RCB vs KKR: బెంగళూరు vs కోల్​కతా.. గెలుపెవరిదంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

ఒక్కో విజయంతో జోరు మీదున్న రెండు టాప్ టీమ్స్ మధ్య మ్యాచ్​కు అంతా రెడీ అయింది. రెండో విక్టరీతో ప్రత్యర్థులకు డేంజర్ సిగ్నల్స్ పంపాలని చూస్తున్నాయా జట్లు. అవే బెంగళూరు, కోల్​కతా. ఈ మ్యాచ్​లో గెలుపెవరిదంటే..

ఒక్కో విజయంతో జోరు మీదున్న రెండు టాప్ టీమ్స్ మధ్య మ్యాచ్​కు అంతా రెడీ అయింది. రెండో విక్టరీతో ప్రత్యర్థులకు డేంజర్ సిగ్నల్స్ పంపాలని చూస్తున్నాయా జట్లు. అవే బెంగళూరు, కోల్​కతా. ఈ మ్యాచ్​లో గెలుపెవరిదంటే..

ఒక్కో విజయంతో జోరు మీదున్న రెండు టాప్ టీమ్స్ మధ్య మ్యాచ్​కు అంతా రెడీ అయింది. రెండో విక్టరీతో ప్రత్యర్థులకు డేంజర్ సిగ్నల్స్ పంపాలని చూస్తున్నాయా జట్లు. అవే బెంగళూరు, కోల్​కతా. ఆడిన తొలి మ్యాచ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ మీద థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది కేకేఆర్. అదే జోరును కంటిన్యూ చేస్తూ ఆర్సీబీని కూడా చిత్తు చేయాలని చూస్తోంది. అయితే రెండో మ్యాచ్​లో గెలుపుతో ట్రాక్​ మీదకు వచ్చిన డుప్లెసిస్ సేన సెకండ్ విన్ నమోదు చేయాలని చూస్తోంది. ఈ ఇరు టీమ్స్ మధ్య శుక్రవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆసక్తికర పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు టీమ్స్ బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఈ సీజన్​ను ఓటమితో స్టార్ట్ చేసింది ఆర్సీబీ. తొలి మ్యాచ్​లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. అయితే వెంటనే తేరుకున్న డుప్లెసిస్ సేన.. రెండో మ్యాచ్​లో పంజాబ్ కింగ్స్​ను ఓడించింది. ఈ టీమ్​కు అతిపెద్ద బలం విరాట్ కోహ్లీ. బ్యాటర్​గా అదరగొట్టడమే గాక.. సీనియర్ ప్లేయర్​గా ఫీల్డింగ్ టైమ్​లోనూ అతడు కీలకంగా మారుతున్నాడు. పంజాబ్​తో మ్యాచ్​లో 77 పరుగుల సూపర్బ్​ నాక్​తో మెరిశాడు కింగ్. అదే మ్యాచ్​లో 10 బంతుల్లో 28 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు వెటరన్ బ్యాటర్ దినేష్​ కార్తీక్. అతడితో పాటు మహిపాల్ లోమ్రోల్ రాణిస్తుండటం టీమ్​కు కలిసొచ్చే అంశం.

కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఫామ్​ను అందుకోవాల్సి ఉంది. అయితే యంగ్ బ్యాటర్ రజత్ పాటిదార్ ఆర్సీబీకి పెద్ద మైనస్​గా తయారయ్యాడు. అతడితో పాటు కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్​వెల్ బ్యాటింగ్ ఫెయిల్యూర్​ టీమ్​ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. బౌలింగ్​లో సిరాజ్, దయాల్ రాణిస్తున్నారు. మాక్సీ కూడా తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. అయితే గ్రీన్, డగర్, జోసెఫ్ వికెట్లు తీయకపోగా.. భారీగా పరుగులు ఇచ్చుకోవడం వీక్​నెస్​గా చెప్పుకోవచ్చు.

కోల్​కతా నైట్ రైడర్స్

కోల్​కతాకు అతిపెద్ద బలం ఆ టీమ్ బ్యాటింగ్ యూనిట్. ఫిల్ సాల్ట్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రానా, రింకూ సింగ్, అండ్రీ రస్సెల్ రూపంలో స్ట్రాంగ్ బ్యాటింగ్ యూనిట్ ఆ జట్టు సొంతం. తొలి మ్యాచ్​లో సాల్ట్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. రింకూ, రమణ్​దీప్ కూడా ఆకట్టుకున్నాడు. రస్సెస్ 25 బంతుల్లో 64 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. మిగిలిన బ్యాటర్లు కూడా ఫామ్​లోకి వస్తే కేకేఆర్​కు తిరుగుండదు. అయితే రూ.25 కోట్ల ఆటగాడైన మిచెల్ స్టార్క్ ఫస్ట్ మ్యాచ్​లో పూర్తిగా తేలిపోయాడు. వికెట్ తీయకపోగా 4 ఓవర్లలో 53 పరుగులు సమర్పించుకున్నాడు. వరుణ్ చక్రవర్తి కూడా భారీగా రన్స్ లీక్ చేస్తున్నాడు. వీళ్లిద్దరూ టీమ్​కు మైనస్​గా మారారు. అయితే రస్సెల్, హర్షిత్ రానా, సునీల్ నరైన్ బాగా బౌలింగ్ చేస్తున్నారు.

ప్రిడిక్షన్

ఈ రెండు టీమ్స్ మధ్య ఇప్పటిదాకా 32 మ్యాచ్​లు జరిగాయి. ఇందులో 14 సార్లు బెంగళూరు నెగ్గగా.. 18 సార్లు కోల్​కతా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో ఆర్సీబీ గెలవడం ఖాయం. ఆ జట్టు ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్, సొంత గ్రౌండ్​లో మ్యాచ్ జరుగుతుండటం, భారీ ఇన్నింగ్స్​లు ఆడే విరాట్ కోహ్లీ ఊపు మీద ఉండటం చూస్తుంటే బెంగళూరును అడ్డుకోవడం కేకేఆర్​కు కష్టమే.

ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)

బెంగళూరు:
ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, కామెరాన్ గ్రీన్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్​వెల్, అనూజ్ రావత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, కర్ణ్ శర్మ, అల్జారీ జోసెఫ్​, మహ్మద్ సిరాజ్, యష్ దయాల్.

ఇంపాక్ట్ ప్లేయర్లు: మహిపాల్ లోమ్రోర్, సుయాష్ ప్రభుదేశాయ్, స్వప్నిల్ సింగ్, వైషల్ విజయ్​కుమార్, ఆకాశ్​దీప్.

కోల్​కతా:
ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రానా, రమణ్​దీప్ సింగ్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, మిచెల్ స్టార్క్, సునీల్ నరైన్, హర్షిత్ రానా, వరుణ్​ చక్రవర్తి.

ఇంపాక్ట్ ప్లేయర్లు: సుయాష్ శర్మ, వైభవ్ అరోరా, అంగ్ర్కిష్​ రఘువంశీ, మనీష్​ పాండే, రెహ్మానుల్లా గుర్బాజ్.

ఇదీ చదవండి: SRH గెలిచినా MIదే అరుదైన రికార్డు.. హార్దిక్ సేనను మెచ్చుకోవాల్సిందే!

Show comments