Nidhan
రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కింగ్ అరుదైన ఘనత సాధించాడు.
రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కింగ్ అరుదైన ఘనత సాధించాడు.
Nidhan
రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కింగ్ అరుదైన అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్‌కు దిగిన స్టార్ బ్యాటర్.. వచ్చిన బాల్‌ను వచ్చినట్లు బౌండరీ లైన్‌కు తరలిస్తున్నాడు. 21 బంతుల్లో 34 పరుగులతో మంచి దూకుడు మీద ఉన్నాడు. 4 ఫోర్లు కొట్టిన కింగ్.. 1 భారీ సిక్స్ బాదాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు.
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో కొట్టిన నాలుగు బౌండరీలతో ఈ సీజన్లో కోహ్లీ కొట్టిన ఫోర్ల సంఖ్య 40కు చేరింది. తద్వారా ఒక ఐపీఎల్ ఎడిషన్‌లో అత్యధిక బౌండరీలు బాదిన ప్లేయర్‌గా విరాట్ రికార్డు సృష్టించాడు. అలాగే మరో రికార్డును కూడా తన పేరు మీద రాసుకున్నాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో 400 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో 400కి పైగా స్కోర్లను 10 సార్లు బాదిన తొలి ప్లేయర్‌గా కింగ్ నిలిచాడు. ఇక, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ ప్రస్తుతం 7 ఓవర్లకు 65 పరుగులతో ఉంది. ఒకవైపు కింగ్ నిలకడగా ఆడుతున్నా మరోవైపు అతడికి అండగా నిలిచేవారు కరువయ్యారు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (25) మంచి స్టార్ట్ వచ్చినా దాన్ని క్యాష్ చేసుకోలేకపోయాడు. పించ్ హిట్టర్ విల్ జాక్స్ (6) త్వరగా పెవిలియన్‌కు చేరుకున్నాడు.
VIRAT KOHLI BECOMES THE 1ST PLAYER IN IPL HISTORY TO SCORE 400 RUNS IN A SEASON 10 TIMES. 🤯🐐 pic.twitter.com/I8XJ2DI4oR
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 25, 2024