iDreamPost
android-app
ios-app

ఆ గాయాన్ని ఇంకా మర్చిపోని కమిన్స్.. హర్దిక్, సూర్యతోనూ షేర్ చేసుకున్నాడు!

  • Published May 07, 2024 | 3:14 PM Updated Updated May 07, 2024 | 3:14 PM

సన్​రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆ గాయాన్ని ఇంకా మర్చిపోలేదు. ఎంతో బాధపెట్టిన ఆ విషయం గురించి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్​తో పాటు సూర్య భాయ్​తో కూడా షేర్ చేసుకున్నాడు.

సన్​రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆ గాయాన్ని ఇంకా మర్చిపోలేదు. ఎంతో బాధపెట్టిన ఆ విషయం గురించి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్​తో పాటు సూర్య భాయ్​తో కూడా షేర్ చేసుకున్నాడు.

  • Published May 07, 2024 | 3:14 PMUpdated May 07, 2024 | 3:14 PM
ఆ గాయాన్ని ఇంకా మర్చిపోని కమిన్స్.. హర్దిక్, సూర్యతోనూ షేర్ చేసుకున్నాడు!

ఐపీఎల్-2024 ఫస్టాఫ్​లో వరుస విజయాలతో ఫుల్ జోష్​లో కనిపించింది సన్​రైజర్స్ హైదరాబాద్. నీళ్లు తాగినంత అలవోకగా 200, 250 ప్లస్ స్కోర్లు బాదేస్తూ అపోజిషన్ టీమ్స్ వెన్నులో వణుకు పుట్టించింది. పవర్ హిట్టింగ్​తో ప్రత్యర్థి బౌలర్లకు పోయించింది. భారీ విజయాలతో ఈసారి కప్పు తమదే అనే భరోసాను అభిమానుల్లో కలిగించింది. అయితే సెకండాఫ్​లో కథ పూర్తిగా అడ్డం తిరిగింది. గెలవడమే మరిచిపోయినట్లు కనిపిస్తోంది కమిన్స్ సేన. మధ్యలో మిస్సైన మూమెంటమ్​ను తిరిగి పట్టుకోవడంలో ఫెయిల్ అవుతోంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో నిన్న ముంబై ఇండియన్స్ చేతుల్లో 7 వికెట్ల తేడాతో ఓడి ప్లేఆఫ్స్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. దీంతో ఎస్​ఆర్​హెచ్ కెప్టెన్ కమిన్స్ నిరాశలో కూరుకుపోయాడు.

ముంబై మీద ఓటమి కమిన్స్​ను బాధించింది. అందుకే మ్యాచ్ తర్వాత డల్​గా కనిపించాడు. అయితే ఓ పాత గాయం కూడా అతడ్ని వెంటాడుతున్నట్లు ఉంది. అందుకే దాని గురించి నిన్న మ్యాచ్ ముగిశాక ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, పించ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్​తో షేర్ చేసుకున్నాడు. వీళ్ల మధ్య కన్వర్జేషన్​కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కమిన్స్​కు చిన్నతనంలో ఓ ఇంజ్యురీ అయింది. బాల్యంలో తన సోదరితో కలసి ఆడుకుంటున్న సమయంలో అనూహ్యంగా కమిన్స్ కుడి చేతి మధ్య వేలికి గాయమైంది. అతడి సోదరి అనుకోకుండా ఇంటి తలుపును బలంగా నెట్టడంతో వేలికి ఇంజ్యురీ అయింది.

ఆ గాయం కారణంగా వేలి పైభాగం తీవ్రంగా దెబ్బతింది. అయితే ఇది కమిన్స్​ను బౌలర్ కాకుండా ఆపలేకపోయింది. మిగిలిన వేళ్ల సపోర్ట్​తో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఈ స్థాయికి చేరుకున్నాడు. సాధారణంగా బౌలర్​కు బంతి మీద గ్రిప్ చిక్కాలంటే మధ్య వేలుతోనే సాధ్యం. అలాంటిది గాయం కారణంగా ఆ వేలుతో ఇబ్బంది పడుతున్నా దాన్ని బయటపడకుండా ఆడుతూ పోతున్నాడు కమిన్స్. నిన్న మ్యాచ్ తర్వాత హార్దిక్, సూర్యతో సంభాషణలో ఇదే విషయాన్ని వాళ్లిద్దరితో పంచుకున్నాడు కమిన్స్. సోదరి తలుపు నెట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ఎస్​ఆర్​హెచ్ సారథి చెప్పడంతో హార్దిక్ షాకయ్యాడు. అతడి రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ పాత గాయాన్ని కమిన్స్ మర్చిపోలేదని కామెంట్స్ చేస్తున్నారు.