iDreamPost
android-app
ios-app

SRH సంచలన విజయం.. తిట్టిపోస్తున్న RCB ఫ్యాన్స్!

  • Published Mar 28, 2024 | 8:55 AM Updated Updated Mar 28, 2024 | 8:55 AM

RCB Fans On SRH Win: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రచించింది. మునుపెన్నడూ చూడని మ్యాచ్ ని చూపించింది. అయితే హైదరాబాద్ జట్టుపై ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

RCB Fans On SRH Win: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రచించింది. మునుపెన్నడూ చూడని మ్యాచ్ ని చూపించింది. అయితే హైదరాబాద్ జట్టుపై ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Published Mar 28, 2024 | 8:55 AMUpdated Mar 28, 2024 | 8:55 AM
SRH సంచలన విజయం.. తిట్టిపోస్తున్న RCB ఫ్యాన్స్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బుధవారం హైదరాబాద్ ప్లేయర్లు కొత్త చరిత్ర లిఖించారు. మళ్లీ ఇలాంటి ఒక మ్యాచ్ ని ఐపీఎల్ చూస్తామనే గ్యారెంటీ కూడా లేదు. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు.. ముంబయి ఆటగాళ్లు కూడా ఎంతో అద్భుతంగా రాణించారు. ఒక్క మ్యాచ్ లో రెండు టీమ్స్ కలిపి 523 పరుగులు చేశాయి. హైదరాబాద్ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది. కేవలం 20 ఓవర్లలో 277 పరుగులు చేశారు. ఇంకా ఎన్నో రికార్డులు ఈ మ్యాచ్ లో బద్దలు కొట్టారు. హైదరాబాద్ జట్టు ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. కానీ, ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ ని తిట్టిపోస్తున్నారు. సోషల్ మీడియాలో మొత్తం బెంగళూరు ఫ్యాన్స్ కామెంట్సే వైరల్ అవుతున్నాయి.

బుధవారం జరిగిన మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ నిలిచపోయేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వీర విహారం చూసి క్రికెట్ ప్రపంచమే నివ్వెరపోయింది. ఒక మ్యాచ్ లో ఇంతటి విధ్వంసాన్ని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు కొన్ని కొత్త రికార్డులు నెలకొల్పింది. ఎప్పటి నుంచో ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది. వారి ప్రదర్శనను క్రికెట్ ప్రపంచంలో ఉన్న ఎంతో మంది దిగ్గజాలు కొనియాడుతున్నారు. కానీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును తిట్టిపోస్తున్నారు. అసలు ఐపీఎల్ లో వారికి పట్టిన దరిద్రం ఈ జట్టు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే చాలామందికి అసలు ఏం జరిగింది అనే విషయం అర్థం కావడంలేదు. ముంబయి టీమ్ ని కొడితే.. ఆర్సీబీ ఫ్యాన్స్ ఏడవటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వాళ్లు వెళ్లగక్కుతున్న అక్కసుకు కారణం లేకపోలేదు.

ఐపీఎల్ అనగానే ఆర్సీబీ ఈ సాలా కప్ నమ్దే అంటూ వస్తుంది. వాళ్ల లైనప్ చూశాక అది నిజమే అనే భావన కలుగుతుంది. 16 ఎడిషన్స్ గా ఆర్సీబీకి కప్పు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. కానీ, ఐపీఎల్ లో ఎన్నో గొప్ప గొప్ప రికార్డులు మాత్రం వాళ్ల పేరిట ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రికార్డును బుధవారం హైదరాబాద్ జట్టు బద్దలు కొట్టింది. ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ ఏడవడానికి కారణం అదే. ఆర్సీబీ జట్టు 2013లో బెంగళూరు వేదికగా పంజాబ్ జట్టుపై ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత భారీ స్కోర్(263/5) నమోదు చేసింది. ఆ రికార్డును తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బద్దలు కొట్టింది.

ఉప్పల్ లో హైదరాబాద్ జట్టు ఏకంగా 277/3 పరుగులు నమోదు చేసింది. ఇంకేముంది ఆర్సీబీ జట్టు ఫ్యాన్స్ ఏడవడం స్టార్ట్ చేశారు. మాకు ట్రోఫీ లేకపోయినా.. ఒక గొప్ప రికార్డు మా పేరిట ఉంది అనుకున్నాం. కానీ, హైదరాబాద్ టీమ్ ఇలా చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా.. గతంలో హైదరాబాద్ జట్టు వల్ల వారికి జరిగిన నష్టాన్ని గుర్తుచేస్తున్నారు. 2009లో ఫైనల్ లో ఓటమి, 2016 ఫైనల్ లో ఓటమి గాయాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు వారి పేరటి ఉన్న రికార్డును కూడా బద్దలు కొట్టడంతో SRH టీమ్ మాకు పట్టిన దరిద్రం అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఆర్సీబీ ఫ్యాన్స్ చేస్తున్న వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by MOONLIGHTWRITINGS (@moonlight_writings.1)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet