iDreamPost
android-app
ios-app

టాప్ బ్యాటర్లకు బుమ్రా అంటే భయం.. కానీ అతడ్నే వణికించాడు! ఎవరో తెలుసా?

  • Published May 04, 2024 | 8:15 PM Updated Updated May 04, 2024 | 8:15 PM

జస్​ప్రీత్ బుమ్రా పేరు చెబితే టాప్ బ్యాటర్లు కూడా భయపడతారు. అతడి బౌలింగ్​లో పరుగులు చేయడం పక్కనబెడితే వికెట్ పోకుండా ఉంటే చాలని భావిస్తారు. అలాంటి పేసుగుర్రాన్ని అతడు వణికించాడు.

జస్​ప్రీత్ బుమ్రా పేరు చెబితే టాప్ బ్యాటర్లు కూడా భయపడతారు. అతడి బౌలింగ్​లో పరుగులు చేయడం పక్కనబెడితే వికెట్ పోకుండా ఉంటే చాలని భావిస్తారు. అలాంటి పేసుగుర్రాన్ని అతడు వణికించాడు.

  • Published May 04, 2024 | 8:15 PMUpdated May 04, 2024 | 8:15 PM
టాప్ బ్యాటర్లకు బుమ్రా అంటే భయం.. కానీ అతడ్నే వణికించాడు! ఎవరో తెలుసా?

జస్​ప్రీత్ బుమ్రా పేరు చెబితే టాప్ బ్యాటర్లు కూడా భయపడతారు. అతడి బౌలింగ్​లో పరుగులు చేయడం పక్కనబెడితే వికెట్ పోకుండా ఉంటే చాలని భావిస్తారు. గత కొన్నేళ్లలో తన బౌలింగ్​ను ఎంతో మెరుగుపర్చుకున్న బుమ్రా.. ఇప్పుడు వరల్డ్ క్రికెట్​లో నంబర్ వన్ బౌలర్​గా కొనసాగుతున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ అతడి హవా నడుస్తోంది. టీ20లు, వన్డేలు, టెస్టులు.. ఇలా ఫార్మాట్​కు తగ్గట్లు లెంగ్త్​లు మారుస్తూ, బాల్ వేగంలో మార్పులు, వేరియేషన్స్​తో బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు బుమ్రా. అతడి బౌలింగ్​లో ఎంతటి టాప్ బ్యాటర్​కైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అద్భుతమైన యార్కర్లు, రాకాసి బౌన్సర్లు, విచిత్రమైన స్లో డెలివరీస్​తో బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. కానీ అలాంటి పేసుగుర్రాన్ని ఒకడు వణికించాడు.

బ్యాటర్లకు సింహస్వప్నంగా మారిన బుమ్రాకు ఓ బ్యాటర్ అంటే మాత్రం భయం. అతడికి ఎలా బౌలింగ్ చేయాలో పేసుగుర్రానికి అర్థం కావడం లేదు. భీకరమైన వేగంతో కట్టుదిట్టమైన బంతులు వేసినా అలవోకగా పరుగులు చేసేస్తున్నాడు. బుమ్రాను అంతగా ఇబ్బంది పెడుతున్న ఆ బ్యాట్స్​మన్ మరెవరో కాదు.. టీమిండియా సీనియర్ ప్లేయర్ మనీష్ పాండే. స్టైలిష్ బ్యాటింగ్​తో అందర్నీ ఆకట్టుకునే మనీష్​.. బుమ్రా బౌలింగ్​ అంటే చాలు రెచ్చిపోతాడు. బాల్ మెరిట్​ను బట్టి అతడి బౌలింగ్​లో షాట్లు ఆడతాడు. ముందే షాట్లు కమిట్ అవ్వకుండా బాల్ లెంగ్త్​, వెళ్తున్న దిశ, స్వింగ్​, వేగం తదితరాలు గమనించి కరెక్ట్ టైమ్​లో పర్ఫెక్ట్​గా అంచనా వేసి షాట్లు కొడతాడు.

టీ20 క్రికెట్​లో బుమ్రా బౌలింగ్​లో ఇప్పటిదాకా 42 బంతుల్ని ఫేస్ చేసిన మనీష్ పాండే 80 పరుగులు చేశాడు. ఇందులో 10 బౌండరీలు సహా 2 సిక్సులు కూడా ఉన్నాయి. ముంబై ఇండియన్స్ ఏస్ పేసర్ బౌలింగ్​లో 190.5 స్ట్రైక్ రేట్​తో రన్స్ చేశాడు. ఒక్కసారి కూడా మనీష్​ను ఔట్ చేయలేకపోయాడు బుమ్రా. మనీష్ కెరీర్​లో చాలా పరుగులు చేశాడు. తోపు బౌలర్లను కూడా చితగ్గొట్టాడు. కానీ వరల్డ్ నంబర్ వన్ బౌలర్​గా కొనసాగుతున్న బుమ్రాపై సాధించినంత ఆధిపత్యం ఎవరి మీదా చూపించలేదు. అది కూడా బుమ్రా కెరీర్ ఇప్పుడు పీక్​లో ఉంది. ఈ సమయంలో అతడ్ని వీరబాదుడు బాదడం అంటే మాటలు కాదు. పాండ్యా కెరీర్​లో ఈ ఘనత ఎప్పటికీ గుర్తుండిపోతుందనే చెప్పాలి. మరి.. బుమ్రాను మనీష్ సులువుగా ఆడేయడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.