IPL 2024 Playoffs Tomorrow Matches: 2 బెర్త్​ల కోసం 6 జట్ల పోటీ.. IPL 2024లో రేపు చాలా ముఖ్యమైన రోజు!

2 బెర్త్​ల కోసం 6 జట్ల పోటీ.. IPL 2024లో రేపు చాలా ముఖ్యమైన రోజు!

ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్​కు సమయం దగ్గర పడుతోంది. ప్లేఆఫ్స్​ రేసులో ఉన్న జట్లకు రేపు చాలా ముఖ్యమైన రోజు. రేపటి మ్యాచుల్ని ఆడియెన్స్​ అస్సలు మిస్సవ్వొద్దు.

ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్​కు సమయం దగ్గర పడుతోంది. ప్లేఆఫ్స్​ రేసులో ఉన్న జట్లకు రేపు చాలా ముఖ్యమైన రోజు. రేపటి మ్యాచుల్ని ఆడియెన్స్​ అస్సలు మిస్సవ్వొద్దు.

గత కొన్ని వారాలుగా క్రికెట్ ఆడియెన్స్​కు మస్తు ఎంటర్​టైన్​మెంట్​ను అందిస్తోంది ఐపీఎల్-2024. భారీ స్కోర్లు, అద్భుత సెంచరీలు, సంచలన బౌలింగ్ ప్రదర్శనలు, మెరుపు ఫీల్డింగ్ విన్యాసాలతో ఫ్యాన్స్ మనసులు దోచారు ప్లేయర్లు. ఫస్టాఫ్​ కంటే సెకండాఫ్ మ్యాచ్​లు మరింత ఆసక్తికరంగా సాగుతూ లీగ్​పై ఇంట్రెస్ట్​ను ఇంకా పెంచేశాయి. క్యాష్​ రిచ్ లీగ్​లో ప్లేఆఫ్స్​కు సమయం దగ్గర పడుతోంది. ప్లేఆఫ్స్​ రేసులో ఉన్న జట్లకు రేపు చాలా ముఖ్యమైన రోజు. రేపటి మ్యాచుల్ని ఆడియెన్స్​ అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ నేపథ్యంలో రేపు ఏయే టీమ్స్ తలపడబోతున్నాయి? ఈ మ్యాచులతో ప్లేఆఫ్స్​పై ఎలా క్లారిటీ రానుందో ఇప్పుడు తెలుసుకుందాం..

పాయింట్స్ టేబుల్​లో టాప్​లో ఉన్న కోల్​కతా నైట్ రైడర్స్, రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్​కు క్వాలిఫై అయ్యాయి. పాయింట్స్ టేబుల్​లో దిగువన ఉన్న పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించాయి. ఇక, మిగిలిన రెండు పొజిషన్ల కోసం ఏకంగా 6 జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సన్​రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జియాంట్స్, ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్​ ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకోవాలని భావిస్తున్నాయి. వీటిల్లో సీఎస్​కే, ఆర్సీబీ, డీసీలు రేపు మ్యాచ్‌ ఆడనున్నాయి. రాజస్థాన్​తో చెన్నై తలపడనుండగా.. ఆర్సీబీ-డీసీ చావోరేవో తేల్చుకోనున్నాయి.

ప్లేఆఫ్స్ చేరాలంటే చెన్నై, ఢిల్లీ, ఆర్సీబీ రేపటి మ్యాచ్​లో తప్పనిసరిగా నెగ్గాలి. ఏ టీమ్ ఓడిపోతే అది ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో రేపటి రెండు మ్యాచులతో ఈ మూడు జట్ల భవితవ్యం ఏంటో తేలిపోతుంది. సన్​రైజర్స్, గుజరాత్, లక్నో ప్లేఆఫ్స్ అవకాశాల మీద కూడా రేపటి మ్యాచ్​ల రిజల్ట్​ ప్రభావం చూపనుంది. సీఎస్​కే, డీసీ, ఆర్సీబీలు ఇప్పటిదాకా చెరో 12 మ్యాచ్​లు ఆడాయి. రేపటి మ్యాచుల్లో గెలిచే జట్టు ప్లేఆఫ్స్ ఛాన్సులు పెరుగుతాయి. రేపు నెగ్గి, ఆఖరి మ్యాచ్​లోనూ నెగ్గితే ప్లేఆఫ్స్ బెర్త్ దాదాపుగా ఖాయమైనట్లే. అందుకే ఈ సీజన్ ఐపీఎల్​లో ఈ సండే మోస్ట్ ఇంపార్టెంట్ డే కానుంది. మరి.. రేపటి మ్యాచ్​లు చూసేందుకు మీరెంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments