iDreamPost
android-app
ios-app

Sanju Samson: నేను తప్పు ఒప్పుకుంటున్నా.. అలా జరగాల్సింది కాదు: సంజూ శాంసన్

  • Published May 16, 2024 | 7:59 PMUpdated May 16, 2024 | 7:59 PM

ఐపీఎల్-2024 ఫస్టాఫ్​లో దుమ్మురేపింది రాజస్థాన్ రాయల్స్. వరుస విజయాలతో ప్లేఆఫ్స్ బెర్త్​ను కన్ఫర్మ్ చేసుకుంది. అయితే అనూహ్యంగా బ్యాక్ టు బ్యాక్ మ్యాచుల్లో ఓటమిని రుచి చూసింది సంజూ సేన.

ఐపీఎల్-2024 ఫస్టాఫ్​లో దుమ్మురేపింది రాజస్థాన్ రాయల్స్. వరుస విజయాలతో ప్లేఆఫ్స్ బెర్త్​ను కన్ఫర్మ్ చేసుకుంది. అయితే అనూహ్యంగా బ్యాక్ టు బ్యాక్ మ్యాచుల్లో ఓటమిని రుచి చూసింది సంజూ సేన.

  • Published May 16, 2024 | 7:59 PMUpdated May 16, 2024 | 7:59 PM
Sanju Samson: నేను తప్పు ఒప్పుకుంటున్నా.. అలా జరగాల్సింది కాదు: సంజూ శాంసన్

ఐపీఎల్-2024 ఫస్టాఫ్​లో దుమ్మురేపింది రాజస్థాన్ రాయల్స్. వరుస విజయాలతో ప్లేఆఫ్స్ బెర్త్​ను కన్ఫర్మ్ చేసుకుంది. అయితే అనూహ్యంగా ప్లేఆఫ్స్​కు ముందు బ్యాక్ టు బ్యాక్ మ్యాచుల్లో ఓటమిని రుచి చూసింది సంజూ సేన. గత నాలుగు మ్యాచుల్లోనూ ఆ టీమ్​ను పరాజయాలు పలకరించాయి. సన్​రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మీద ఓడిన రాజస్థాన్.. నిన్న పంజాబ్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. గత రెండు మ్యాచుల్లోనూ ఆ టీమ్ బ్యాటింగ్​లో దారుణంగా ఫెయిలైంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి కనీసం 150 స్కోర్లు కూడా కొట్టలేకపోయింది. మిడిలార్డర్ ఫెయిల్యూర్ ఆ టీమ్​ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

వరుస మ్యాచుల్లో ఓడిపోవడం బాధగా ఉందన్నాడు సంజూ. అందుకే తన ఫెయిల్యూర్​, తప్పుల్ని ఒప్పుకుంటున్నానని అన్నాడు. అలా జరగాల్సింది కాదన్నాడు. మరింత బాగా ఆడాల్సిందని, కచ్చితమైన నిర్ణయాలతో టీమ్​ను గెలుపు బాటలో నడపాల్సిందన్నాడు. కానీ అది కుదరలేదన్నాడు. బ్యాక్ టు బ్యాక్ మ్యాచుల్లో ఓడిపోవడం కరెక్ట్ కాదని.. పరాభవాల్లో ఉన్నామనే విషయాన్ని తాము యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పాడు. అసలు ప్రాబ్లమ్ ఎక్కడ ఉందనే దాని మీద కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందన్నాడు. భారీ స్కోర్లు చేయడంలో తాము విఫలం అవుతున్నామని.. అదే ఓటములకు ముఖ్య కారణంగా మారిందన్నాడు శాంసన్.

‘ఓటములను హుందాగా ఒప్పుకొని, దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తాం. దీని గురించి చర్చించేందుకు ఇదే కరెక్ట్ టైమ్. వరుసగా 4 మ్యాచుల్లో ఓడిపోయాం. మా టీమ్​కు ఏది వర్కౌట్ కావడం లేదో కనిపెట్టి పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మా జట్టులో మ్యాచ్ విన్నర్లకు కొరత లేదు. సింగిల్ హ్యాండ్​తో మ్యాచ్​ స్వరూపాన్ని మార్చే సత్తా ఉన్నవాళ్లు చాలా మందే ఉన్నారు. వాళ్లలో నుంచి ఎవరో ఒకరు అపోజిషన్ టీమ్స్ మీద విరుచుకుపడాలి. అద్భుతంగా ఆడుతూ రాజస్థాన్​ను గెలిపించేందుకు మ్యాచ్ విన్నర్స్ ప్రయత్నించాలి’ అని సంజూ కోరాడు. పంజాబ్​తో మ్యాచ్​లో మరో 25 నుంచి 30 పరుగులు చేసి ఉంటే గెలిచేవాళ్లమని పేర్కొన్నాడు శాంసన్. మరి.. రాజస్థాన్ వరుస పరాజయాలకు ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Cricbuzz (@cricbuzzofficial)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి