని డ్రామాలు ఆడుతున్నాడని ఓ ఆసీస్ లెజెండ్ అన్నాడు. ఆ విషయంలో అనవసర రాద్ధాంతం ఎందుకని ప్రశ్నించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని డ్రామాలు ఆడుతున్నాడని ఓ ఆసీస్ లెజెండ్ అన్నాడు. ఆ విషయంలో అనవసర రాద్ధాంతం ఎందుకని ప్రశ్నించాడు.
Nidhan
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో ఆసక్తికర పోరుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే తన ఆఖరి మ్యాచ్‌లో ఆర్సీబీపై నెగ్గాల్సిన సిచ్యువేషన్లో ఉంది సీఎస్కే. ఈ నేపథ్యంలో బెంగళూరుతో మ్యాచ్‌లో తన అనుభవాన్ని అంతా రంగరించి ఎల్లో ఆర్మీని గట్టెక్కించాలని చూస్తున్నాడు మాహీ. కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు అండగా ఉంటూ టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇన్నాళ్లూ ఆఖర్లో బ్యాటింగ్‌కు వస్తూ దుమ్మురేపిన ధోని.. ప్లేఆఫ్స్ వెళ్లాలంటే గెలవక తప్పదు కాబట్టి, ఆర్సీబీతో పోరులో కాస్త ముందుకు వచ్చి బ్యాటింగ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో అతడి గురించి ఆసీస్ లెజెండ్ మైక్ హస్సీ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఆ విషయంలో ధోని డ్రామాలాడుతున్నాడని హస్సీ అన్నాడు. దాని గురించి క్లారిటీ ఇవ్వాల్సింది మాహీయేనని.. అది అతడి చేతుల్లోనే ఉందన్నాడు. ఏ విషయంలో ధోని గురించి హస్సీ ఇలా అన్నాడనేగా మీ డౌట్. తన రిటైర్మెంట్ విషయంలో సీఎస్కే మాజీ సారథి వ్యవహరిస్తున్న తీరుపై హస్సీ సీరియస్ అయ్యాడు. రిటైర్మెంట్ గురించి తేల్చుకుండా అతడు డ్రామాలు ఆడుతున్నాడని చెప్పాడు. ధోని ఇంకొన్నాళ్లు ఐపీఎల్లో కొనసాగే అవకాశం కనిపిస్తోందని అన్నాడు. అతడి తీరు చూస్తుంటే ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించకపోవచ్చని పేర్కొన్నాడు. ఏ విషయమైనా వెంటనే బయటపెట్టడం ధోనీకి అలవాటు లేదన్నాడు. దేన్నైనా రహస్యంగా ఉంచడం అతడికి మామూలేనని వ్యాఖ్యానించాడు.
‘ధోని ఇంకా బాగా ఆడుతున్నాడు. అతడి బ్యాట్ ఈ సీజన్లో గర్జిస్తోంది. అవకాశం దొరికినప్పుడల్లా బరిలోకి దిగి భారీ సిక్సులు బాదుతున్నాడు. గత ఐపీఎల్లో అతడి మోకాలుకు సర్జరీ అయింది. దాని నుంచి పూర్తిగా కోలుకోలేదు. అయినా మ్యానేజ్ చేస్తూ వస్తున్నాడు. ధోని ఆడుతున్న తీరు చూస్తుంటే ఇంకొన్నేళ్ల పాటు ఈజీగా కెరీర్‌ను కంటిన్యూ చేస్తాడని అనిపిస్తోంది. కానీ ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం. తన రిటైర్మెంట్ గురించి ఆలోచించి నిర్ణయం ప్రకటించాల్సింది మాహీనే. కానీ అతడు ఏదీ ఓ పట్టాన చెప్పడు. ప్రతి దాని చుట్టూ డ్రామా క్రియేట్ చేయడం అతడికి ఇష్టం. అతడి వ్యవహారం చూస్తుంటే ఇప్పుడప్పుడే గేమ్‌కు గుడ్‌బై చెప్పేలా అనిపించడం లేదు’ అని హస్సీ స్పష్టం చేశాడు. మరి.. రిటైర్మెంట్ విషయంలో ధోని డ్రామాలు ఆడుతున్నాడంటూ హస్సీ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Mike Hussey said, “I hope MS Dhoni keeps going for another couple of years. He is the only one who will make that call and he likes to build drama a little bit so I wouldn’t expect a decision anytime soon”. (Espncricinfo). pic.twitter.com/IXaRrA3KAJ
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 16, 2024