Nidhan
కోహ్లీ-గంభీర్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉందనేది తెలిసిందే. అయితే ఈ మధ్యే వీళ్లు కలసిపోయారు. దీనిపై విరాట్ రియాక్ట్ అయ్యాడు.
కోహ్లీ-గంభీర్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉందనేది తెలిసిందే. అయితే ఈ మధ్యే వీళ్లు కలసిపోయారు. దీనిపై విరాట్ రియాక్ట్ అయ్యాడు.
Nidhan
క్రికెట్ ఫీల్డ్‌లో ఫైట్స్ కామనే. మైదానంలో ఆడేందుకు దిగిన ఇరు జట్లలోని ఆటగాళ్లకు మధ్య ఏదో ఒక సందర్భంలో గొడవలు జరగడం సర్వసాధారణం. అయితే చాన్నాళ్ల పాటు ఒకే టీమ్‌కు ప్రాతినిధ్యం వహించిన వారు కూడా కొన్ని కారణాల వల్ల శత్రువులుగా మారడం చూస్తూనే ఉంటాం. ఇలాంటోళ్లు వేర్వేరు టీమ్స్‌కు ఆడుతూ తలపడితే ఫైట్ జరగడం పక్కా. అలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్‌లో గౌతం గంభీర్-విరాట్ కోహ్లీది ఒకటి. వీళ్లిద్దరూ టీమిండియాకు కలసే ఆడారు. డొమెస్టిక్ లెవల్లోనూ ఒకే జట్టు (ఢిల్లీ)కు ప్రాతినిధ్యం వహించారు. అయితే ఐపీఎల్లో వీళ్ల మధ్య ఫైట్ జరగడం తెలిసిందే. గతేడాది లక్నో సూపర్ జియాంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ముగిశాక కోహ్లీ-గౌతీ ఒకరి మీదకు ఒకరు దూసుకొస్తూ గొడవకు దిగారు. అప్పట్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. అయితే రీసెంట్గా వీళ్లిద్దరూ కలసిపోయారు.
ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీ, కేకేఆర్‌కు మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత కోహ్లీ-గంభీర్‌లు కలుసుకున్నారు. ఒకరికొకరు హగ్ చేసుకొని నవ్వుతూ కాసేపు ముచ్చటించారు. తమ మధ్య ఫైట్‌ను పక్కనపెట్టి సరదాగా మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య నవ్వులు, కౌగిలించుకోవడం చూసి వీళ్ల ఫ్యాన్స్ కూడా సంతోషించారు. తాజాగా ఈ విషయంపై విరాట్ రియాక్ట్ అయ్యాడు. గంభీర్, తాను కలసిపోవడం కొంతమందికి నచ్చలేదన్నాడు. గొడవకు స్వస్తి చెప్పి కలసిపోవడంతో చాలా మంది మసాలా మిస్సవుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు కింగ్. ‘కొందరు నా బిహేవియర్‌తో చాలా నిరాశకు లోనయ్యారు. నవీనుల్ హక్‌తో పాటు గంభీర్ భాయ్‌ను నేను హగ్ చేసుకున్నా. దీంతో తమకు కావాల్సిన మసాలా మిస్సయిందని వాళ్లు డిజప్పాయింట్ అయ్యారు’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
గత ఏడాది ఐపీఎల్లో తొలుత మ్యాంగోమ్యాన్ నవీన్‌తో గొడవకు దిగాడు విరాట్. దీంతో నవీన్ ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నో టీమ్‌కు మెంటార్‌గా ఉన్న గంభీర్ ఇందులో కలుగజేసుకున్నాడు. గౌతీ రాకతో విరాట్ ఇంకా సీరియస్ అయ్యాడు. కేఎల్ రాహుల్‌తో పాటు ఇతర ఆటగాళ్లు మధ్యలో వచ్చి విడిపించడంతో గొడవ ఆగిపోయింది. అయినా ఆ సీజన్ మొత్తం గంభీర్, నవీన్‌ను టార్గెట్ చేసుకొని కోహ్లీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ వచ్చారు. అయితే ఆ తర్వాత జరిగిన వన్డే వరల్డ్ కప్-2023లో మ్యాంగోమ్యాన్ను కింగ్ క్షమించాడు. అతడ్ని హగ్ చేసుకున్నాడు. తాజాగా కేకేఆర్‌తో మ్యాచ్ తర్వాత గంభీర్‌ను కౌగిలించుకొని ఈ వివాదానికి ఎండ్ కార్డ్ వేశాడు. అయితే కొందరు మాత్రం తమ గొడవ సద్దుమణిగినందుకు బాధపడుతున్నారని.. మసలా మిస్సయినందుకు నిరాశకు లోనవుతున్నారంటూ చురకలు అంటించాడు కింగ్. మరి.. గంభీర్ వివాదంపై కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli said, “people are disappointed because I hugged Naveen Ul Haq and then Gauti pa hugged me. ‘Masala’ got over for them (smiles)”. (Puma). pic.twitter.com/MVputfUm1N
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 11, 2024