Tirupathi Rao
Kwena Maphaka UnWanted Record: దక్షిణ ఆఫ్రికా యువ పేస్ సంచలనం క్వేనా మఫాకాకు డెబ్యూ మ్యాచ్ ఒక పీడకలలా మిగిలిపోయింది. బుమ్రాకంటే తానే బెస్ట్ అంటూ కామెంట్స్ చేసి.. ఐపీఎల్ లోనే చెత్త రికార్డును నెలకొల్పాడు.
Kwena Maphaka UnWanted Record: దక్షిణ ఆఫ్రికా యువ పేస్ సంచలనం క్వేనా మఫాకాకు డెబ్యూ మ్యాచ్ ఒక పీడకలలా మిగిలిపోయింది. బుమ్రాకంటే తానే బెస్ట్ అంటూ కామెంట్స్ చేసి.. ఐపీఎల్ లోనే చెత్త రికార్డును నెలకొల్పాడు.
Tirupathi Rao
బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్- ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ లో కాకుండా.. ఐపీఎల్ చరిత్రలోనే ఒక మైలురాయిగా మారిపోయింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజృంభించిన తీరు ఇంకో పదేళ్లు అయినా చెప్పుకుంటూనే ఉంటారు. ధనాధన్ లీగ్ అంటే ఇదీ అంటూ హైదరాబాద్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఒక్క ఐపీఎల్ లోనే కాదు.. టీ20 మ్యాచులకే ఒక చెరిపేయలేని రికార్డుగా మారింది. ఈ మ్యాచ్ అయితే ఒక కుర్ర బౌలర్ కు జీవితాంతం గుర్తుండిపోతుంది. అది కూడా ఒక పీడకలలాగా. డెబ్యూలోనే అతను చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఉప్పల్ వేదికగా హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ తరఫున దక్షిణాఫ్రికా యువ సంచలనం క్వేనా మఫాకా అరంగేట్రం చేశాడు. అతనిపై ముంబయి ఇండియన్స్ యాజమాన్యానికే కాదు.. ఐపీఎల్ ఫ్యాన్స్ కి కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. బుమ్రా తర్వాత ముంబయి పేస్ యూనిట్ కి దొరికిన ఒక ట్రంప్ కార్డుగా అందరూ భావించారు. అతను వస్తే.. ప్రత్యర్థులకు వణుకు పుడుతుంది అని ఫుల్ ఎలివేషన్స్ ఇచ్చారు. కానీ, ఒక్కసారి గ్రౌండ్ లోకి దిగిన తర్వాత అదంతా భ్రమగా మిగిలిపోయింది. క్వేనా మఫాకాకి హైదరాబాద్ తో జరిగిన అరంగేట్రం మ్యాచ్ ఒక పీడకలలా మిగిలిపోయింది.
నిజానికి మఫాకా ఐపీఎల్ డెబ్యూని చాలా బాగా స్టార్ట్ చేశాడు. తొలి బంతిని వైడ్ గా వేసినా.. ఆ తర్వాత ఫామ్ లోకి వచ్చాడు. తొలి ఓవర్లో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ స్టాటిస్టిక్స్ చూస్తే ఒక సీనియర్ బౌలర్ కి సరిసమానం. కానీ, ఆ తర్వాత అంతా మారిపోయింది. హైదరాబాద్ అటాక్ కి మఫాకా బలికాక తప్పలేదు. ట్రావిస్ హెడ్ మొదలుకొని క్లాసెన్ వరకు అందరూ విజృంభించారు. 3 అర్ధ శతకాలు నమోదు అయ్యాయి. హార్దిక్ పాండ్యా మఫాకాని కూల్ గా ఉంచేందుకు చాలానే ప్రయత్నించాడు. వేసిన ప్రతి బంతి బౌండరికీ వెళ్తుంటే సీనియర్ బౌలర్ కి అయినా కంగారు పుట్టక మానదు. కానీ, మఫాకా కాస్త కూల్ గానే కనిపించాడు.
మొదటి ఓవర్లో ఇచ్చిన 7 పరుగులు తీసేస్తే.. మిగిలిన 3 ఓవర్లలో మఫాకా ఏకంగా 59 పరుగులు ఇచ్చాడు. 16.50 ఎకానమీతో మఫాకా బౌలింగ్ సాగింది. ఒక డెబ్యూ బౌలర్ తొలి మ్యాచ్ లో ఇన్ని పరుగులు ఇవ్వడం ఇదే మొదటిసారి. ఆ చెత్త రికార్డు ఇప్పుడు మఫాకా పేరిట పుస్తకాల్లోకి ఎక్కింది. ఈ మ్యాచ్ తర్వాత దక్షిణాఫ్రికా పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్ కూడా మఫాకా స్పెల్ గురించి మాట్లడాడు. “అండర్-19 మ్యాచులకు.. ప్రో లీగ్ లకు ఎంత తేడా ఉంటుందో ఇప్పుడు క్వేనా మఫాకాకి అర్థమై ఉంటుంది” అంటూ డేల్ కామెంట్ చేశాడు. అలాగే మ్యాచ్ అయ్యాక కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా మఫాకా ప్రదర్శన గురించి స్పందించాడు. ఒక కెప్టెన్ గా తమ యువ పేస్ సంచలనానికి మద్దతుగా నిలిచాడు.
“మఫాకా చాలా అద్భుతైన బౌలర్. అతని మొదటి గేమ్ లోనే ఇలాంటి స్వాగతం ఊహించిక పోవచ్చు. అతను బాగానే ఉన్నాడు. తన ప్రదర్శనను మెరుగు పరుచుకుంటాడు. కాకపోతే కాస్త సమయం అవసరం అవుతుంది కావచ్చు” అంటూ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలోనే గతంలో క్వేనా మఫాకా చేసిన కొన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు చెప్పాడు. “బుమ్రా అద్భుతమైన బౌలర్ కావచ్చు.. కానీ, నేను బుమ్రా కంటే అద్భుతంగా రాణించగలను” అంటూ క్వేనా మఫాకా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బుమ్రా కంటే తోపునంటివి.. ఇప్పుడేంది ఇట్లా చేశావా? అంటూ నెటిజన్స్ మఫాకాని ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు ముంబయి ఇండియన్స్ అభిమానులు మఫాకాకు మద్దతుగా నిలుస్తున్నారు. మరి.. క్వేనా మఫాకా నెలకొల్పిన చెత్తరికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A tough night on debut for the youngster Kwena Maphakam!#KwenaMaphaka #SRHvMI #SRHvsMI #IPL2024 #IPL #Cricket #SBM pic.twitter.com/IwCfeaj68w
— SBM Cricket (@Sbettingmarkets) March 27, 2024