Tirupathi Rao
LSG vs SRH- KL Rahul: సన్ రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు పూర్తి ఆధిపత్యం కొనసాగించింది. ఎక్కడా కూడా లక్నో బ్యాటర్లకు ఆస్కారం లేకుండా చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒక చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు.
LSG vs SRH- KL Rahul: సన్ రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు పూర్తి ఆధిపత్యం కొనసాగించింది. ఎక్కడా కూడా లక్నో బ్యాటర్లకు ఆస్కారం లేకుండా చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒక చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు.
Tirupathi Rao
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో కీలక మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో జట్టుకు ఎక్కడా ఆస్కారం దొరకలేదు. హైదరాబాద్ టీమ్ బౌలర్లు లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లను వరుస పెట్టి పెవిలియన్ కు పంపేశారు. ఎంత డామినేట్ చేయాలని కేఎల్ రాహుల్ సేన ప్రయత్నాలు చేసినా కూడా వారికి అవకాశం దక్కలేదు. కమ్మిన్స్ సేన పదునైన డెలివరీలతో లక్నో బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టింది. ఆఖరికి కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ప్రతిఘటించలేకపోయాడు. ఒక చెత్త రికార్డును కూడా తన పేరిట లిఖించాడు.
ఈ సీజన్లో హైదరాబాద్ తో మ్యాచ్ అంటే అన్ని జట్లు అలర్ట్ అయిపోతున్నాయి. అందులోనూ మ్యాచ్ జరుగుతోంది ఉప్పల్ స్టేడియంలో. ఇంకేముంది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పూర్తి డామినేషన్ చూపించేసింది. హైదరాబాద్ కు ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తే భారీ స్కోర్లు కొడతారు.. ఛేజింగ్ అయితే తేలిపోతారని అంతా అనుకుంటున్నారు. అదే ఉద్దేశంతో లక్నో కూడా బ్యాటింగ్ తీసుకున్నట్లు కనిపిచింది. ఇన్నాళ్లూ బ్యాటుతో బదులు ఇచ్చిన హైదరాబాద్ జట్టు ఇప్పుడు బాల్ తో కూడా గట్టిగానే సమాధానం చెప్తోంది. అందుకే రాహుల్ సేన నామమాత్రపు స్కోర్ మాత్రమే చేయగలుగుతోంది. ముఖ్యంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ లో ఒక చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు.
ఫస్ట్ ఓవర్ నుంచి క్రీజులో ఉన్న కేఎల్ రాహుల్.. ఈ మ్యాచ్ లో మొత్తం 33 బంతులు ఎదుర్కొన్నాడు. ఈ 33 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్ సాయంతో కేవలం 29 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మొదట క్వింటన్ డికాక్(2), తర్వాత స్టోయినిస్(3) అతి తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేరారు. కేఎల్ రాహుల్ బాధ్యతగా క్రీజులో ఉండి ఆటను కొనసాగిస్తాడని లక్నో ఫ్యాన్స్ భావించారు. కానీ, దాదాపు సగం ఓవర్లు క్రీజులో ఉన్నా కూడా కేఎల్ రాహుల్ చేసింది ఏమీ లేదు. అతని ఆటతో కేఎల్ రాహుల్ ఒక చెత్త రికార్డును తన పేరిట వేసుకున్నాడు. హైదరాబాద్ మీద జరిగిన ఈ మ్యాచ్ లో 30 కంటే ఎక్కువ బంతులు ఆడి.. అతి తక్కువ స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. కేఎల్ రాహుల్ 87.87 స్ట్రైక్ రేట్ తో కేవలం 29 పరుగులే చేశాడు. దీంతో ఈ సీజన్లో 30+ బంతులుల ఎదుర్కొని అతి తక్కువ స్ట్రైక్ రేట్ నమోదు చేసినట్లు అయ్యింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఇస్తాడనుకుంటే.. కేఎల్ రాహుల్ ఇలా చేశాడంటూ లక్నో ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు.
KL Rahul dismissed for 29 in 33 balls. pic.twitter.com/XZIfTGjquC
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 8, 2024