iDreamPost
android-app
ios-app

కేఎల్ రాహుల్-లక్నో ఓనర్ కాంట్రవర్సీపై టీమిండియా స్టార్ క్రికెటర్ రియాక్షన్.. సిగ్గుండాలంటూ..!

  • Published May 10, 2024 | 4:19 PM Updated Updated May 10, 2024 | 4:19 PM

లక్నో సూపర్ జియాంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్​తో ఆ టీమ్ ఓనర్ ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కాంట్రవర్సీపై టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమి రియాక్ట్ అయ్యాడు.

లక్నో సూపర్ జియాంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్​తో ఆ టీమ్ ఓనర్ ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కాంట్రవర్సీపై టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమి రియాక్ట్ అయ్యాడు.

  • Published May 10, 2024 | 4:19 PMUpdated May 10, 2024 | 4:19 PM
కేఎల్ రాహుల్-లక్నో ఓనర్ కాంట్రవర్సీపై టీమిండియా స్టార్ క్రికెటర్ రియాక్షన్.. సిగ్గుండాలంటూ..!

సన్​రైజర్స్ హైదరాబాద్​తో మ్యాచ్​లో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన లక్నో సూపర్ జియాంట్స్ ప్లేఆఫ్స్ అవశాకాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఆ టీమ్ నెట్ రన్​రేట్ కూడా మైనస్​లోకి వెళ్లిపోయింది. ప్లేఆఫ్స్​కు వెళ్లాలంటే తదుపరి ఆడే రెండు మ్యాచుల్లోనూ ఆ జట్టు నెగ్గాల్సి ఉంటుంది. ఆరెంజ్ ఆర్మీ చేతిలో దారుణ పరాభవాన్ని ఆ టీమ్ ప్లేయర్లు జీర్ణించుకోలేకపోయారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా నిరాశలో కూరుకుపోయాడు. ఈ తరుణంలో మ్యాచ్​ ముగిసిన తర్వాత లక్నో ఓనర్ సంజీవ్ గోరెంకా రాహుల్​పై సీరియస్ అవడం తెలిసిందే. రాహుల్ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా ఆయన అస్సలు వినిపించుకోలేదు.

కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా కాంట్రవర్సీపై సీనియర్ క్రికెటర్లు రియాక్ట్ అవుతున్నారు. లక్నో యాజమాన్యం వ్యవహరించిన తీరు సరికాదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమి స్పందించాడు. టీమ్ కెప్టెన్​తో ఇలా వ్యవహరించడం సిగ్గుచేటంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘ప్లేయర్లకు ఆత్మగౌరవం ఉంటుంది. ఓనర్​గా గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి చాలా మంది ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. అలాంటి పర్సన్ కెమెరాల ముందు అలా చేయడం నిజంగా సిగ్గుచేటు. కెప్టెన్​తో మాట్లాడాలనుకుంటే దానికి పలు మార్గాలు ఉన్నాయి. డ్రెస్సింగ్​ రూమ్​కు వెళ్లి డిస్కస్ చేయొచ్చు. హోటల్ రూమ్​లో కూడా దీనిపై చర్చించొచ్చు’ అని షమి చెప్పుకొచ్చాడు.

వేలాది మంది ఆడియెన్స్ చూస్తుండగా గ్రౌండ్​లో కెప్టెన్​తో ఇలా వ్యవహరించడం సరికాదంటూ షమి ఫైర్ అయ్యాడు. అందరికముందు అసహనం వ్యక్తం చేయడం, సీరియస్ అవ్వడం ద్వారా ఎర్రకోట మీద జెండా ఎగురవేసినంత గొప్ప ఏమైనా వచ్చిందా అని ప్రశ్నించాడు. రాహుల్ ఓ ప్లేయర్ మాత్రమే కాదు.. కెప్టెన్ కూడా అని, ప్రతిసారి మనం అనుకున్నట్లు ప్లాన్స్ వర్కౌట్ అవ్వకపోవచ్చన్నాడు షమి. గేమ్ అన్నాక గెలుపోటములు సహజమని.. అంతమాత్రాన సారథిని అందరిముందు కించపర్చడం ఎంతవరకు కరెక్ట్ అని క్వశ్చన్ చేశాడు. ఇలాంటి బిహేవియర్​తో ఫ్యాన్స్​లోకి తప్పుడు మెసేజ్ వెళ్లేలా చేశారంటూ లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా తీరుపై విరుచుకుపడ్డాడు షమి. మరి.. అలా చేయడానికి సిగ్గుండాలంటూ ఎల్​ఎస్​జీ యాజమాన్యంపై షమి ఫైర్ అవడం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.