Nidhan
ఈసారి ఐపీఎల్లో ఆట కంటే కూడా వివాదాలు ఎక్కువైపోయాయి. వీటిల్లో ఎక్కువ మటుకు అంపైరింగ్ తప్పిదాల వల్ల జరుగుతున్నవేనని చెప్పాలి.
ఈసారి ఐపీఎల్లో ఆట కంటే కూడా వివాదాలు ఎక్కువైపోయాయి. వీటిల్లో ఎక్కువ మటుకు అంపైరింగ్ తప్పిదాల వల్ల జరుగుతున్నవేనని చెప్పాలి.
Nidhan
ఈసారి ఐపీఎల్లో ఆట కంటే కూడా వివాదాలు ఎక్కువైపోయాయి. ప్రతి మూడ్నాలుగు మ్యాచులకు ఏదో ఓ కాంట్రవర్సీ అవుతోంది. ఒక్కోసారి ఆటగాళ్లు, మరికొన్ని సార్లు కోచ్‌లు కూడా గొడవకు దిగుతున్న సందర్భాలు చూస్తున్నాం. అయితే పైకి ఇవి ప్లేయర్లు, కోచ్‌లు చేస్తున్న ఫైట్లలా కనిపిస్తున్నా.. వీటికి కారణం అంపైర్లేనని చెప్పాలి. ఐపీఎల్-2024లో అంపైరింగ్ మిస్టేక్స్ భారీగా పెరిగాయి. ఈజీ ఔట్లను నాటౌట్ ఇవ్వడం, నాటౌట్ను ఔట్ ఇచ్చేయడం, రనౌట్ అయినా ఇవ్వకపోవడం.. ఇలా చెత్త నిర్ణయాలతో లీగ్ పరువు తీస్తున్నారు అంపైర్లు. ఒకటి, రెండు కాదు.. లెక్కకు మించి తప్పిదాలు చేస్తున్నారు.
క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్లో అంపైరింగ్ ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయి. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. లేటెస్ట్గా చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఔట్ బిగ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 46 బంతుల్లో 86 పరుగులు చేసిన సంజూ తన టీమ్‌ను గెలిపించాలనే పట్టుదలతో ఆడుతున్న టైమ్‌లో అంపైర్ నిర్ణయం వల్ల అతడు బలయ్యాడు. ముకేశ్ కుమార్ ఓవర్లో అతడు కొట్టిన షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో బౌండరీ లైన్ దగ్గర హోప్ క్యాచ్ అందుకున్నాడు. అయితే క్యాచ్ టైమ్‌లో ఫీల్డర్ బౌండరీ లైన్‌ను తొక్కినట్లు క్లియర్‌గా కనిపిస్తున్నా సంజూను ఔట్‌గా ప్రకటించారు. రాజస్థాన్ మ్యాచ్‌లో ఓడిపోవడానికి ఈ నిర్ణయమే ప్రధాన కారణంగా చెప్పొచ్చు.
ఇదే రాజస్థాన్ టీమ్‌కు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ రనౌట్ అయ్యాడు. సంజూ వేసిన త్రో వికెట్లను గిరాటేసింది. అప్పటికి హెడ్ బ్యాట్ క్రీజు లోపలే ఉన్నా గాల్లో ఉంది. అది నేలను తాకలేదు. అయినా అంపైర్ నాటౌట్ అని ప్రకటించారు. ఇక, ఈ ఐపీఎల్లో మోస్ట్ కాంట్రవర్షియల్ ఔట్‌గా విరాట్ కోహ్లీని చెప్పొచ్చు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో హర్షిత్ రాణా వేసిన బీమర్కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు కోహ్లీ. ఆ బంతిని క్రీజు దాటి ముందుకొచ్చి ఆడాడు విరాట్. బాల్ అతడి నడుము కంటే ఎత్తులో ఉంది. అయినా బాల్ డిప్ అవుతుందనే కారణంతో అతడ్ని ఔట్‌గా ప్రకటించారు. బీమర్ వేసినందుకు బౌలర్‌తో కనీసం సారీ కూడా చెప్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
కోహ్లీ ఔటైన అదే మ్యాచ్‌లో ఒక బౌండరీ విషయంలోనూ అంపైరింగ్ నిర్ణయం ఆర్సీబీకి శాపంగా మారింది. బాల్ సిక్స్‌కు వెళ్తే అంపైర్లు సరిగ్గా చూడకుండా బౌండరీ అని ప్రకటించారు. అలాగే ఇంకో బ్యాటర్ ఔట్ సమయంలో నరైన్ నో బాల్ వేశాడు. కానీ అంపైర్ దాన్ని కరెక్ట్ బాల్‌గా ప్రకటించారు. ఇక, కేకేఆర్ పేసర్ హర్షిత్ రాణా మీద ఓ మ్యాచ్ ఆడకుండా బ్యాన్ పడటం తెలిసిందే. టోర్నీ ఆరంభంలో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేశాక హర్షిత్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. మొన్న ఇంకో మ్యాచ్‌లోనూ ఇలాగే కిస్ ఇవ్వబోయి ఆగిపోయాడు. దీంతో అతడిపై చర్యలు తీసుకున్నారు. కానీ గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కోహ్లీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చినా అతడిపై ఏ యాక్షన్ తీసుకోలేదు. ఇలా లెక్కకు మించిన తప్పులు చేస్తున్న అంపైర్లు లీగ్ పరువు తీస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి.. ఐపీఎల్లో అంపైరింగ్ మిస్టేక్స్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
I saw the cushion move. It was not out and Sanju Samson misses out on a well deserved hundred. #RRvsDC #DCvsRR#SanjuSamson pic.twitter.com/f2lrWJ5TDl
— Nirmal Jyothi (@majornirmal) May 7, 2024
This is the lowest level of umpiring. Here Travis Head was clearly run out but the third umpire gave not out.#SRHvsRR #IPL2024 #BadUmpiring pic.twitter.com/jw8mBVUSTZ
— Shiv Rathi (@Rathi900Shiv) May 2, 2024