Nidhan
సెన్సేషనల్ బౌలింగ్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు లక్నో పేసుగుర్రం మయాంక్ యాదవ్. వరుసగా రెండు మ్యాచుల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఈ స్పీడ్‌స్టర్.. తన గోల్ ఏంటో చెప్పేశాడు.
సెన్సేషనల్ బౌలింగ్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు లక్నో పేసుగుర్రం మయాంక్ యాదవ్. వరుసగా రెండు మ్యాచుల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఈ స్పీడ్‌స్టర్.. తన గోల్ ఏంటో చెప్పేశాడు.
Nidhan
ఐపీఎల్-2024లో ఓ బౌలర్ హాట్ టాపిక్‌గా మారాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా అతడి గురించి మాట్లాడుకుంటున్నాడు. పేస్ బౌలింగ్‌కు అతడ్ని కొత్త డెఫినిషన్‌గా చెప్పుకుంటున్నారు. అతడే మయాంక్ యాదవ్. ఈ లక్నో సూపర్ జియాంట్స్ బౌలర్ బంతులు సంధిస్తున్న తీరుకు అంతా ఫిదా అయిపోతున్నారు. 150 కిలోమీటర్ల వేగంతో కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌లో నిలకడగా బంతులు వేస్తూ బ్యాటర్లను గడగడలాడిస్తున్నాడు మయాంక్. వరుసగా ఆడిన రెండు మ్యాచుల్లోనూ సూపర్బ్ స్పెల్స్‌తో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారాడు. ఆర్సీబీతో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. బ్యాటర్లకు పీడకలగా మారిన ఈ యంగ్ పేసర్ ఇది జస్ట్ ఆరంభం మాత్రమే అని అంటున్నాడు. అతడు తన గోల్ ఏంటో చెప్పేశాడు.
పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో మయాంక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వరుసగా రెండు మ్యాచుల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకోవడం మంచి విషయమన్నాడు. అయితే అవార్డుల కంటే కూడా మ్యాచులు నెగ్గినందుకు తాను హ్యాపీగా ఉన్నానని చెప్పాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడమే తన గోల్ అని.. టీమిండియాకు ఆడాలని ఉందని తెలిపాడు మయాంక్. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమేనన్న యంగ్ పేసర్.. ఇంకా సాధించాల్సింది చాలా ఉందన్నాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో కామెరాన్ గ్రీన్‌ను ఔట్ చేయడాన్ని చాలా ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చాడు. ఇక, బెంగళూరుతో మ్యాచ్‌లో గ్రీన్‌తో పాటు డేంజరస్ బ్యాటర్ గ్లెన్ మాక్స్వెల్, రజత్ పాటిదార్‌ను పెవిలియన్‌కు పంపాడు మయాంక్.
ఆర్సీబీతో మ్యాచ్‌తో పలు రికార్డులను తన అకౌంట్లో వేసుకున్నాడు మయాంక్. బ్యాక్ టు బ్యాక్ 2 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడీ పేసర్. తద్వారా ఐపీఎల్ హిస్టరీలో ఆడిన తొలి రెండు మ్యాచుల్లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాలను అందుకున్న ఫస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు. అలాగే 155 కిలోమీటర్లకు పైగా వేగంతో అత్యధిక సార్లు బంతులు విసిరిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటిదాకా 50 బంతులు వేసిన మయాంక్.. అందులో మూడుసార్లు 155 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేశాడు. బెంగళూరుతో మ్యాచ్‌లో 156.7 కిలోమీటర్ల వేగంతో ఓ బంతిని సంధించిన మయాంక్.. ఫాస్టెస్ట్ బౌలర్స్ లిస్టులో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో షాన్ టెయిట్ (157.7 కిలోమీటర్లు) ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో లాకీ ఫెర్గూసన్ (157.3), ఉమ్రాన్ మాలిక్ (157) ఉన్నారు. మరి.. భారత్‌కు ఆడటమే తన లక్ష్యం అంటున్న మయాంక్ దాన్ని సాధించగలడని మీరు నమ్ముతున్నట్లయితే కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: RCB vs LSG: వీడియో: పూరన్ భారీ సిక్సర్.. కొడితే స్టేడియం బయట పడింది!
Mayank Yadav said “More than 2 POTM, I am happy that we won both games & my goal is to play for my country”. pic.twitter.com/dLRSsYzjgi
— Johns. (@CricCrazyJohns) April 2, 2024