iDreamPost
android-app
ios-app

అనవసరంగా కోహ్లీని తిడుతున్నారు.. అతడు చేసింది తప్పే కాదు!

  • Published Mar 30, 2024 | 4:18 PM Updated Updated Mar 30, 2024 | 4:18 PM

కోల్​కతా చేతిలో బెంగళూరు ఓడిపోవడంతో అంతా విరాట్ కోహ్లీని విమర్శిస్తున్నారు. అతడి వల్లే ఆర్సీబీ ఓడిందని తిడుతున్నారు. అయితే అతడు చేసింది తప్పే కాదు. కోహ్లీని ట్రోల్ చేసే వారు ముందు ఈ నిజాలు తెలుసుకోవాలి.

కోల్​కతా చేతిలో బెంగళూరు ఓడిపోవడంతో అంతా విరాట్ కోహ్లీని విమర్శిస్తున్నారు. అతడి వల్లే ఆర్సీబీ ఓడిందని తిడుతున్నారు. అయితే అతడు చేసింది తప్పే కాదు. కోహ్లీని ట్రోల్ చేసే వారు ముందు ఈ నిజాలు తెలుసుకోవాలి.

  • Published Mar 30, 2024 | 4:18 PMUpdated Mar 30, 2024 | 4:18 PM
అనవసరంగా కోహ్లీని తిడుతున్నారు.. అతడు చేసింది తప్పే కాదు!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గాడిలో పడినట్టే పడి మళ్లీ ట్రాక్ తప్పింది. తొలి మ్యాచ్​లో చెన్నై చేతిలో ఓడిన డుప్లెసిస్ సేన.. వెంటనే తేరుకొని పంజాబ్ కింగ్స్​ మీద విక్టరీ కొట్టింది. దీంతో ఇదే జోష్​ను కంటిన్యూ చేస్తూ వరుస విజయాలు అందుకుంటుందని అభిమానులు అనుకున్నారు. కానీ మూడో మ్యాచ్​లో సొంతగడ్డ మీద కోల్​కతా నైట్​ రైడర్స్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లకు 182 రన్స్ చేసింది. భారీ టార్గెట్​ను కేకేఆర్ 16.5 ఓవర్లలోనే ఊదిపారేసింది. ఈ మ్యాచ్​లో బెంగళూరు టీమ్​లో విరాట్ కోహ్లీ (59 బంతుల్లో 83 నాటౌట్) ఒక్కడే హాఫ్ సెంచరీ బాదాడు. కామెరాన్ గ్రీన్ (33), గ్లెన్ మాక్స్​వెల్ (28) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. చివర్లో దినేష్ కార్తీక్ (8 బంతుల్లో 20) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే కోహ్లీ ఆఖరి వరకు నిలబడి ఇన్నింగ్స్​ను నడిపించినా ఈ ఓటమికి అతడే బాధ్యుడు అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కోహ్లీ వల్లే ఆర్సీబీ ఓడిపోయిందని, అతడి స్లో బ్యాటింగ్ టీమ్ కొంప ముంచిందని కొందరు క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇన్నింగ్స్​లో సగం ఓవర్లు విరాట్ ఆడాడని.. కానీ చేసింది 83 పరుగులేనని, అతడి వల్లే మ్యాచ్ పోయిందని తిడుతున్నారు. కింగ్ కనీసం 100 నుంచి 120 పరుగులు చేసి ఉంటే బెంగళూరు స్కోరు ఈజీగా 200 దాటేదని.. అప్పుడు కేకేఆర్​కు ఛేజింగ్ కష్టమయ్యేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే స్టార్ బ్యాటర్​ను విమర్శించే వాళ్లు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ మ్యాచ్​లో కోహ్లీ తనకు అలవాటైన స్టైల్​లోనే ఆడాడు. సింగిల్స్, డబుల్స్​తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూనే మధ్యలో బౌండరీలు, సిక్సులు బాదాడు. వికెట్ల మీద వికెట్లు పడతుండటంతో యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఒక ఎండ్​లో తాను నిలబడి స్కోరు బోర్డును కదిలిస్తూ పోయాడు. అతడు 140 స్ట్రయిక్ రేట్​తో రన్స్ చేస్తూ వెళ్లాడు.

Kohli is being scolded unnecessarily

ఆఖర్లో గేర్లు మార్చి మరింత జోరు పెంచుదామంటే వరుస విరామాల్లో వికెట్లు పడ్డాయి. బాల్ పడ్డాక సరిగ్గా బ్యాట్ మీదకు రాకపోవడంతో మాక్స్​వెల్​తో పాటు అనుజ్ రావత్ కూడా షాట్లు బాదలేకపోయారు. అయినా వాళ్లను ఎవ్వరూ ఏదీ అనడం లేదు. ఒంటరి పోరాటం చేసిన విరాట్​ను మాత్రం తిడుతున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్? ఫస్ట్ ఇన్నింగ్స్​లో షాట్లు కనెక్ట్ కాక దాదాపుగా ప్రతి బ్యాటర్ ఇబ్బంది పడ్డాడు. ఆ సమయంలో కోహ్లీ భారీ షాట్​కు ప్రయత్నించి ఔట్ అయి ఉంటే ఆర్సీబీ ఆ మాత్రం స్కోరు కూడా చేసేది కాదు. ఒక ఎండ్​లో విరాట్ ఉన్నాడనే ధీమాతోనే ఆఖర్లో కార్తీక్ బ్యాట్ ఝళిపించాడు. దీన్ని ఎవరూ గుర్తించడం లేదని కోహ్లీ ఫ్యాన్స్ అంటున్నారు. రెండో ఇన్నింగ్స్​లో మాదిరిగా పిచ్ నుంచి మరింత హెల్ప్ దొరికినా లేదా సహచర బ్యాటర్లలో ఎవరో ఒకరు తనకు అండగా నిలిచినా కోహ్లీ ఇంకా స్వేచ్ఛగా ఆడేవాడని చెబుతున్నారు. మరి.. ఆర్సీబీ ఓటమికి విరాట్ కారణమంటూ వస్తున్న విమర్శల మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: పతిరాణా ధోని కాళ్లు మొక్కలేదు.. అంతా ఫేక్‌! బయటికొచ్చిన రియల్‌ వీడియో