KL రాహుల్​ను తిడితే తప్పేంటి.. సౌతాఫ్రికా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు!

లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్​తో ఆ టీమ్ ఓనర్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా ఓ సౌతాఫ్రికా లెజెండ్ రియాక్ట్ అయ్యాడు.

లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్​తో ఆ టీమ్ ఓనర్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా ఓ సౌతాఫ్రికా లెజెండ్ రియాక్ట్ అయ్యాడు.

క్రికెట్ అనే కాదు.. ఏ ఆటలోనైనా గెలుపోటములు సహజం. వాటిని ఒకే రకంగా తీసుకోవాలి. కానీ అందరూ అలా ఉండరు. నెగ్గితే ఫుల్​గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఓడితే అందరి ముందే విమర్శలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అది ఆటగాళ్ల మధ్య కామన్. కానీ టీమ్ ఓనర్ ఒక కెప్టెన్​తో అలా ప్రవర్తిస్తే మాత్రం కరెక్ట్ కాదనే చెప్పాలి. ఈ ఐపీఎల్​లో అదే జరిగింది. సన్​రైజర్స్ హైదరాబాద్​తో మ్యాచ్​లో లక్నో సూపర్ జియాంట్స్ చిత్తుగా ఓడింది. దీంతో వేలాది ప్రేక్షకుల నడుమ జట్టు సారథి కేఎల్ రాహుల్ మీద ఓనర్ సంజీవ్ గోయెంకా సీరియస్ అయ్యాడు. అతడు వివరిస్తున్నా వినకుండా తిట్టాడు. దీంతో ఎల్​ఎస్​జీ మేనేజ్​మెంట్​పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.

కెప్టెన్ స్థాయి వ్యక్తితో ఇలాగేనా బిహేవ్ చేసేది అంటూ లక్నో యాజమాన్యానంపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ కాంట్రవర్సీపై తాజాగా ఎల్​ఎస్​జీ అసిస్టెంట్ కోచ్ లాన్స్ క్లూసెనర్ రియాక్ట్ అయ్యాడు. రాహుల్​ను తిడితే తప్పేంటి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడీ సౌతాఫ్రికా దిగ్గజం. క్రికెట్ లవర్స్ మధ్య జరిగే ఇలాంటి కన్వర్జేషన్​లో ఎలాంటి తప్పు లేదంటూ ఫ్రాంచైజీని వెనకేసుకొచ్చేందుకు ప్రయత్నించాడు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకోవాలని, అప్పుడే టీమ్ మరింత మెరుగువుతుందని స్పష్టం చేశాడు క్లూసెనర్. జట్టు ఆటతీరు విషయంలో, ముఖ్యంగా బ్యాటింగ్​లో తాము మరింత బెటర్ అవ్వాల్సిన అవసరం ఉందన్నాడు.

‘ఇద్దరు క్రికెట్ లవర్స్ మధ్య జరిగే ఇలాంటి సంభాషణల్లో ఎలాంటి సమస్య ఉందని నాకు అనిపించడం లేదు. ఇలాంటి డిస్కషన్స్ మాకు బాగా నచ్చుతాయి. ఇలా నిక్కచ్చిగా మాట్లాడుకుంటే జట్టు మరింత మెరుగవుతుంది’ అని క్లూసెనర్ చెప్పుకొచ్చాడు. ఇక మీదట కూడా టీమ్​కు రాహులే కెప్టెన్​గా ఉంటాడని, అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని క్లారిటీ ఇచ్చాడు. రాహుల్​తో పాటు బ్యాటింగ్ యూనిట్ మొత్తం కలసికట్టుగా ఆడాల్సిన అవసరం ఉందన్నాడు. తదుపరి మ్యాచుల్లో కేఎల్ తన కెపాసిటీకి తగ్గట్లు ఆడతాడని భావిస్తున్నానని తెలిపాడు. అయితే క్లూసెనర్ కామెంట్స్​పై సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. అతడు మాట్లాడింది కరెక్ట్ కాదని అంటున్నారు. ఏదైనా ఉంటే డ్రెస్సింగ్ రూమ్​లో లేదా హోటల్​లో డిస్కస్ చేయాలని, అందరి ముందు కెప్టెన్​తో ఇలా వ్యవహరించడం సరికాదని, దాన్ని క్లూసెనర్ వెనకేసుకురావడం తప్పని కామెంట్స్ చేస్తున్నారు.

Show comments