KKR vs RCB మ్యాచ్ లో ఈ సీన్ చూశారా? వీళ్లు నిజంగానే శత్రువులు!

KKR vs RCB: ఐపీఎల్ 2024 సీజన్ లో ప్రతి మ్యాచ్ ఆసక్తిగా సాగుతోంది. అన్ని మ్యాచులు ఒకెత్తు అయితే ఆర్సీబీ- కేకేఆర్ మ్యాచ్ మాత్రం మరో ఎత్తు అని చెప్పాలి. వారి మధ్య ఉన్న పోరాటం తెలిపే వీడియో వైరల్ అవుతోంది.

KKR vs RCB: ఐపీఎల్ 2024 సీజన్ లో ప్రతి మ్యాచ్ ఆసక్తిగా సాగుతోంది. అన్ని మ్యాచులు ఒకెత్తు అయితే ఆర్సీబీ- కేకేఆర్ మ్యాచ్ మాత్రం మరో ఎత్తు అని చెప్పాలి. వారి మధ్య ఉన్న పోరాటం తెలిపే వీడియో వైరల్ అవుతోంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. మైదానంలో పరుగుల వరద పారుతోంది. బౌలర్లు, బ్యాటర్లు అంతా విజృభిస్తున్నారు. అయితే ఐపీఎల్ లో ఏ టీమ్లు తలపడినా అంత ఇంట్రస్ట్ చూపిస్తారో లేదో గానీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ అనగానే ఐపీఎల్ ఫ్యాన్స్ మొత్తం అలర్ట్ అయిపోతారు. ఐపీఎల్ ఫైనల్ కి వచ్చినంత రెస్పాన్స్ వస్తుంది. ప్రతి బాల్ ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. అయితే వీరి మధ్య కాస్తో కూస్తో కోపతాపాలు ఉంటాయి అనుకుంటారు. కానీ, శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ఒక సీన్ చూస్తే వీళ్లు ప్రత్యర్థులు కాదు.. శత్రువులు అని ఆడియన్స్ కూడా ఒప్పుకుంటారు.

ఐపీఎల్ లో శుక్రవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ- కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కలకత్తా జట్టు సునాయాసంగా విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ప్రారంభం నుంచి ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేస్తూనే వచ్చారు. ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 182 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ టార్గెట్ ని కేకేఆర్ జట్టు కేవలం 16.5 ఓవర్లలోనే ఛేదించింది. మొత్తానికి 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఆర్సీబీ అంటే కేకేఆర్ ఇంత కసిగా ఆడుతుందా? అని చాలామంది అనుకున్నారు.

ఆర్సీబీ- కేకేఆర్ మధ్య ఇంతకాలం పరోక్షంగా యుద్ధం జరుగుతోందని ఆడియన్స్ కి కూడా తెలుసు. అయితే ఒకరిపై ఒకరు విజయం సాధించాలని కోరుకుంటూ తలపడుతూ ఉంటారు. ఆర్సీబీ- కేకేఆర్ మ్యాచ్ అంటే.. విరాట్ కోహ్లీ vs గౌతమ్ గంభీర్ అంటారు. అయితే వీళ్లు ప్రత్యర్థులు మాత్రమే.. శత్రువులు కాదులే అనుకునేవాళ్లు. కానీ, నిన్న మ్యాచ్ లో జరిగిన ఈ సీన్ చూస్తే నిజంగానే వీళ్లు శత్రువులు అని అందరూ అనుకుంటారు. మ్యాక్స్ వెల్ క్రీజులో ఉన్నాడు. రస్సెల్ బౌలింగ్ వేస్తున్నాడు. మ్యాక్స్ వెల్ సింగిల్ కోసం పరుగులు పెడుతున్నాడు. ఆ సమయంలో సాల్ట్ చేతికి బంతి అందింది. ఇంకేముంది మ్యాక్స్ వెల్ ని రనౌట్ చేస్తాడు అనుకున్నారు. కానీ, సాల్ట్ ఆ బంతిని వికెట్లకు కాకుండా నేరుగా మ్యాక్స్ వెల్ కు విసిరాడు. నిజానికి రస్సెల్ మీదకు కూడా వెళ్లింది. రస్సెల్ అలా తప్పుకున్నాడు. అది వెళ్లి మ్యాక్స్ వెల్ కి వెనుక భాగంలో బలంగా తగిలింది.

సాల్ట్ ఉద్దేశం రనౌట్ చేయాలనేది అయితే.. బాల్ ని వికెట్లకు విసరాలి. కానీ, అతను నేరుగా మనిషికే వేశాడు. ఆ తర్వాత సెలబ్రేట్ చేసుకున్నట్లు కూడా వీడియోలో ఉంది. నిజానికి క్రికెట్ లో అనుకోకుండా తగిలుతుంది. కానీ, కావాలని టార్గెట్ చేసి బంతి విసరరు. ఇది కూడా అలాంటిదే అని కొందరు అంటున్నారు. కానీ, ఇంకొందరు మాత్రం సాల్ట్ కావాలనే మ్యాక్సీని టార్గెట్ చేసి బంతిని విసిరాడు అంటున్నారు. నిన్న మ్యాచ్ లో ఈ వీడియో హైలెట్ కాలేదు. కానీ, ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూశాక.. ఆర్సీబీ- కేకేఆర్ మ్యాచ్ అంటే యుద్ధంలాగానే ఉంటుంది. వీళ్ల మధ్య ఈ పగలు ఎప్పుడు చల్లారుతాయో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఆర్సీబీ- కేకేఆర్ మధ్య పగలు ఎప్పుడు చల్లారతాయి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments