Nidhan
భారత జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లైన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ కాంట్రాక్ట్‌లను ఈ మధ్య బీసీసీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై బోర్డు సెక్రెటరీ జై షా తాజాగా రియాక్ట్ అయ్యాడు.
భారత జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లైన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ కాంట్రాక్ట్‌లను ఈ మధ్య బీసీసీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై బోర్డు సెక్రెటరీ జై షా తాజాగా రియాక్ట్ అయ్యాడు.
Nidhan
ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్.. తక్కువ సమయంలో భారత క్రికెట్ జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లుగా మారారు. అద్భుతమైన ఆటతీరుతో అన్ని ఫార్మాట్లలోనూ టీమ్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. అయితే గాయం సాకుతో ఇంగ్లండ్ సిరీస్ మధ్యలో నుంచి అయ్యర్ తప్పుకున్నాడు. మెంటల్ ఫెటీగ్ అంటూ సౌతాఫ్రికా టూర్ మధ్యలో నుంచి వెళ్లిపోయిన ఇషాన్ ఫ్రెండ్స్‌తో కలసి పార్టీలు చేసుకోవడం, ఐపీఎల్ ప్రాక్టీస్‌లో మునిగిపోవడం చర్చనీయాంశంగా మారింది. కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పినా కానీ డొమెస్టిక్ టోర్నీల్లో ఆడకపోవడంతో వీళ్లిద్దరి కాంట్రాక్ట్‌లను బీసీసీఐ తొలగించడం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా రియాక్ట్ అయ్యాడు బోర్డు సెక్రెటరీ జై షా.
ఇషాన్, అయ్యర్లు దేశవాళీల్లో ఆడాల్సిందేనని జై షా కూడా అప్పట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయినా వాళ్లిద్దరూ వినిపించుకోలేదు. దీంతో వేటు వేసింది బీసీసీఐ. తాజాగా ఈ కాంట్రవర్సీపై జై షా స్పందించాడు. ఇషాన్, అయ్యర్ కాంట్రాక్ట్‌లు తాను తీసేయలేదన్నాడు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చెప్పడం వల్లే వాళ్లిద్దరి కాంట్రాక్ట్‌లు పోయాయని క్లారిటీ ఇచ్చాడు. ‘ఇషాన్, శ్రేయస్‌ను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తీసేయాలని అజిత్ అగార్కర్ డిసైడ్ అయ్యాడు. నేను దాన్ని అమలుపరిచానంతే. నా పని నిర్ణయాలను అమల్లోకి తీసుకురావడమే. వాళ్లిద్దరి ప్లేస్‌లో సంజూ శాంసన్ లాంటి కొత్తవారిని టీమ్‌లోకి తీసుకున్నాం. రూల్ అందరికీ సమానమే. ఎవరూ తప్పించుకోలేరు’ అని షా స్పష్టం చేశాడు.
ఇషాన్-అయ్యర్ కాంట్రాక్ట్ రద్దుతో పాటు ఇతర అంశాల మీద కూడా జై షా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం త్వరలో ముగిసిపోతుందన్నాడు. అందుకే కొత్త హెడ్ కోచ్ నియామకానికి సంబంధించి త్వరలో ప్రకటన వెలువడనుందని తెలిపాడు. వచ్చే జూన్‌తో ద్రవిడ్ కాంట్రాక్ట్ ముగిసిపోతుందని, అతడు కావాలనుకుంటే ఆ పోస్టుకు తిరిగి అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నాడు షా. ఈసారి ఐపీఎల్లో చర్చనీయాంశంగా మారిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మీద కూడా ఆయన రియాక్ట్ అయ్యాడు. ఈ రూల్‌ను ప్రయోగాత్మకంగా లీగ్‌లో ప్రవేశపెట్టామని, ఇది పర్మినెంట్ కాదన్నాడు షా. మరి.. ఇషాన్, అయ్యర్ కాంట్రాక్ట్‌ల రద్దు విషయంపై షా చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Jay Shah said, “Ajit Agarkar decided to remove Ishan Kishan and Shreyas Iyer from the central contract. I am just a convener. My role is to implement. And we have got new players in place, like Sanju Samson. Nobody is indispensable”. pic.twitter.com/hsSYNqcXFz
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2024