iDreamPost
android-app
ios-app

Virat Kohli: ఆ బౌలర్​ను చూసి భయపడ్డా.. కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Apr 27, 2024 | 3:43 PM Updated Updated Apr 27, 2024 | 3:43 PM

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు చెబితేనే మహా మహా బౌలర్లు కూడా పోసుకుంటారు. అలాంటిది కింగ్ ఓ బౌలర్​ను చూసి భయపడ్డాడట. మరి.. విరాట్​ను భయపెట్టినోడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు చెబితేనే మహా మహా బౌలర్లు కూడా పోసుకుంటారు. అలాంటిది కింగ్ ఓ బౌలర్​ను చూసి భయపడ్డాడట. మరి.. విరాట్​ను భయపెట్టినోడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Apr 27, 2024 | 3:43 PMUpdated Apr 27, 2024 | 3:43 PM
Virat Kohli: ఆ బౌలర్​ను చూసి భయపడ్డా.. కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు సక్సెస్ బాట పట్టింది. వరుసగా ఆరు ఓటముల తర్వాత అభిమానులకు ఊరటను ఇస్తూ సన్​రైజర్స్ హైదరాబాద్​పై విజయం సాధించింది. ఉప్పల్ వేదికగా గురువారం ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో డుప్లెసిస్ సేననే గెలుపు వరించింది. 35 పరుగుల తేడాతో నెగ్గిన ఆర్సీబీ.. ఇప్పుడు మంచి జోష్​లో ఉంది. ప్లేఆఫ్స్ ఆశలు ఎలాగూ లేవు. కానీ గ్రూప్ దశ ముగిసేసరికి టాప్ టీమ్స్ అందరికీ షాక్ ఇవ్వాలని బెంగళూరు గట్టిగా డిసైడ్ అయ్యింది. తమను దారుణంగా ఓడించిన జట్లను చిత్తు చేసి వారి ప్లేఆఫ్స్ అవకాశాలను దెబ్బ తీయాలని చూస్తోంది. ఆ టీమ్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్​ను కంటిన్యూ చేస్తూ ఫ్యాన్స్​ను మరింత ఎంటర్​టైన్ చేయాలని చూస్తున్నాడు.

ఎస్ఆర్​హెచ్​పై నెగ్గిన ఆర్సీబీ.. తదుపరి గుజరాత్ టైటాన్స్​తో మ్యాచ్​కు రెడీ అవుతోంది. తాజాగా ఆ టీమ్ అహ్మదాబాద్​కు చేరుకుంది. ఈ తరుణంలో కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ బౌలర్​ను చూసి భయం వేసిందన్నాడు. కోహ్లీ పేరు చెబితేనే మహా మహా బౌలర్లు కూడా పోసుకుంటారు. దశాబ్దంన్నరగా ఇంటర్నేషనల్ క్రికెట్​లోని తోపు బౌలర్లు అందర్నీ వణికిస్తూ వస్తున్నాడు విరాట్. పరుగుల వరద పారిస్తూ ప్రత్యర్థి జట్ల పాలిట సింహస్వప్నంలా మారాడు. అతడి బాదుడుకు కొందరు క్రికెటర్ల కెరీర్లే ఖతం అయ్యాయి. కోహ్లీకి బౌలింగ్ చేయాలంటేనే స్టార్లు కూడా భయపడతారు. ఎక్కడ తమ మీద విరుచుకుపడతాడోనని వణుకుతూనే బౌలింగ్​కు దిగుతారు. అలాంటిది కింగ్ ఓ బౌలర్​ను చూసి భయపడ్డాడట. మరి.. విరాట్​ను భయపెట్టినోడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

కెరీర్ మొదట్లో ఓ బౌలర్​ను చూసి భయపడ్డానని కోహ్లీ తెలిపాడు. అతడ్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక చిన్ననాటి కోచ్​ను కాంటాక్ట్ అయ్యానని అన్నాడు. ఆయన ఇచ్చిన సలహాతోనే ఆ బౌలర్​ను ఫేస్ చేశానని కోహ్లీ చెప్పాడు. తన కెరీర్ స్టార్టింగ్​ డేస్​లో శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ అజంతా మెండిస్ టాప్​ ఫామ్​లో ఉన్నాడని పేర్కొన్నాడు. ‘నా కెరీర్ మొదట్లో అజంతా మెండిస్ అంటే బిగ్ సెన్సేషన్​. ఆ సమయంలో అతడ్ని ఎదుర్కోలేక టాప్ బ్యాటర్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో నా చిన్ననాటి కోచ్​తో మాట్లాడా. ఆయన ఒకటే సలహా ఇచ్చారు. మెండిస్ చేతి మణికట్టును గమనించమని చెప్పారు. అలా మెండిస్ మణికట్టును చూస్తూ అతడి వేరియేషన్స్​ను అర్థం చేసుకున్నా. 2 ఓవర్లలోనే అతడి బౌలింగ్ కిటుకు అర్థమవడంతో కుమ్మేశా’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.