iDreamPost

KKRను భయపెడుతున్న నరైన్.. SRH ఫ్యాన్స్​కు కిక్కిచ్చే సెంటిమెంట్!

  • Published May 21, 2024 | 3:54 PMUpdated May 21, 2024 | 3:54 PM

ఐపీఎల్-2024లో టాప్-2లో నిలిచిన కేకేఆర్, ఎస్​ఆర్​హెచ్​ కీలక పోరుకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా ఇవాళ సాయంత్రం క్వాలిఫయర్-1 పోరు జరగనుంది.

ఐపీఎల్-2024లో టాప్-2లో నిలిచిన కేకేఆర్, ఎస్​ఆర్​హెచ్​ కీలక పోరుకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా ఇవాళ సాయంత్రం క్వాలిఫయర్-1 పోరు జరగనుంది.

  • Published May 21, 2024 | 3:54 PMUpdated May 21, 2024 | 3:54 PM
KKRను భయపెడుతున్న నరైన్.. SRH ఫ్యాన్స్​కు కిక్కిచ్చే సెంటిమెంట్!

సీజన్ మొత్తం హవాను నడిపించాయా రెండు జట్లు. ఎదురొచ్చిన ప్రతి టీమ్​ను చిత్తు చేసుకుంటూ పోయాయి. భయం లేకుండా ఆడుతూ ప్రత్యర్థులను వణికించాయి. వాళ్లతో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థి జట్లు భయపడే స్థితికి తీసుకొచ్చాయి. గ్రూప్ స్టేజ్ ముగిసేసరికి టాప్​-2లో నిలిచాయి. అవే కోల్​కతా నైట్ రైడర్స్, సన్​రైజర్స్ హైదరాబాద్. ఈ రెండు టీమ్స్ ఐపీఎల్-2024లో దుమ్మురేపాయి. అదిరిపోయే ఆటతీరుతో ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చాయి. గ్రూప్ దశ ముగిసేసరికి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ఎస్​ఆర్​హెచ్, కేకేఆర్​ కీలకమైన పోరుకు సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్ల మధ్య ఇవాళ అహ్మదాబాద్​లోని నరేంద్ర మోడీ స్టేడియంలో క్వాలిఫయర్-1 జరగనుంది. ఇందులో నెగ్గిన టీమ్ ఫైనల్స్​కు క్వాలిఫై అవుతుంది.

ఇవాళ జరిగే క్వాలిఫయర్-1 ఓడిన జట్టు.. క్వాలిఫయర్-2లో ఎలిమినేటర్​లో గెలిచిన టీమ్​తో తలపడుతుంది. ఈ నేపథ్యంలో కేకేఆర్-ఎస్​ఆర్​హెచ్ తమ బలాబలాలను సమీక్షించుకుంటున్నాయి. గెలవడానికి అవసరమైన వ్యూహాలు పన్నుతున్నాయి. ఆయా జట్ల అభిమానులు కూడా ఈ మ్యాచ్​ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొందరు సెంటిమెంట్లను నమ్ముకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ సెంటిమెంట్ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్​కు కిక్ ఇస్తోంది. అయితే ఈ సెంటిమెంట్​ను చూసి కోల్​కతా టీమ్ భయపడుతోంది. క్వాలిఫయర్ 1 మ్యాచ్​కు ఆతిథ్యం ఇస్తున్న అహ్మదాబాద్ స్టేడియంలో కేకేఆర్ పించ్ హిట్టర్ సునీల్ నరైన్​కు మంచి రికార్డు లేదు. ఆ గ్రౌండ్​లో ఇప్పటిదాకా ఒక్క పరుగు కూడా చేయలేదతను. ఆడిన మూడు మ్యాచుల్లోనూ డకౌట్ అయ్యాడు.

అహ్మదాబాద్ గ్రౌండ్​లో ఐపీఎల్-2021లో తొలిసారి ఆడాడు నరైన్. పంజాబ్ కింగ్స్​తో జరిగిన ఆ మ్యాచ్​లో 4 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే పెవిలియన్​కు చేరాడు. అదే ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్​తో అదే మైదానంలో ఆడిన తొలి బంతికే ఔట్ అయ్యాడు. ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్​తో మరోమారు అదే వేదికలో ఆడిన నరైన్.. గోల్డెన్ డకౌట్ అయి క్రీజును వీడాడు. ఇప్పటిదాకా ఐపీఎల్​లో అహ్మదాబాద్ గ్రౌండ్​లో ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు నరైన్. ఇదే విషయం కోల్​కతా మేనేజ్​మెంట్​ను భయపెడుతోంది. ఇవాళ ఎస్​ఆర్​హెచ్ మీద కూడా ఇలాగే ఆడితే తమ పని ఫినిష్ అని వణుకుతోంది. ఈ సెంటిమెంట్​ గురించి తెలిసిన సన్​రైజర్స్ ఫ్యాన్స్.. ఇది మళ్లీ రిపీట్ అవ్వాలని కోరుకుంటున్నారు. కాగా, ఈ ఐపీఎల్​లో 461 పరుగులు చేసిన ఈ కరీబియన్ స్టార్.. బాల్​తోనూ రాణించి 15 వికెట్లు తీశాడు. మరి.. నరైన్ ఈ మ్యాచ్​లో ఫెయిల్ అవుతాడా? అదరగొడతాడా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sportskeeda Cricket (@sportskeedacricket)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి