iDreamPost

SRH ఓపెనర్ అభిషేక్ నెవర్ బిఫోర్ ఫీట్.. IPL చరిత్రలో తొలి భారత ఆటగాడిగా..!

  • Published May 20, 2024 | 8:34 AMUpdated May 20, 2024 | 8:34 AM

సన్​రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి బ్యాట్​తో రెచ్చిపోయాడు. విధ్వంసక ఇన్నింగ్స్​తో పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అలాగే ఓ నెవర్ బిఫోర్​ ఫీట్​ను అందుకున్నాడు.

సన్​రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి బ్యాట్​తో రెచ్చిపోయాడు. విధ్వంసక ఇన్నింగ్స్​తో పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అలాగే ఓ నెవర్ బిఫోర్​ ఫీట్​ను అందుకున్నాడు.

  • Published May 20, 2024 | 8:34 AMUpdated May 20, 2024 | 8:34 AM
SRH ఓపెనర్ అభిషేక్ నెవర్ బిఫోర్ ఫీట్.. IPL చరిత్రలో తొలి భారత ఆటగాడిగా..!

టాప్​-2లో నిలవాలంటే నెగ్గి తీరాల్సిన మ్యాచ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ జూలు విదిల్చి ఆడింది. అదే దూకుడు, దంచికొట్టుడును కంటిన్యూ చేస్తూ పంజాబ్ కింగ్స్​ను ఓ రేంజ్​లో పోయింది. ఈ రెండు జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో నిన్న జరిగిన మ్యాచ్​లో కమిన్స్ సేన 4 వికెట్ల తేడాతో నెగ్గింది. పంజాబ్ విసిరిన 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంకో 5 బంతులు ఉండగానే ఛేజ్ చేసేసింది. తొలి బంతికే ప్రమాదకర ట్రావిస్ హెడ్ గోల్డెన్ డక్​గా వెనుదిరిగాడు. అయినా ఇంకో ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 28 బంతుల్లో 5 ఫోర్లు, 6 భారీ సిక్సుల సాయంతో 66 పరుగులు చేశాడు. 235 స్ట్రైక్ రేట్​తో ఆడాడంటేనే అతడి ఊచకోత ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్​తో అభిషేక్ అరుదైన ఫీట్​ను అందుకున్నాడు.

ఎస్ఆర్​హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఏ భారత బ్యాటర్​కూ సాధ్యం కానిది అతడు చేసి చూపించాడు. పంజాబ్ కింగ్స్​తో మ్యాచ్​లో 6 సిక్సులు కొట్టాడతను. తద్వారా ఈ సీజన్​లో 40 సిక్సుల్ని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్​లో 40 సిక్సులు కొట్టిన ఫస్ట్ ఇండియన్ ప్లేయర్​గా అభిషేక్ రికార్డ్ క్రియేట్ చేశాడు. నీళ్లు తాగినంత ఈజీగా సిక్సులు కొట్టే రోహిత్ శర్మ, ఎలాంటి కఠినమైన బంతినైనా స్టాండ్స్​లోకి తరలించే సామర్థ్యం ఉన్న విరాట్ కోహ్లీ లాంటి తోపు ఆటగాళ్లు కూడా ఒక సీజన్​లో నలభై సిక్సులు కొట్టిన దాఖలాలు లేవు. దీంతో అందరూ అభిషేక్​ను మెచ్చుకుంటున్నారు.

SRH opener Abhishek never before feat

అభిషేక్ అదరగొట్టాడని, భారత జట్టులోకి త్వరలో అతడు ఎంట్రీ ఇవ్వడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఇలాంటోడు టీమిండియాలో వస్తే మనకు ఎదురుండదని చెబుతున్నారు. ఇంతగా ఊచకోత కోసే యంగ్ బ్యాటర్​ను ఈ మధ్య కాలంలో చూడలేదని, ఇతడు నిజంగానే యువరాజ్ సింగ్ వారసుడని మెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఒకవైపు పంజాబ్​పై గెలవడం, మరోవైపు రాజస్థాన్-కోల్​కతా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో టాప్​-2లోకి ఎంట్రీ ఇచ్చింది ఆరెంజ్ ఆర్మీ. పాయింట్ల పరంగా రాజస్థాన్​తో సమానంగా నిలిచినా.. నెట్ రన్​ రేట్ విషయంలో మెరుగ్గా ఉండటంతో క్వాలిఫయర్-1లో ఆడే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది ఎస్​ఆర్​హెచ్​. ఫైనల్​లో చోటు కోసం కేకేఆర్​ను ఢీకొట్టనుంది కమిన్స్ సేన. మరి.. అభిషేక్ అరుదైన రికార్డుపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by JioCinema (@officialjiocinema)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి