iDreamPost

అన్​క్యాప్డ్ ప్లేయర్ల సక్సెస్​ను తట్టుకోలేకపోతున్న స్టార్స్.. ఈ వీడియోనే ప్రూఫ్!

  • Published Apr 05, 2024 | 4:06 PMUpdated Apr 05, 2024 | 4:33 PM

ఈసారి ఐపీఎల్​లో అన్​క్యాప్డ్ ప్లేయర్ల హడావుడి మామూలుగా లేదు. చాలా మ్యాచ్​ల్లో డొమెస్టిక్ క్రికెటర్లే తమ టీమ్స్​ను సింగిల్ హ్యాండ్​తో గెలిపిస్తున్నారు. దీంతో వీళ్ల సక్సెస్​ను స్టార్ ప్లేయర్స్ తట్టుకోలేకపోతున్నారు.

ఈసారి ఐపీఎల్​లో అన్​క్యాప్డ్ ప్లేయర్ల హడావుడి మామూలుగా లేదు. చాలా మ్యాచ్​ల్లో డొమెస్టిక్ క్రికెటర్లే తమ టీమ్స్​ను సింగిల్ హ్యాండ్​తో గెలిపిస్తున్నారు. దీంతో వీళ్ల సక్సెస్​ను స్టార్ ప్లేయర్స్ తట్టుకోలేకపోతున్నారు.

  • Published Apr 05, 2024 | 4:06 PMUpdated Apr 05, 2024 | 4:33 PM
అన్​క్యాప్డ్ ప్లేయర్ల సక్సెస్​ను తట్టుకోలేకపోతున్న స్టార్స్.. ఈ వీడియోనే ప్రూఫ్!

ఈసారి ఐపీఎల్​లో అన్​క్యాప్డ్ ప్లేయర్ల హడావుడి మామూలుగా లేదు. చాలా మ్యాచ్​ల్లో డొమెస్టిక్ క్రికెటర్లే తమ టీమ్స్​ను సింగిల్ హ్యాండ్​తో గెలిపిస్తున్నారు. కోట్లకు కోట్లు పోసి కొనుక్కున్న స్టార్ ఆటగాళ్ల కంటే వీళ్లే చాలా బాగా ఆడుతున్నారు. ఎలాంటి అంచనాలు లేకపోవడం, తమను తాము ప్రూవ్ చేసుకోవాలనే కసి, టీమ్​ను గెలిపిస్తే మంచి క్రేజ్ కూడా వస్తుండటంతో యంగ్ ప్లేయర్స్ చెలరేగుతున్నారు. ఆ టీమ్, ఈ టీమ్ అనేం లేదు.. ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో దాదాపుగా అన్ని జట్లలోనూ అన్​క్యాప్డ్ క్రికెటర్లదే హవా నడుస్తోంది. మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, మహిపాల్ లోమ్రోర్ లాంటి డొమెస్టిక్ స్టార్స్ తమ సత్తా చూపిస్తున్నారు. అయితే వీళ్ల సక్సెస్​ను కొందరు స్టార్స్ తట్టుకోలేకపోతున్నారు. దీనికి ఈ వీడియోనే ప్రూఫ్.

గుజరాత్ టైటాన్స్​తో జరిగిన మ్యాచ్​లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. ఆఖరి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్​లో ఇంకా ఒక్క బాల్ ఉందనగా గెలిచింది పంజాబ్. గుజరాత్ నిర్దేశించిన 200 పరుగుల టార్గెట్​ను ఛేదించింది. అయితే ఈ విజయంలో కీలకపాత్ర పోషించాడు శశాంక్ సింగ్. 29 బంతులు ఎదుర్కొన్న ఈ బ్యాటర్ 6 బౌండరీలు, 4 సిక్సుల సాయంతో 61 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. ఆఖరి వరకు క్రీజులో నిలిచి విన్నింగ్​ షాట్​గా బౌండరీ కొట్టి మ్యాచ్​ను ఫినిష్ చేశాడు. ఒక దశలో 111/5తో పీకల్లోతు కష్టాల్లో ఉన్న పంజాబ్​ను అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31) సాయంతో ఒడ్డున పడేశాడు శశాంక్. ఈ జోడీ మెరుపు బ్యాటింగ్​తో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోయడం వల్లే పంజాబ్​కు విజయం సాధ్యమైంది. అయితే శశాంక్​కు అవమానం ఎదురైంది.

అద్భుతమైన బ్యాటింగ్​లో పంజాబ్​ను గెలిపించిన శశాంక్ 25 బంతుల్లో ఫిఫ్టీ మార్క్​ను చేరుకున్నాడు. అయితే ఆ సమయంలో డగౌట్​లో కూర్చున్న కెప్టెన్ శిఖర్ ధావన్, పేసర్ అర్ష్​దీప్ సింగ్ సహా ఏ పంజాబ్ ఆటగాడు కూడా అతడ్ని అభినందించలేదు. ఒక ప్లేయర్ హాఫ్ సెంచరీ లేదా సెంచరీ మార్క్​ను చేరుకున్నప్పుడు లేచి నిలబడి చప్పట్లు కొట్టడం, అభినందించడం అనేది ట్రెడిషన్. కానీ శశాంక్ ధనాధన్ బ్యాటింగ్​తో ఫిఫ్టీ కొట్టినా, ఆపదలో ఉన్న టీమ్​ను విజయానికి చేరువగా తీసుకొచ్చినా డగౌట్​లోని ఒక్క ఆటగాడు కూడా అతడ్ని అభినందించలేదు. నాన్​ స్ట్రయికర్ అశుతోష్ ఒక్కడే ఎంకరేజ్ చేశాడు.

ఎవరూ అభినందించకపోయినా శశాంక్ ఏమాత్రం నిరుత్సాహ పడకుండా ఆఖరి వరకు ఆడి మ్యాచ్​ను ఫినిష్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. అన్​క్యాప్డ్ ప్లేయర్ల సక్సెస్​ను స్టార్లు తట్టుకోలేకపోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు స్టార్లుగా చలామణి అవుతున్న వారు ఒకప్పుడు అనామకులేనని.. ఇలా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదని సీరియస్ అవుతున్నారు. క్రికెట్ టీమ్ గేమ్ అని.. ఒకరికొకరు సాయం చేసుకుంటూ, ఎంకరేజ్ చేసుకుంటూ ఆడితేనే విజయాలు దక్కుతాయని సూచిస్తున్నారు. మరి.. శశాంక్ హాఫ్ సెంచరీ మార్క్​ను చేరుకున్నా టీమ్ ప్లేయర్లు అభినందించకపోవడం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: కోట్లు తీసుకునే స్టార్స్ కంటే వీళ్లే తోపు.. సింగిల్ హ్యాండ్​తో గెలిపిస్తున్న అన్​క్యాప్డ్ స్టార్స్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి