iDreamPost
android-app
ios-app

IPL డెబ్యూ కోసం ఎదురుచూస్తున్న యంగ్ గన్స్.. ఛాన్స్ వచ్చిందా రచ్చ రచ్చే!

  • Published Apr 11, 2024 | 5:00 PM Updated Updated Apr 11, 2024 | 5:00 PM

ఐపీఎల్-2024 ఫస్ట్ ఫేజ్ ముగిసింది. అయినా కొందరు యంగ్​స్టర్స్​కు అవకాశాలు రాలేదు. వాళ్లకు గనుక బరిలోకి దిగే అవకాశం వచ్చిందా ఇక రచ్చ రచ్చే.

ఐపీఎల్-2024 ఫస్ట్ ఫేజ్ ముగిసింది. అయినా కొందరు యంగ్​స్టర్స్​కు అవకాశాలు రాలేదు. వాళ్లకు గనుక బరిలోకి దిగే అవకాశం వచ్చిందా ఇక రచ్చ రచ్చే.

  • Published Apr 11, 2024 | 5:00 PMUpdated Apr 11, 2024 | 5:00 PM
IPL డెబ్యూ కోసం ఎదురుచూస్తున్న యంగ్ గన్స్.. ఛాన్స్ వచ్చిందా రచ్చ రచ్చే!

ఐపీఎల్-2024 ఫస్ట్ ఫేజ్ సక్సెస్​ఫుల్​గా ముగిసింది. చాలా మ్యాచ్​లు లాస్ట్ బాల్ వరకు వెళ్లాయి. సూపర్ ఓవర్ జరగలేదు గానీ దానికి సరిపోయేంత థ్రిల్​ను మాత్రం మ్యాచ్​లు పంచుతున్నాయి. ప్లేఆఫ్స్​కు చేరాలంటే నెక్స్ట్ ఫేజ్​లో ఏ టీమ్ ఎలా ఆడుతుందనేది చాలా ముఖ్యం. అయితే ఒక దశ ముగిసినా ఇంకా ఆడే అవకాశం రాని యువ ఆటగాళ్లు కొందరు ఉన్నారు. వీళ్లకు ఛాన్స్ వచ్చిందా ఇక రచ్చ రచ్చే. అయితే వీళ్లలో కొందర్ని జట్లు కావాలనే ఆడించట్లేదు. సరైన సమయంలో దింపి ప్రత్యర్థి జట్లకు షాక్ ఇవ్వాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ డెబ్యూ కోసం ఎదురు చూస్తున్న ఆయా ఆటగాళ్లు ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం..

విల్ జాక్స్

ఆల్​రౌండర్లకు ఫ్యాక్టరీ లాంటి ఇంగ్లండ్​ నుంచి వచ్చిన మరో అరుదైన టాలెంట్ విల్ జాక్స్. మూడు ఫార్మాట్లలోనూ నేషనల్ టీమ్​కు ప్రాతినిధ్యం వహించిన అతడు.. డొమెస్టిక్, ఫ్రాంచైజీ క్రికెట్​లో తిరుగులేని రికార్డులను కలిగి ఉన్నాడు. ముఖ్యంగా టీ20లు అంటే చాలు జాక్స్​కు పూనకం వచ్చేస్తుంది. ఈ ఫార్మాట్​లో ఆడిన 157 మ్యాచుల్లో 30 యావరేజ్​తో 4 వేలకు పైగా రన్స్ చేశాడు. ఇందులో 3 సెంచరీలు కూడా ఉన్నాయి. క్వాలిటీ స్పిన్​తో అవసరమైన టైమ్​లో బ్రేక్ త్రూలు ఇచ్చే సత్తా అతడికి ఉంది. వేలంలో రూ.3.2 కోట్లకు ఈ యంగ్ ఆల్​రౌండర్​రు ఆర్సీబీ దక్కించుకుంది. వరుసగా ఫెయిలవుతున్న గ్రీన్, మాక్స్​వెల్​లో ఒకర్ని పక్కనబెట్టి జాక్స్​ను ఆడించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

షమర్ జోసెఫ్

ఆస్ట్రేలియా జట్టుకు చుక్కలు చూపించి ఓవర్​నైట్ స్టార్​డమ్ సంపాదించాడు షమర్ జోసెఫ్. సంచలన బౌలింగ్​తో ఆసీస్ బ్యాటర్లను కంగారెత్తించాడు. ఆస్ట్రేలియాను టెస్టుల్లో వాళ్ల సొంతగడ్డపై ఓడించడం చాలా కష్టం. కానీ విండీస్ ఇది సాధించింది. ఇందులో జోసెఫ్ పాత్ర ఎంతో ఉంది. గబ్బా టెస్ట్​లో మ్యాచ్ లాస్ట్ డే 7 వికెట్లతో వెస్టిండీస్​ను విజేతగా నిలిపాడు. ఐపీఎల్​లో లక్నో టీమ్​లో ఆడే ఛాన్స్ దక్కించుకున్నాడు జోసెఫ్. ఇప్పటికే ఆ జట్టులో మయాంక్ యాదవ్ నిఖార్సయిన పేస్​తో వణికిస్తున్నాడు. అతడికి జోసెఫ్ తోడైతే ఇక బ్యాటర్లకు కంటి మీద కునుకు ఉండదు. షమర్ ఎప్పుడు డెబ్యూ ఇస్తాడో చూడాలి.

గ్లెన్ ఫిలిప్స్

హార్డ్ హిట్టింగ్, స్పిన్ బౌలింగ్, మెరుపు ఫీల్డింగ్.. ఇవన్నీ కలిస్తే గ్లెన్ ఫిలిప్స్ అని చెప్పొచ్చు. మూడేళ్ల కిందే ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన ఈ కివీస్ ఆల్​రౌండర్ లీగ్​లో తన అసలైన ప్రతిభను చూపించలేదు. సన్​రైజర్స్​ హైదరాబాద్​తో ట్రావెల్ అవుతున్న ఫిలిప్స్ ఈ సీజన్​లో తొలి మ్యాచ్ ఎప్పుడు ఆడతానా అని ఎదురు చూస్తున్నాడు. ఎయిడెన్ మార్​క్రమ్ మోస్తరుగా రాణిస్తున్నాడు. ఒకవేళ అతడు ఫెయిలైతే ఫిలిప్స్ ఎంట్రీ ఇవ్వడం పక్కా.

జేక్ ఫ్రేజర్ మెక్​గర్క్

భారీ షాట్లతో విరుచుకుపడుతూ చూస్తుండగానే మ్యాచ్​ను తన వైపునకు తిప్పుకునే ప్లేయర్లలో జేక్ ఫ్రేజర్ ఒకడు. ఈ ఆసీస్ ఆల్​రౌండర్ బరిలోకి దిగింది మొదలు బౌలర్లను ఊచకోత కోయడం మొదలుపెడతాడు. అయితే అలాంటోడ్ని ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఇప్పటిదాకా ఆడించలేదు. గతేడాది ఇంపాక్ట్ ప్లేయర్​గా దింపింది. కానీ ఈ సీజన్​లో మాత్రం ఇంకా ఆడే ఛాన్స్ ఇవ్వలేదు. ఎప్పుడు గ్రౌండ్​లోకి దింపినా తన రోల్​కు న్యాయం చేస్తూ జట్టు కోసం ఫియర్​లెస్​ క్రికెట్ ఆడేందుకు మెక్​గర్క్ రెడీగా ఉన్నాడు. వీళ్లతో పాటు మరికొందరు యంగ్ గన్స్ మంచి అవకాశం దొరికితే తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి.. వీళ్లలో ఎవరి గేమ్ చూసేందుకు మీరు ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: గంభీర్​తో గొడవ సద్దుమణగడం వాళ్లకు నచ్చలేదు.. కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!