Nidhan
రాజస్థాన్ రాయల్స్ యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ క్రేజీ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ సీజన్లో ఎవరికీ సాధ్యం కానిది అతడు చేసి చూపించాడు.
రాజస్థాన్ రాయల్స్ యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ క్రేజీ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ సీజన్లో ఎవరికీ సాధ్యం కానిది అతడు చేసి చూపించాడు.
Nidhan
టీమ్‌లో అతడు అవసరమా అన్నారు. ఓవరాక్షన్ చేయడానికి తప్ప దేనికీ పనికిరాడని విమర్శించారు. ఇలాంటోడ్ని ఎలా తీసుకున్నారని ట్రోల్ చేశారు. కానీ ఈ సీజన్లో జట్టును అతడే కాపాడాడు. కష్టసమయాల్లో టీమ్‌ను ఆదుకొని విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. అతడే రాజస్థాన్ రాయల్స్ యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్. గత కొన్ని సీజన్లలో చెత్తాట, ఓవరాక్షన్‌తో విమర్శలపాలైన ఈ బ్యాట్స్‌మన్.. ఈసారి మాత్రం దుమ్మురేపుతున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. ఇవాళ పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లోనూ అతడి బ్యాట్ గర్జించింది. 34 బంతుల్లోనే 48 పరుగులు చేశాడు పరాగ్.
బౌండరీలు, సిక్సులుతో దుమ్మురేపే పరాగ్.. పంజాబ్‌తో మ్యాచ్‌లో యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. వికెట్ కాపాడుకుంటూ స్కోరు బోర్డును కదిలించడంపై ఫోకస్ చేశాడు. 42 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జట్టు గౌరవప్రదమైన స్కోరుకు చేరుకునేలా చూశాడు. ఈ క్రమంలో అతడు క్రేజీ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ సీజన్లో ఎవరికీ సాధ్యం కానిది అతడు చేసి చూపించాడు. పంజాత్తో మ్యాచ్‌తో 500 పరుగులు పూర్తి చేసుకున్నాడు పరాగ్. తద్వారా ఈ సీజన్లో ఐదొందల పరుగుల క్లబ్లో చేరిన ఫస్ట్ అన్క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. ఇతర జట్లలోనూ కొందరు అన్క్యాప్డ్ ప్లేయర్లు రఫ్ఫాడిస్తున్నారు. అయితే వారి కంటే ముందుగానే 500 రన్స్ కంప్లీట్ చేశాడు. మరి.. పరాగ్ బ్యాటింగ్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Riyan Parag is the first uncapped Player to complete 500 runs in IPL 2024. 💥
– The future star of India….!!!! pic.twitter.com/p1ugptieiX
— Johns. (@CricCrazyJohns) May 15, 2024