Nidhan
ఐపీఎల్-2024లో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. విధ్వంసక ఇన్నింగ్స్‌లతో భారీ స్కోర్లు బాదేస్తున్నారు. అయితే వీళ్లను కట్టడి చేయడంలో అందరూ చేతులెత్తేసినా.. ఇద్దరు బౌలర్లు మాత్రం సక్సెస్ అవుతున్నారు.
ఐపీఎల్-2024లో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. విధ్వంసక ఇన్నింగ్స్‌లతో భారీ స్కోర్లు బాదేస్తున్నారు. అయితే వీళ్లను కట్టడి చేయడంలో అందరూ చేతులెత్తేసినా.. ఇద్దరు బౌలర్లు మాత్రం సక్సెస్ అవుతున్నారు.
Nidhan
ఐపీఎల్-2024లో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. విధ్వంసక ఇన్నింగ్స్‌లతో భారీ స్కోర్లు బాదేస్తున్నారు. పవర్‌ప్లే, మిడిల్ ఓవర్స్, డెత్ ఓవర్స్ అనే తేడాల్లేకుండా క్రీజులోకి వచ్చిందే తడవు హిట్టింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఈసారి ఐపీఎల్లో టీ20 క్రికెట్‌కు కొత్త డెఫినిషన్ చెబుతున్నారు. గెలుపు, ఓటమిని డిసైడ్ చేసేది తక్కువ మార్జిన్ కావడంతో ఎంత కుదిరితే అంత భారీ స్కోరు బాదేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఎడిషన్‌లో గత 12 రోజుల గ్యాప్‌లో 200 ప్లస్ స్కోర్లు ఏకంగా 12 సార్లు నమోదయ్యాయి. దీన్ని బట్టే బ్యాటర్ల విధ్వంసం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్యాట్స్‌మెన్ ధాటిని తట్టుకోలేక మహామహా బౌలర్లు కూడా చేతులెత్తేస్తున్నారు. అయితే ఇద్దరు బౌలర్లు మాత్రం బ్యాటర్లను కట్టడి చేయడంలో సక్సెస్ అవుతున్నారు.
భారీ స్కోర్లకు చిరునామాగా మారిన ఐపీఎల్ పదిహేడో సీజన్లో బౌలర్లు బెంబేలెత్తుతున్నారు. బ్యాటర్లు చెలరేగుతుంటే తమాషా చూస్తున్నారు. యార్కర్, బౌన్సర్, స్లో డెలివరీస్, ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్ ఇలా పేసర్లు, స్పిన్నర్లు ఎలాంటి బంతులు వేసినా బ్యాట్స్‌మెన్ జోరుకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అయితే వాళ్ల స్పీడ్‌కు ఇద్దరు బౌలర్లు మాత్రం బ్రేకులు వేస్తున్నారు. ఆ ఇద్దరే పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా, వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్. బౌండరీలు, సిక్సులు ఇవ్వకుండా నియంత్రిస్తున్న వీళ్లిద్దరూ వికెట్లు కూడా తీస్తూ పర్పుల్ క్యాప్ రేస్‌లో ముందంజలో ఉన్నారు. బుమ్రా 13 వికెట్లతో ఈ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. చాహల్ కూడా అన్నే వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
బుమ్రా, చాహల్ ఎకానమీ కూడా అద్భుతంగా ఉంది. బుమ్రా ఓవర్‌కు 6 చొప్పున పరుగులు ఇస్తుండగా.. చాహల్ ఎకానమీ 8గా ఉంది. ఇద్దరూ పదునైన బంతులుతో బ్యాటర్లను కట్టిపడేస్తున్నారు. ఒకవైపు రన్స్ రాకపోవడం, మరోవైపు వికెట్లు కూడా పడుతుండటంతో వీళ్లను ఎలా ఎదుర్కోవాలో ప్రత్యర్థి బ్యాటర్లకు అర్థం కావడం లేదు. గత రెండు వారాలుగా ఐపీఎల్లో ఇంత భారీ స్కోర్లు నమోదవుతున్నా తమ ఎక్స్‌పీరియెన్స్‌తో సక్సెస్ అవుతున్నారు బుమ్రా, చాహల్. భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ లాంటి సీనియర్లు భారీగా పరుగులు ఇచ్చుకొని ఫెయిలైన చోట.. వీళ్లు విజయవంతం అవడం గమనార్హం. పర్పుల్ క్యాప్ రేసులో ఉన్న బుమ్రా, చాహల్ వికెట్లు తీయడంతో పాటు ఎనామీలోనూ తగ్గేదేలే అంటున్నారు. అందుకే ఈ సీజన్లో వీళ్లిద్దరూ తోపు బౌలర్లుగా కొనసాగుతున్నారు. మరి.. బుమ్రా, చాహల్ బౌలింగ్‌పై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
In last 12 days, 12 number of times 200+ scored, Only Jasprit Bumrah & Yuzi Chahal are exceptional with their economy👏
Career Destroyed:
Bhuvneshwar Kumar
Mohit Sharma
Kwena Maphaka
Akash Madhwal
List goes on and on…#DCvsGT #RCBvsSRH #DCvGTpic.twitter.com/RDXOdksLt3— Richard Kettleborough (@RichKettle07) April 25, 2024