Nidhan
లక్నో ఎక్స్‌ప్రెస్ మయాంక్ యాదవ్ రెండో మ్యాచ్‌లోనూ సంచలన బౌలింగ్‌తో రెచ్చిపోయాడు. ఆర్సీబీ బ్యాటర్లను గడగడలాడించాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను సాధించాడతను.
లక్నో ఎక్స్‌ప్రెస్ మయాంక్ యాదవ్ రెండో మ్యాచ్‌లోనూ సంచలన బౌలింగ్‌తో రెచ్చిపోయాడు. ఆర్సీబీ బ్యాటర్లను గడగడలాడించాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను సాధించాడతను.
Nidhan
మయాంక్ యాదవ్.. ఈసారి ఐపీఎల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. అద్భుతమైన పేస్ బౌలింగ్‌తో అందరి హృదయాలను గెలుచుకుంటున్నాడీ యువ పేసర్. 150 కిలోమీటర్లకు తగ్గని వేగంతో అతడు వేసే బుల్లెట్ బంతులకు బ్యాటర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. షాట్లు కొట్టడం పక్కనబెడితే కనీసం బాల్‌ను టచ్ చేద్దామన్నా దొరకడం లేదు. క్విక్ పేస్‌తో బంతులు సంధించడమే కాదు.. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లకు నిద్రలేని రాత్రులను పరిచయం చేస్తున్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఫాస్టెస్ట్ డెలివరీ వేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ లక్నో పేసర్.. ఇప్పుడు మరో ఘతనను అందుకున్నాడు. ఆర్సీబీతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చరిత్ర సృష్టించాడతను.
ఐపీఎల్ హిస్టరీలోనే మూడు సార్లు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసిన స్పీడ్‌స్టర్‌గా నిలిచాడు మయాంక్. కేవలం 2 మ్యాచుల్లో 50 బంతులు మాత్రమే వేసిన అతడు ఈ ఫీట్ సాధించాడు. సన్‌రైజర్స్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్, ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ అన్రిచ్ నోకియా మాత్రమే 2 సార్లు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేశారు. వాళ్లిద్దర్నీ మయాంక్ అధిగమించాడు. బెంగళూరుతో మ్యాచ్‌లో అతడు ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓ బాల్‌ను ఏకంగా 156.7 కిలోమీటర్ల వేగంతో వేశాడు మయాంక్. ఐపీఎల్ చరిత్రలో షాన్ టెయిట్ వేసిన 157.7 కిలోమీటర్ల బాల్ ఫాస్టెస్ట్ డెలివరీగా ఉంది. అతడి తర్వాత లాకీ ఫెర్గూసన్ (157.3), ఉమ్రాన్ మాలిక్ (157.0) ఉన్నారు.
ఫాస్టెస్ట్ బౌలర్స్ లిస్ట్‌లో మయాంక్ (156.7 కిలోమీటర్లు) నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో అత్యధిక సార్లు బౌలింగ్ చేసిన వారి లిస్ట్‌లో మాత్రం అతడే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో అతడు మ్యాజికల్ స్పెల్ వేశాడు. 4 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బుల్లెట్ పేస్‌తో అతడు విసిరిన బంతులకు టాప్ బ్యాటర్స్ గ్లెన్ మాక్స్వెల్ (0), కామెరాన్ గ్రీన్ (9)కి మైండ్ బ్లాంక్ అయింది. వీళ్లిద్దర్నీ మయాంక్ వెనక్కి పంపాడు. అలాగే మంచి ఊపు మీదున్న రజత్ పాటిదార్ (29)ను కూడా ఔట్ చేశాడు. దీంతో లక్నో సంధించిన 181 పరుగుల టార్గెట్‌ను రీచ్ కాలేకపోయింది బెంగళూరు. 153 పరుగులకు ఆలౌట్ అయింది డుప్లెసిస్ సేన. గత మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన మయాంక్.. ఈ మ్యాచ్‌లోనూ ఆ అవార్డును కొట్టేశాడు. మరి.. మయాంక్ సెన్సేషనల్ రికార్డుపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
MAYANK YADAV HAS MOST 155KMPH+ DELIVERIES IN IPL HISTORY…!!! 💥
– Mayank hasn’t even bowled 50 balls. 🤯 pic.twitter.com/AldPc02OKI
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 2, 2024