Tirupathi Rao
Lucknow Super Giants: లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఇండియాకి రావాల్సిన స్టార్ పేసర్ స్వదేశానికి తిరిగి పయనమయ్యాడు. ఈ విషయాన్ని కోచ్ వెల్లడించాడు.
Lucknow Super Giants: లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఇండియాకి రావాల్సిన స్టార్ పేసర్ స్వదేశానికి తిరిగి పయనమయ్యాడు. ఈ విషయాన్ని కోచ్ వెల్లడించాడు.
Tirupathi Rao
ప్రస్తుతం అందరిచూపు ఐపీఎల్ 2024 సీజన్ మీదే ఉంది. అన్ని జట్లు ప్రారంభ మ్యాచ్ నుంచి సత్తా చాటేందుకు కఠోరంగా శ్రమిస్తున్నాయి. అలాగే తుదిజట్టులో ఎవరిని ఆడించాలి? ఎవరికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి అంటూ తెగ వ్యూహాలు రచిస్తున్నారు. అంతేకాకుండా క్యాంపుల్లో ఉంచి తెగ ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఇలాంటి తరుణంలో లక్నో సూపర్ జెయింట్స్ కి ఒక షాక్ తగిలింది. వారి జట్టులోని స్టార్ పేసర్ ఇండియాకి రాకుండా.. స్వదేశానికి తిరిగి పయనమయ్యాడు అంట. ప్రస్తుతానికి అతను జట్టుతో కలిసే పరిస్థితులు లేవు అంటున్నారు. అసలు అతన ఎవరు? ఎందుకు అలా ఇండియాకి రాకుండా స్వదేశానికి వెళ్లాడు?
లక్నో సూపర్ జెయింట్స్ కి షాకిచ్చిన ఆ పేసర్ మరెవరో కాదు.. డేవిడ్ విల్లే. అతను పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ తర్వాత ఇండియాకి రావాల్సి ఉంది. కానీ, అతను అలా కాకుండా స్వదేశమైన ఇంగ్లాండ్ కి పయనమయ్యాడు. ఆ విషయాన్ని ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ వెల్లడించాడు. డేవిడ్ విల్లే గత 2 నెలలుగా ఇంటర్నేషనల్ లీగ్, పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ అంటూ ఫుల్ బిజీగా గడిపేస్తూ వచ్చాడు. అతను తాజాగా ఐపీఎల్ కి రావాల్సి ఉండగా.. వ్యక్తిగత కారణాల రీత్యా రాలేకపోతున్నాను అంటూ చెప్పేశాడంట.
విల్లేని లక్నో సూపర్ జెయింట్స్ 2024 వేలంలో రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది. అతని నుంచి చాలానే ప్రదర్శనను వీళ్లు ఆకాంక్షించారు. కానీ, విల్లే మాత్రం ఇలా హ్యాండిచ్చాడు. అయితే ఇతను అన్ని మ్యాచులకు దూరంగా ఉండడు అని తెలుస్తోంది. ప్రారంభంలో కొన్ని మ్యాచులకు మాత్రమే విల్లే దూరంగా ఉంటాడు అంటున్నారు. అతను కొద్ది రోజుల తర్వాత తిరిగి ఇండియాకి వచ్చి జట్టుతో కలుస్తాడని తెలుస్తోంది. అందుకే లక్నో సూపర్ జెయింట్స్ డేవిడ్ విల్లే స్థానంలో ఇంకో ఆటగాడిని ప్రకటించలేదు అంటున్నారు. ఇప్పటికే మార్క ఉడ్ రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ కి ఒక ఆటగాడు దూరమైన విషయం తెలిసిందే. వచ్చే టీ20 వరల్డ్ కప్ ని దృష్టిలో ఉంచుకుని మార్క్ ఉడ్ పై లోడ్ పడకూడదు అని అతనిపై ఆంక్షంలు విధించింది. దాంతో మార్క్ ఉడ్ మొత్తం ఐపీఎల్ 2024 సీజన్ కి దూరమయ్యాడు.
ఇప్పుడు డేవిడ్ విల్లే రూపంలో ఇంకో ఇంగ్లీష్ ఆటగాడు లక్నో జట్టుకు షాకిచ్చాడు. ప్రస్తుతం లక్నో జట్టు పూర్తి ఫోకస్ ని తొలి మ్యాచ్ మీదే పెట్టింది. మార్చి 22న లీగ్ స్టార్ట్ అవుతుండగా.. లక్నో మాత్రం మార్చి 24న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. జైపూర్ వేదికగా తొలి మ్యాచ్ లో లక్నో జట్టు రాజస్థాన్ తో తలపడనుంది. ఈ తొలి షెడ్యూల్ ప్రకారం లక్నో మరో 3 మ్యాచ్లు ఆడుతుంది. పంజాబ్, ఆర్సీబీ, గుజరాత్ జట్లతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తలపడనుంది. మరి.. లక్నో జట్టుకు స్టార్ పేసర్ విల్లే షాకివ్వండపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.