Nidhan
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో మెరిశాడు. అయితే ఫిఫ్టీ మార్క్‌ను చేరుకున్నాక అతడు సెలబ్రేట్ చేసుకోలేదు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో మెరిశాడు. అయితే ఫిఫ్టీ మార్క్‌ను చేరుకున్నాక అతడు సెలబ్రేట్ చేసుకోలేదు.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024కు ముందు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫుల్ స్వింగ్‌లోకి వచ్చేశాడు. ఐపీఎల్లో అతడి బ్యాట్ మ్యాచ్ మ్యాచ్‌కు మరింతగా పదునెక్కుతోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సీబీ వరుస ఓటముల పాలై ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినా కింగ్ మాత్రం ఇంకా గివప్ ఇవ్వడం లేదు. బెంగళూరు గెలుపు కోసం ప్రతి మ్యాచ్‌లో తనకు సాధ్యమైనంతగా కృషి చేస్తున్నాడు. హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో మరో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీతో తన బ్యాటర్ పవర్ ఏంటో ఇంకోసారి చూపించాడు.
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో 43 బంతుల్లో 51 పరుగులు చేశాడు కోహ్లీ. ఇందులో 4 బౌండరీలతో పాటు 1 సిక్స్ ఉంది. ఆరంభంలో దూకుడుగా ఆడాడు కింగ్. కానీ ఆ తర్వాత వరుసగా వికెట్లు పడటంతో నెమ్మదించాడు. ఎట్టకేలకు హాఫ్ సెంచరీ బాది టీమ్ భారీ స్కోరులో కీలకపాత్ర పోషించాడు. అయితే అర్ధ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాక అతడు సెలబ్రేషన్స్ చేసుకోలేదు. దీంతో ఎందుకిలా చేశాడంటూ అందరూ చర్చించుకుంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మంచి ఊపులో ఉన్నాడు.. కాబట్టి ఇంకో సెంచరీ కొడతాననే కాన్ఫిడెన్స్‌తోనే విరాట్ సెలబ్రేషన్ చేసుకోలేదని కొందరు నెటిజన్స్ అంటున్నారు. శతకం మార్క్‌కు చేరాక సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నాడని చెబుతున్నారు. మరికొందరేమో ఆర్సీబీ వరుస ఓటముల్లో ఉంది కాబట్టి గెలిస్తే కానీ సెలబ్రేట్ చేసుకోకూడదనే ఉద్దేశంతోనే కోహ్లీ సైలెంట్‌గా క్రీజులోనే ఉండిపోయాడని చెబుతున్నారు. ఇంకొందరేమో ఫిఫ్టీలు, హండ్రెడ్‌లు అతడికి కామన్ అయిపోయాయని.. అందుకే లైట్ తీసుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. అయితే అసలు కారణం ఏంటనేది స్వయంగా కోహ్లీ చెబితే గానీ తెలియదు. మరి.. విరాట్ సెలబ్రేట్ చేసుకోకపోవడం వెనుక ఎగ్జాక్ట్ రీజన్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
No fifty celebrations from Virat Kohli.
– He’s eyeing something bigger. 💯 pic.twitter.com/4z969t6YIX
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 25, 2024