Nidhan
ఓటమి అనేదే లేకుండా దూసుకెళ్తున్న రాజస్థాన్‌కు, గెలుపు కోసం తహతహలాడుతున్న బెంగళూరుకు మధ్య మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ఓటమి అనేదే లేకుండా దూసుకెళ్తున్న రాజస్థాన్‌కు, గెలుపు కోసం తహతహలాడుతున్న బెంగళూరుకు మధ్య మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Nidhan
ఓటమి అనేదే లేకుండా దూసుకెళ్తున్న టీమ్ ఒకటి. వరుస పరాజయాలతో డీలాపడ్డ టీమ్ మరొకటి. ఈ రెండింటి మధ్య ఆసక్తికర పోరుకు అంతా సిద్ధమైంది. ఈ రెండు జట్లు మరేవో కాదు.. ఒకటి రాజస్థాన్ రాయల్స్, మరొకటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. హ్యాట్రిక్ విజయాలతో ఐపీఎల్-2024లో బ్రేకుల్లేని బుల్డోజర్లా దూసుకెళ్తోంది సంజూ సేన. అలాంటి టీమ్ రేపు ఆర్సీబీని ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి విజయాలో జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఇక, ఆడిన 4 మ్యాచుల్లో మూడింట్లో ఓడిన బెంగళూరు ఎలాగైనా ఈ మ్యాచ్‌తో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఈ టీమ్స్ ప్లేయింగ్ ఎలెవన్, విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీద ఉంది రాజస్థాన్. బ్యాటింగ్‌లో రియాన్ పరాగ్ రఫ్ఫాడిస్తుండటం టీమ్‌కు కలిసొచ్చే అంశం. అతడితో పాటు మిగతా బ్యాటర్లు కూడా ఫర్వాలేదనిపిస్తున్నారు. కానీ ఎవరూ బిగ్ స్కోర్స్ చేయడం లేదు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్ నుంచి భారీ ఇన్నింగ్స్‌లు కోరుకుంటోంది టీమ్. ఇప్పటివరకు గెలిచిన మ్యాచుల్లో పరాగ్ ఒక్కడే అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. ఒకవేళ పరాగ్ ఫెయిలైతే పరిస్థితి ఏంటనేదది అర్థం కాకుండా ఉంది. బౌలింగ్‌లో యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, నండ్రే బర్గర్ సూపర్ ఫామ్‌లో ఉండటం బిగ్ ప్లస్. సంజూ శాంసన్ బ్యాట్‌తో ఫర్వాలేదనిపిస్తున్నాడు. కెప్టెన్సీలో అతడు తన మార్క్‌ను చూపిస్తూ టీమ్‌ను విజయాల బాటలో నడిపిస్తున్నాడు.
రెండో మ్యాచ్‌లో నెగ్గి టోర్నీలో బోణీ కొట్టిన ఆర్సీబీ.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. వరుస ఓటముల కారణంగా ఆటగాళ్లతో పాటు ఆ టీమ్ ఫ్యాన్స్ కూడా డీలాపడ్డారు. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ తప్ప ఎవరూ రాణించడం లేదు. టీమ్‌కు అతిపెద్ద బలమైన కింగ్ ఫెయిలైతే పరిస్థితి ఏంటనేది అర్థం కావడం లేదు. మొదట్లో అదరగొట్టిన దినేష్ కార్తీక్ గత మ్యాచ్‌లో ఫెయిలయ్యాడు. మహిపాల్ లోమ్రోర్, అనూజ్ రావత్ లాంటి డొమెస్టిక్ ప్లేయర్లు ఫర్వాలేదనిపిస్తున్నారు.
కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్ అట్టర్ ఫ్లాప్ అవుతుండటం బెంగళూరును దెబ్బతీస్తోంది. బౌలింగ్‌లో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఫ్లాప్ షో టీమ్‌కు బిగ్ మైనస్‌గా మారింది. అల్జారీ జోసెఫ్ ప్లేస్‌లో వచ్చిన రీస్ టోప్లే కూడా భారీగా రన్స్ లీక్ చేస్తున్నాడు. ఇలా ప్లస్‌ల కంటే ఆర్సీబీలో మైనస్‌లే ఎక్కువ. వరుస ఓటముల కారణంగా ఆ టీమ్ ప్లేయర్ల బాడీ లాంగ్వేజ్ కూడా డౌన్లో ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ నిరుత్సాహంగా కనిపించడం, ఓటమి బాధతో బల్లను కొట్టడమే ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు.
ఈ ఇరు జట్ల బలాబలాలు గమనించాక రేపటి మ్యాచ్‌లో రాజస్థాన్ గెలవడం పక్కా. ఈ రెండు టీమ్స్ మధ్య ఇప్పటిదాకా 30 మ్యాచ్‌లు జరిగాయి. అందులో 15 సార్లు బెంగళూరు నెగ్గగా.. 12 సార్లు రాజస్థాన్‌ను విజయం వరించింది. అయితే ఆర్సీబీ టీమ్ కాంబినేషన్ సరిగ్గా లేకపోవడం, బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ యూనిట్ ఫెయిల్యూర్, వరుస ఓటములతో డీలా పడిపోవడాన్ని బట్టి రేపటి మ్యాచ్‌లో సంజూ సేనను నిలువరించడం ఆ టీమ్ వల్ల కాదు.
రాజస్థాన్: యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, శివమ్ దూబె, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయిర్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, నండ్రే బర్గర్.
బెంగళూరు:
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, అనూజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్, మయాంక్ డగర్, రీస్ టోప్లే, మహ్మద్ సిరాజ్.