Nidhan
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చరిత్ర సృష్టించింది. క్రికెట్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ ఈ ఫీట్‌ను నమోదు చేసిన టీమ్‌గా ఆరెంజ్ ఆర్మీ నిలిచింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చరిత్ర సృష్టించింది. క్రికెట్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ ఈ ఫీట్‌ను నమోదు చేసిన టీమ్‌గా ఆరెంజ్ ఆర్మీ నిలిచింది.
Nidhan
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టీ20 క్రికెట్లో హిస్టరీ క్రియేట్ చేసింది. పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు నమోదు చేసిన టీమ్‌గా ఆరెంజ్ ఆర్మీ నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 6 ఓవర్లలో ఏకంగా 125 పరుగులు చేసింది ఎస్ఆర్హెచ్. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (89), అభిషేక్ శర్మ (46) వల్లే ఈ ఘనత సాధ్యమైంది. వాళ్లిద్దరూ తొలి వికెట్‌కు 131 పరుగులు జోడించారు. వీళ్లిద్దరూ తాండవం చేయడంతో డీసీ బౌలర్లు గుడ్లు తేలేశారు. కాగా, గతంలో పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు రికార్డు కేకేఆర్ పేరు మీద ఉండేది. 2017లో ఆ జట్టు ఆర్సీబీపై 105 రన్స్ చేసింది. ఇప్పుడు సన్‌రైజర్స్ ఆ రికార్డును బ్రేక్ చేసింది.
ఇక, విధ్వంసక వీరులు హెడ్, అభిషేక్ ఔటైన తర్వాత ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ కుదుపునకు లోనైంది. ఎయిడెన్ మార్క్రమ్ (1) అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు. హెన్రిచ్ క్లాసెన్ (15)ను అక్షర్ పటేల్ వెనక్కి పంపాడు. దీంతో ఆరెంజ్ ఆర్మీ స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయి. అయితే నితీష్ కుమార్ రెడ్డి (9 నాటౌట్), షాబాజ్ అహ్మద్ (11 నాటౌట్) ఇంకా క్రీజులోనే ఉన్నారు. వీళ్లిద్దరూ ఆఖరి వరకు ఆడితే టీమ్ స్కోరు ఈజీగా 250 దాటుతుంది. మరి.. ఎస్ఆర్హెచ్ చరిత్ర సృష్టించడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
SRH HAVE REGISTERED THE HIGHEST POWERPLAY SCORE IN IPL HISTORY. 🤯💥 pic.twitter.com/ALdzzUDKWX
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 20, 2024