iDreamPost
android-app
ios-app

CSKను ఊచకోత కోసిన అభిషేక్.. అయినా శిష్యుడిపై యువరాజ్ సీరియస్!

  • Published Apr 06, 2024 | 3:47 PM Updated Updated Apr 06, 2024 | 3:47 PM

సన్​రైజర్స్ యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్​ బౌలర్లను ఊచకోత కోశాడు. బౌండరీలు, సిక్సులు కొట్టడమే టార్గెట్​గా అతడి బ్యాటింగ్ సాగింది. అయినా శిష్యుడిపై లెజెండ్ యువరాజ్ సీరియస్ అయ్యాడు.

సన్​రైజర్స్ యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్​ బౌలర్లను ఊచకోత కోశాడు. బౌండరీలు, సిక్సులు కొట్టడమే టార్గెట్​గా అతడి బ్యాటింగ్ సాగింది. అయినా శిష్యుడిపై లెజెండ్ యువరాజ్ సీరియస్ అయ్యాడు.

  • Published Apr 06, 2024 | 3:47 PMUpdated Apr 06, 2024 | 3:47 PM
CSKను ఊచకోత కోసిన అభిషేక్.. అయినా శిష్యుడిపై యువరాజ్ సీరియస్!

గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్​లో దారుణ ప్రదర్శనతో నిరాశపరుస్తూ వస్తోంది సన్​రైజర్స్ హైదరాబాద్. బౌలింగ్ బాగానే ఉన్నా బ్యాటింగ్ పరంగా టీమ్​ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అందుబాటులోని వనరులను సరిగ్గా వినియోగించుకుంటూ టీమ్​ను నడిపించే కెప్టెన్ కూడా లేడు. దీంతో జట్టు ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారింది. కానీ ఈ సీజన్​లో అంతా మారిపోయింది. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. కోచ్ వెట్టోరీతో కలసి టీమ్ కాంబినేషన్​ను సెట్ చేశాడు కమిన్స్. అలాగే యంగ్​స్టర్స్​కు వరుస అవకాశాలు ఇస్తూ అండగా నిలుస్తున్నాడు. దీంతో ఎస్ఆర్​హెచ్ గేమ్ కంప్లీట్ ఛేంజ్ అయింది. వీక్​నెస్ అనుకున్న బ్యాటింగే ఇప్పుడు బిగ్ స్ట్రెంగ్​గా మారింది. అభిషేక్ శర్మ లాంటి యువ బ్యాటర్లు ఆడుతున్న తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు.

ముంబై ఇండియన్స్​తో మ్యాచ్​లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదాడు అభిషేక్. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్​ను చేరుకున్నాడు. ఆ మ్యాచ్​లో మొత్తంగా 23 బంతుల్లో 63 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్​తో మ్యాచ్​లోనూ తన బ్యాట్ పవర్ చూపించాడు అభిషేక్. 12 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 37 పరుగులు చేశాడు. ముకేశ్ చౌదరి ఓవర్​లో ఏకంగా 27 రన్స్ చేశాడీ యంగ్ ఓపెనర్. సీఎస్​కే బౌలర్లను ఊచకోత కోసిన అభిషేక్.. వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీకి, స్టాండ్స్​లోకి పంపించాడు. అతడి బ్యాటింగ్​తో సాధించాల్సిన రన్​ రేట్ 8 పరుగుల నుంచి 6కు పడిపోయింది. 4 వికెట్లు పడినా ఎస్ఆర్​హెచ్​ అంత కూల్​గా టార్గెట్​ను అందుకుందంటే అది అభిషేక్ చలవే. అయితే అంత బాగా ఆడినా అతడిపై సీరియస్ అయ్యాడు లెజెండ్ యువరాజ్ సింగ్. అభిషేక్ ఔట్ అయిన తీరుపై యువీ ఫైర్ అయ్యాడు.

అభిషేక్ బ్యాటింగ్ మీద సోషల్ మీడియా ప్లాట్​ఫామ్ ఎక్స్​లో ఓ పోస్ట్ పెట్టాడు యువరాజ్. తానెప్పుడూ అతడి వెంటే ఉంటానని అన్నాడు. అభిషేక్ చాలా బాగా ఆడాడని మెచ్చుకున్నాడు. అయితే ఔట్ అయిన తీరు మాత్రం బాలేదన్నాడు. ఇంకోసారి చెత్త షాట్ కొట్టి వికెట్ పారేసుకున్నాడని మండిపడ్డాడు. అభిషేక్​కు యువీ గురువు అనే విషయం తెలిసిందే. చాన్నాళ్ల పాటు ఈ లెజెండ్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడతను. అందుకే అభిషేక్ బ్యాటింగ్ పై ఎప్పటికప్పుడు విశ్లేషణలు చేస్తూ యువీ పోస్టులు పెడుతున్నాడు. ముంబైతో ఇన్నింగ్స్ మీదా రియాక్ట్ అయ్యాడు. సూపర్బ్​గా ఆడాడని.. కానీ ఇలా ఔట్ అవ్వడం ఏంటంటూ సీరియస్ అయ్యాడు. చెప్పు దెబ్బలు తప్పవని కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశాడు. మరి.. అభిషేక్ బ్యాటింగ్ చేస్తున్న తీరు మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పాక్ క్రికెటర్లకు ఆర్మీ ట్రైనింగ్! రోహిత్ సేన టార్గెట్‌గా కఠిన సాధన!